3, సెప్టెంబర్ 2022, శనివారం

సౌభాగ్య రుద్రాక్ష మాల


సౌభాగ్య రుద్రాక్ష మాల

సౌభాగ్య రుద్రాక్ష మాలలో షణ్ముఖి రుద్రాక్షలు -2, సప్తముఖి రుద్రాక్షలు -2, అష్టముఖి రుద్రాక్ష -1. ఈ ఐదు రుద్రాక్షలు వెండి లేదా బంగారంతో మాల చేపించుకొని వేసుకోవచ్చు. రుద్రాక్ష మాలతో గాని ఇతర పూసల గల మాలతో గాని ధరించవలసి వస్తే ఈ ఐదు రుద్రాక్షలతో పాటు మణిపూసతో 55 పూసలు గాని, 109 పూసలతో గాని బంగారం లేదా వెండితో లేదా రాగితో లేదా, ఇత్తడితో లేదా పంచ లోహాలతో మాలగా అల్లించుకొని వేసుకోవటం మంచిది.

సౌభాగ్య రుద్రాక్ష మాల మెడలో ధరించటం వలన ఆర్ధిక సమస్యల నుండి త్వరగా బయట పడే అవకాశాలు ఉంటాయి.  చేతిలో ఉన్న డబ్బు వృధాగా ఖర్చు అయ్యే వారికి, ఆర్ధికంగా పురోగతి లోపించినప్పుడు, ఈ పని చేసిన కలసి రాకపోవటం, సరైన సమయంలో డబ్బు సర్దుబాటు కాకపోవటం, స్ధాయికి తగిన గుర్తింపు లేకపోవటం వంటి వాటికి వార ప్రదాయిని సౌభాగ్య రుద్రాక్ష మాల.

సౌభాగ్య రుద్రాక్ష మాలలో చేపించుకోవటానికి ముందు గాని మాల అల్లించుకొన్న తరువాత గాని రుద్రాక్షలను ఆవు నెయ్యి గాని నువ్వుల నూనెలో ఒక రోజు మొత్తం ఉంచి తరువాత పొడి గుడ్డతో తుడిచి మెడలో ధరించటం మంచిది. రుద్రాక్ష మాలను రాత్రి పడుకునే ముందు తీసి ఉదయం స్నానం చేసిన తరువాత మెడలో ధరించటం చాలా మంచిది.

సౌభాగ్య రుద్రాక్ష మాలను ముందుగా ధరించేటప్పుడు సోమవారం గాని లేదా మంగళవారం గాని శివాలయంలో ఒకసారి అభిషేకం చేసిన తరువాత గాని లేదా ఇంటిలో శివ లింగానికి అభిషేకం చేసిన తరువాత ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ మెడలో ధరించటం మంచిది.

మాల ధారణ మంత్రం

ఓం హ్రీం నమః

ఓం హ్రీం శ్రీం క్రీం సోం నమః శివాయ

ఓం క్లీం వీం నమః   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...