గ్రహాలు చిహ్నములు - రాశి చిహ్నములు
30, సెప్టెంబర్ 2026, బుధవారం
7, నవంబర్ 2023, మంగళవారం
హిమాలయ ‘రాక్ సాల్ట్”
హిమాలయ ‘రాక్ సాల్ట్”
హిమాలయాల నుండి తవ్విన గులాబీ రంగు స్పటికాలను ఉపయోగించి రాక్ సాల్ట్ ను తయారుచేస్తారు. ఇవి ముఖ్యంగా హిమాలయాల్లో నుండి లభిస్తాయి. హిమాలయాల నుండి వచ్చిన రాక్ సాల్ట్ స్టోన్స్ ప్రదానంగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అని శాస్త్రీయంగా నిరూపితమైనది. ఈ రాక్ సాల్ట్ స్టోన్ నందు హైగ్రోస్కోపిక్ లక్షణాలు ఉండటం వలన ఆస్తమా, దగ్గు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆనారోగ్య సమస్యలను నివారిస్తాయి.
హిమాలయ రాక్ సాల్ట్ స్టోన్ కి కొంత కాంతిని ఉపయోగించటం వలన శరీరంలోని నరాల బలహీనత, బద్ధకం, ఒత్తిడి, చెడు ఆలోచన విదానాన్ని తొలగిస్తాయి. అంతేకాక మొభైల్ ఫోన్ల నుండి, మొభైల్ టవర్ల, రేడియో టవర్ల నుండి టెలివిజన్ మరియు ఇతర ఎలట్రానిక్ పరికరాల నుండి వచ్చే ప్రతికూల తరంగాల నుండి రక్షిస్తుంది.
17, డిసెంబర్ 2022, శనివారం
జాతకచక్రంలో షష్టమ భావ విశ్లేషణ
జాతకచక్రంలో షష్టమ భావ విశ్లేషణ
పాప గ్రహములు షష్టమ స్ధానం లో ఉన్న శత్రు బాధలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లగ్నం నుండి ఆరవ స్ధానం వ్యాధి, విరోధం, ఋణం, బాధ, గాయాలు, మేనమామలు, మానసిక ఆందోళన, ఋణాల బారిన పడటం, తగువులు, దురదృష్ఠం, చెడ్డపేరు, దొంగతనం, అగౌరవం, శత్రుబాధలు వంటి చెడు ఫలితాలతో పాటు విజయాలు, పరిశీలనా సామర్ధ్యం, పోటీతత్వంతో ముందుకు వెళ్ళటం వంటి శుభ ఫలితాలను కూడా సూచిస్తుంది. అయితే ఈ భావ కారకత్వాల ద్వారా లభించే శుభ ఫలితాలు కూడా మరో విధంగా కొంత బాధను కలిగించటం గమనించాలి. విజయం పొందటం ఆనందదాయకం అయినా ఆ విజయాన్ని పొందటానికి ఎంతో శ్రమించాలి. పైగా సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. అంటే ఆరవ స్ధానం తెచ్చిపెట్టే ఈ విజయం ఎంతో శ్రమకరమైనదిగా గమనించాలి. సత్యాచార్యుల వారు లగ్నాదిగా షష్ఠాధిపతి లగ్నంలో ఉంటే వ్యక్తి అధికార సంపన్నుడు అవుతాడని అదే విధంగా రోగగ్రస్తుడు కూడా కావటం గమనించాలి అని చెప్పారు.
17, నవంబర్ 2022, గురువారం
వైధవ్య యోగం ఉన్న స్త్రీకి దీర్ఘ సుమంగలీ యోగం కలిగించే పరిహారం
శ్లో॥స్మరేశే కేంద్రరాశిస్ధే రంధ్రే శేనసమన్వితే
పాపగ్రహేణసందృష్టే
యోగో వైధవ్య సంజ్ఞికః
తా. సప్తమాధిపతి
ఆష్టమాధిపతితో కలసి కేంద్రమందుండి పాపగ్రహముచే చూడబడిన యెడల యా స్త్రీకి వైధవ్యము
సంభవమగును.
శ్లో॥ స్మరేశేనిసంయుక్తే భూమిపుత్రేణవీక్షితే
చంద్రరాహుస్థి తేరంధ్రే
యోగో వైధవ్య సంజ్ఞికః
తా. సప్తమాధిపతి శనితో కలసియుండి కుజునిచే జూడబడినయెడల యా స్త్రీ వైధవ్యమును బొందును. లగ్నాదష్టమమందు కుజరాహువులున్న యెడల యాస్త్రీకి వైధవ్యము సంభవించును.
11, అక్టోబర్ 2022, మంగళవారం
ఔషద ఆకులు (Sage Leaves)
ఔషద ఆకులు (Sage Leaves)
సాల్వియా
జాతికి చెందిన తులసి మరియు పుదీనా కుటుంబానికి చెందిన సువాసన, సుగంధ ద్రవ్యాలకు మరియు సాంప్రదాయ
మూలికా ఔశదంగా ఈ ఆకులు ఉపయోగపడుతున్నాయి. సేజ్ అనే ఈ మూలిక ఆకులు ఈజిప్షియన్, రోమన్, గ్రీకు,
అమెరికన్ వైద్య సాంప్రదాయంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. భారత దేశంలోని కొన్ని జాతుల వారు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు.
కొండ ప్రాంతంలో జీవించే కొన్ని జాతుల వారు హాని కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్ క్రిముల నుండి ఉపశమనం పొందటానికి ఈ ఆకులను ఎండబెట్టి ధూపం వేసి శరీరాన్ని హానికర క్రిముల నుండి రక్షించుకునేవారు. అంతే కాక శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులకు ఈ ఆకులు ఉపశమనం కలిగిస్తాయని నమ్మేవారు.
6, సెప్టెంబర్ 2022, మంగళవారం
చింతామణి స్టోన్
చింతామణి స్టోన్
చింతామణి స్టోన్ ధాయిలాండ్, టిబెట్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో లభిస్తుంది. చింతామణి స్టోన్ ఆరిజోనా అనే పట్టణంలో సోలమన్ అనే ప్రాంతంలో ప్రధమంగా లభించేవి. చూడటానికి నల్లగా కనబడుతుంది. ఇవి గ్రహ శకలాలు అని నక్షత్ర అవశేషాలు అని కొందరి అభిప్రాయం. సూర్యరశ్మికి గాని బల్బుకి దగ్గరగా ఉంచినప్పుడు తెల్లగా ఉంటుంది. పూర్వకాలంలో రాజుల కాలంలో ఈ స్టోన్ ప్రత్యేకమైన కిరీటాలలోను, కంట మాలలోను, విలువైన రత్నంగా ధరించేవారు.
3, సెప్టెంబర్ 2022, శనివారం
సౌభాగ్య రుద్రాక్ష మాల
సౌభాగ్య రుద్రాక్ష మాల
సౌభాగ్య రుద్రాక్ష మాలలో షణ్ముఖి రుద్రాక్షలు -2, సప్తముఖి రుద్రాక్షలు -2, అష్టముఖి రుద్రాక్ష -1. ఈ ఐదు రుద్రాక్షలు వెండి లేదా బంగారంతో మాల చేపించుకొని వేసుకోవచ్చు. రుద్రాక్ష మాలతో గాని ఇతర పూసల గల మాలతో గాని ధరించవలసి వస్తే ఈ ఐదు రుద్రాక్షలతో పాటు మణిపూసతో 55 పూసలు గాని, 109 పూసలతో గాని బంగారం లేదా వెండితో లేదా రాగితో లేదా, ఇత్తడితో లేదా పంచ లోహాలతో మాలగా అల్లించుకొని వేసుకోవటం మంచిది.
26, ఆగస్టు 2022, శుక్రవారం
బ్లాక్ టర్మలిన్ క్లస్టర్ (Black Tourmaline)
బ్లాక్ టర్మలిన్ క్లస్టర్ (Black Tourmaline)
బ్లాక్ టర్మలిన్ నలుపు రంగును కలిగి ఉంటుంది. బ్లాక్ టర్మలిన్ ఎక్కువగా ఆప్రికా, పాకిస్ధాన్, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలలో ఎక్కువగా లభిస్తుంది. ఇది మెరుగు పెట్టినట్లు ఉంటుంది. ఇందులో ఐరన్ మరియు మాంగనీస్ ఉంటాయి. అత్యంత అరుదుగా లభించే తెల్లటి వెండి రంగులో మెరుస్తూ ఉండే మైకా ఖనిజాన్ని కలిగి ఉండే బ్లాక్ టర్మలిన్ చాలా విశిష్టమైంది. అయస్కాంత శక్తులు కలిగి ఉంటుంది.
12, అక్టోబర్ 2021, మంగళవారం
విద్యా బోధన – గ్రహాల పరిశీలన
విద్యా బోధన – గ్రహాల పరిశీలన
విద్యాబోధన అనేటటువంటిది పూర్వజన్మ సుకృతంగా చెప్పవచ్చు. బోర్డు స్కూలు ఉపాధ్యాయులు, కాలేజి లెక్చరర్సు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల స్థాయిలలో బోధించే వారి సామర్థ్యం ఈ క్రింది గ్రహస్థితులు చూపిస్తుంటాయి.
విద్యా భోదనకు సంబందించి రాశి చక్రము, నవాంశ చక్రము, దశాంశ చక్రములు పరిశీలనా పరిధిలో తీసికొనవచ్చును.
3, 5, 6, 7, 11 రాశులు అనగా మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులు జ్ఞానవంతమైన రాశులు కలవి. ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండే రాశులు.
వాయుతత్త్వరాశులు మేధాతనాన్ని చూపుతాయి.
27, సెప్టెంబర్ 2021, సోమవారం
గృహారంభ, గృహాప్రవేశ శుభ ముహూర్త నిర్ణయం
గృహారంభ, గృహాప్రవేశ శుభ ముహూర్త నిర్ణయం
గృహారంభం
గృహారంభానికి చైత్ర వైశాఖాలు, శ్రావణ, కార్తీకాలు, మాఘ, పాల్గుణ మాసాలు శుభప్రదాలు. గురు శుక్రమౌఢ్యాలలో గృహారంభం పనికి రాదు. సూర్యుడు కృత్తికా నక్షత్రంలో నున్నప్పుడు కర్తరి గృహారంభం పనికిరాదు. భరణి 3,4 పాదాల్లోను రోహిణి మొదటి పాదంలోను సూర్యుడున్నప్పుడు గృహారంభం పనికిరాదు. మార్గశీర్ష మాసంలో గృహారంభం చేయవచ్చునని కాలామృతకారుని అభిప్రాయం.
తిథులు : విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి గృహారంభానికి శుభతిథులు. శుక్ల పక్షంలో ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమలు కూడ గృహారంభానికి యుక్తమయినవే అని కొందరిమతం.
24, సెప్టెంబర్ 2021, శుక్రవారం
పంచ మహా పురుష యోగాలు
పంచ మహా పురుష యోగాలు
రుచక భద్రక హంసక మాలవాః సశశకాః పంచచ కీర్తితాః
స్వభావనోచ్చ గతేషు చతుష్టయే క్షితి సుతాదిషు తాన్ క్రమతా వాదేత్
రుచక మహా పురుష యోగం కుజగ్రహం ద్వారా, భద్రక మహా పురుష యోగం బుధ గ్రహం ద్వారా, హంస మహా పురుష యోగం గురుగ్రహం ద్వారా, మాలవ్య మహా పురుష యోగం శుక్రగ్రహం
ద్వారా, శశక మహా పురుష యోగం
శనిగ్రహం ద్వారా ఏర్పడతాయి.
రవి చంద్రులు కాక
మిగిలిన గ్రహాలైన కుజ,
బుధ, గురు, శుక్ర, శని గ్రహాల వల్ల పంచ మహా పురుష యోగాలు ఏర్పడతాయి. ఈ పంచ మహా పురుష యోగాలు ఏర్పడటానికి
కొన్ని ముఖ్య సూత్రాలు అవసరమవుతాయి.
కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు లగ్నానికి గాని, చంద్రునికి గాని కేంద్రాలలో ఉండాలి. ఆ కేంద్ర స్ధానాలు స్వక్షేత్రం గాని, ఉచ్చ గాని అయి ఉండాలి.
19, మే 2021, బుధవారం
గ్రహమైత్రీ విశ్లేషణ - గ్రహరాజ్యం
గ్రహమైత్రీ విశ్లేషణ - గ్రహరాజ్యం
జ్యోతిష శాస్త్రంలో గ్రహానికి, గ్రహానికి మధ్య విరోధం, మైత్రి, ఉదాసీనత అనే సంజ్ఞలు ఉన్నాయి. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. అవి నైసర్గిక మైత్రి, తాత్కాలిక మైత్రి. నైసర్గిక మైత్రి అంటే స్వభావ సంబంధమైన మైత్రి. నైసర్గిక మైత్రిని పరిశీలించే ముందు గ్రహాల స్వభావాన్ని పరిశీలిద్దాం.
రవి: న్యాయ రక్షుడైన ప్రభువు. ఇతని స్వరాశి అయిన సింహ లగ్న జనితులు ధర్మం విషయంలో స్వపరబేధం లేకుండా ప్రవర్తిస్తారు.
10, మే 2021, సోమవారం
గోధూళికా ముహూర్తము
6, మే 2021, గురువారం
జాతకచక్రంలో ఆకస్మిక ధనప్రాప్తి కలిగే యోగాలు
ఆకస్మిక లాభాలు అనగా పందెం, జూదం, లాటరీలు మొదలగువాని వలన కలిగే లాభం. ఇటువంటి ధన ప్రాప్తి కోసం జాతకచక్రంలో ధన యోగముండాలి. ఇటువంటి ఆకస్మిక లాభాలు పంచమ స్ధానం వాని అధిపతిని బట్టి విచారించటం పంచమ స్ధానం బలం కలిగి అందులో శుభ గ్రహాలు ఉండి శుభగ్రహ దృష్టి కలిగి ఉండి పంచమాధిపతి బలవంతుడై ద్వితీయ లాభ స్ధానాల్లో శుభగ్రహ దృష్టి కలవారై ఉంటే జాతకునికి ఆకస్మిక లాభాలు ఉంటాయి. పంచమ స్ధానం పాపగ్రహ సంయోగం, పాపగ్రహ వీక్షణ కలిగి పంచమాధిపతి ద్వాదశ స్ధానంలో పాపగ్రహ సంయోగం, పాపగ్రహ వీక్షణం కలిగి ఉంటే జాతకుడు నష్టపోయే ప్రమాదం ఉంది. చంద్రుడు రాహువు పంచమ స్ధానంలో ఉంటే ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక లాభాలకు, నష్టాలకు అష్టమ స్దానాన్ని పరిశీలించాలి. అష్టమంలో పాపగ్రహాలుంటే ఆకస్మిక నష్టాలు, శుభగ్రహాలు, స్ధాన బలం మొదలగు షడ్బలాలు కలిగి ఉంటే ఆకస్మిక లాభాలు వస్తాయని గుర్తించుకోవచ్చు.
5, మే 2021, బుధవారం
గ్రహాలు గోచార రీత్యా ద్వాదశ రాశులలో సంచార చేస్తున్నప్పుడు కలిగే ఫలితాలు
గ్రహాలు నిత్యము చలనము కలిగి ఉంటాయి. స్థిరముగా ఒకదగ్గర ఉండవు. అలా చలనము కలుగుతూ వివిధ రాశులలో తమతమ కక్ష్యలలో భ్రమణము చెందుతూ ఉంటాయి. దీనినే గోచారము అంటారు.
జాతకులు జన్మించిన జన్మ రాశి ఆధారముగా గోచారము ద్వారా ఫలితములు తెలుసుకోవచ్చు. ఒకవేళ జన్మ రాశి తెలియనివారికి పేరును బట్టి నామ నక్షత్రముతెలుసుకొని నామ రాశిని తెలుసు కొని కొంతవరకు ఫలితములు తెలుసుకొన వచ్చును.
గ్రహ బలము ఎంత బాగున్ననూ, గోచారము అనుకూలముగా లేనిచో మానవులు శుభ ఫలితములను పొందజాలరు. గోచారములో గ్రహములు జన్మరాశినుండి వివిధ స్థానములలో ఉన్నప్పుడు ఫలితములు ఏవిధముగా కలుగ చేస్తాయి .
30, ఏప్రిల్ 2021, శుక్రవారం
నక్షత్రాలలో రోగారంభం - రోగం ఉండే రోజులు.
కృత్తికాసు యదా కశ్చిజ్జ్వరాది ప్రతిపద్యతే
నవరాత్రం
తదాపీడా త్రిరాత్రం రోహిణీషుచ
మృగశీర్షే
పంచరాత్ర మార్ద్రా ప్రాణ భయం తధా
పునర్వ
సూచ పుస్యశ్చ సప్తరాత్రం విధీయతే
నవరాత్రం
తధా శ్రేషాః శ్మశానంతం మఘాసుచ
ద్వేమాసౌ
ఫల్గునీచైవ హోత్తరాసు త్రిపంచకమ్
హస్తేన
జాయతే పక్షం చిత్తాచైవార్ధమాసకమ్
మాసద్వయం
తధా స్వాతీ విశాఖే పంచ వింశతిః
అనూరాధ
దశ ప్రోక్తా జ్యేష్ఠా చైవార్ధా మాసకమ్
మూలేచ
జాయతే మోక్షః పూర్వాషాడ స్త్రీ పంచకమ్
ఉత్తరే
దినా వింశత్యా ద్వేమాసౌ శ్రావణే తధా
ధనిష్ఠాయా
మర్ధమాసో వారుణేచ దశాహకమ్
పూర్వాభాద్ర
పడేమోక్ష ఉత్తరాసు త్రిపంచకమ్
రేవతీ
సప్తరాత్రంచ హ్యాహోరాత్రం తధాశ్వినీ
భరణీ తత్ క్షణేనైవ మరణంటు నసంశయః
8, ఏప్రిల్ 2021, గురువారం
నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి
1, జనవరి 2020, బుధవారం
ఆధ్యాత్మిక దైవిక వస్తువులు గ్రంధం
అదృష్టం, ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యం, కీర్తిపతిష్టలను అనుగ్రహించే “ఆధ్యాత్మిక దైవిక వస్తువులు” శ్రీ "షిర్డి సాయినాధుని" కృపాకటాక్షాలతో, ఆశీర్వచనాలతో, రచయితలను గౌరవాలతో మంత్ర ముగ్ధులను చేసే "మోహన్ పబ్లిషర్స్" అధినేత ఆకుల రామచంద్రరావు గారి సహకారంతో "నేరెళ్ళ రాజశేఖర్" అను నేను శ్రీ సాయి జ్యోతిష కేంద్రం అనే మా సంస్ధ తరుపున అనేక గ్రంధాలలో దాగి ఉన్న, అనుభవ పూర్వకంగా తెలుసుకున్న “ఆధ్యాత్మిక దైవిక వస్తువులు” అనే దైవిక వస్తువుల రహస్యాలను విశదీకరించు గ్రంధం రచించటం జరిగింది.
మన నిత్య జీవితంలో కలిగే ఇబ్బందులకు జ్యోతిష శాస్త్ర, వాస్తు శాస్త్రాల పరంగా గ్రహాలు, పరిసరాలు కలిగించు దోషాలకు నివారణోపాయ రహస్యాలను తెలియజేయు అమూల్యమైన గ్రంధం “ఆధ్యాత్మిక దైవిక వస్తువులు”. ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంధం నందు 330 పైగా అరుదైన వస్తువులు మరియు పరిహారాలను పొందుపరచటం జరిగింది. ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంధంతో పాటు “వైజయంతి మాల” మరియు సుమారు 25 పేజీల జాతకచక్రం పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. సామాన్యులను సైతం అదృష్టవంతులను చేయగలిగే ఆధ్యాత్మిక దైవిక వస్తువులను ప్రతి ఒక్కరూ తమకు తగిన విధంగా వినియోగించుకొని అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో అదృష్ట వంతులు కాగలరని ఆశిస్తూ నా యొక్క ఈ గ్రంధ రచన పాఠకులైన మీకు ఏ మాత్రం సంతృప్తి కలిగించిన నా పరిశ్రమ సార్ధకమైనట్లే.
“ఆధ్యాత్మిక దైవిక వస్తువులు” గ్రంధం పెద్దలు, సద్గురువులు, పాఠకుల సహకారంతో, ఆశీర్వచనాలతో వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను.
ఇట్లు
మీ
నేరెళ్ళ రాజశేఖర్
గమనిక:-ఆధ్యాత్మిక దైవిక వస్తువులు గ్రంధం కావలసిన వారు “శ్రీ సాయి జ్యోతిష కేంద్రం” అను మా సంస్ధకు సంబందించిన బ్యాంక్ అక్కౌంట్ నందు 250-00 మరియు కొరియర్ ఛార్జీలు 50.00 (Ap & TS) మొత్తం 300-00 జమ చేసిన కొరియర్ ద్వారా గ్రంధం పంపగలం. ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంధంతో పాటు “వైజయంతి మాల"ను తప్పకుండా పొందగలరు.
7, జూన్ 2019, శుక్రవారం
2, ఫిబ్రవరి 2019, శనివారం
బుధ గ్రహ దోష నివారణకు మరకతం(పచ్చ)
గరుడ పురాణంలో పచ్చల పుట్టుక గురుంచి ఒక కధ ఉంది. సర్ప రాజు వాసుకి అనే సర్పం, బకాసురుడనే రాక్షసుని యొక్క చేదు కట్టని (పిత్త కోశం) సంగ్రహించి ఆకాశంలో ఎగిరిపోతుండగా వాసుకిని చూసిన గరుత్మంతుడు ఆ జన్మ శతృత్వం వలన ఆకాశంలో ఎగురుచున్న ఆ సర్పారాజుని డీకొని యుద్దం చేయగా గరుత్మంతుని దాటికి వాసుకి నిలవలేక మలయ పర్వత ప్రాంతములలో ఆ చేదు కట్టని విడిచింది. విడిచిన సమయంలో దేదీప్యమానంగా పచ్చదనంతో వెలిగిపోతున్న ఆ చేదుకట్టలో కొంత భాగం గరుత్మంతుడు త్రాగుతాడు. అదియే మరకతం. త్రాగిన కొంతసేపటికి మూర్ఛ కలిగి, పిదప కొంత బైటికి వదిలి వేయగా అదిపడిన ప్రదేశంలో పుట్టిన పచ్చలను గరుడ పచ్చలని పేరు.గరుడ పచ్చ గరుత్మంతునిచే జనియించి నందున విషమును హరింపజేయు శక్తి కలిగి ఉంటుంది.
మరొక కధ ప్రకారం నలమహారాజు శనిగ్రహ పీడా విముక్తికి విష్ణుమూర్తిని ప్రార్ధించి శివలింగంను ప్రసాదించమని కోరగా మరకత లింగమును ప్రసాదించాడు. నలుడు ప్రతిష్టించిన మరకత లింగం పాండిచ్చేరి రాష్ట్రంలో కలదు. శ్రీకృష్ణ దేవరాయలు సింహాచలంలో స్వామి వారికి శ్రేష్ఠమైన పచ్చలను ఇవ్వటం జరిగింది. గరుత్మంతుని ద్వారా ఉద్భవించిన గరుడ పచ్చలు అమిత శక్తి వంతమైనవి.
చిన్న చిన్న గుంటలుగా ఉన్న పుప్పి దోషం ఉన్న, కాంతిహీనమైన గార దోషం ఉన్న.తెల్లని తెట్టవలే ఉన్న కర్క దోషం ఉన్న పచ్చలను ధరించరాదు. పచ్చను వస్త్రంపైన పెట్టి సూర్య కిరణాలకు ఎదురుగా ఉంచినట్లయితే కాంతి నలుమూలల ప్రకాశిస్తూ వస్త్రం పచ్చగా ప్రకా శించును. పచ్చపైన సున్నపు పొర వేసిన పొరలో నుండి కూడా ప్రకాశించు పచ్చలను ధరించటం ఉత్తమం.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నేల వంకాయ రసంలో గాని, కొండ పిండి వేళ్ళ రసంలో గాని ఒక రోజు నానబెట్టి పచ్చను భస్మం చేసి వాడిన ఛాతీ, నరాల, మెదడు, నోరు, చర్మ వ్యాదులను, జీర్ణ వ్యవస్ధలోని లోపాలను, మందబుద్ధి, పిచ్చిని తగ్గించును. రసాయన శాస్త్రం ప్రకారం ఇది బేరీలియమ్, సిలికేట్ ల సమ్మేళనం వేడికి మార్పు చెందని క్రోమియం ఆక్సైడ్ ఉన్నందున ఈ రత్నాలకు పచ్చ రంగు వచ్చింది. పచ్చ బుద గ్రహానికి సంబందించినది కావున జ్ఞాన శక్తికి, మానసిక ప్రశాంతతకు, వ్యాపారా భివృద్ధికి, ఉన్నత విద్యలను అభ్యసించుటకు విష్ణుమూర్తి ప్రతి రూపమైన పచ్చను ధరించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించును. వేదాంతులు, పండితశ్రేష్టులు, సివిల్ ఇంజనీర్స్, పురోహితులు, జ్యోతిష్యులు, ఆడిటర్స్, ఉపాన్యాసకులు, కాలేజీ,స్కూల్స్ నడిపేవారు, పుస్తక వ్యాపారులు, లలితా కళాకారులు, చిత్రా లేఖనం చేసేవారు, న్యాయ వాదులు, రత్న పరీక్ష, హోమియో, అల్లోపతి, ఫిజీషియన్స్ తప్పని సరిగా మోక్షాన్ని కలిగించే పచ్చ రత్నాన్ని ధరించాలి. పచ్చను ధరించిన గణిత శాస్త్రం పైన పట్టు సాధించవచ్చును.పచ్చను ధరించిన క్రీడలలో నైపుణ్యాన్ని, తెలివి తేటలను తడుముకోకుండా వ్యక్త పరచటం, అవతలి వ్యక్తులు ఏది చెబితే విని అర్ధం చేసుకోగలరో అది చెప్పగలిగే వాక్ శుద్ధిని కలిగిస్తుంది. మంచి తెలివితేటలతో వాదోపవాదనలు చేయగలరు. రావణాసురుడు పెద్ద మరకత మణి పైన కూర్చోని భగవంతుని ద్యానం చేసేవాడట.
జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, వక్రించి ఉన్న లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, శత్రు స్ధానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న, బుధ దశా అంతర్ధశలలో ఆశ్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు, విద్యలో ఆటంకాలు ఉన్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు, మంధ బుద్ధి కలవారు మరకతమణిని ధరించాలి. మరకతమణి ధరించేటప్పుడు “మహాదేవచ్చ విద్మహే విష్ణు పత్నేచ్చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్”అనే మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ కలిగిన పచ్చను చిటికిన వ్రేలుకు గాని, ఉంగరపు వేలుకు గాని బుధవారం రోజు బుదహోరలో పచ్చ పెసర్లను ఒక కిలో పావు దానం చేస్తూ ధరించాలి.








.jpeg)









