19, డిసెంబర్ 2013, గురువారం

అనుకూల నక్షత్రాలు


అశ్విని : నామకరణ, అన్నప్రాసన, గృహరంబ,గృహప్రవేశ,వివాహములకు.
భరణి : గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, మంత్ర శాస్త్ర అధ్యాయానికి.
కృతిక : విత్తనాలు చల్లడానికి,మొక్కలు నాటడానికి.
రోహిణి : పెళ్ళిళ్ళు,ఇంటి పనులు, ఇతర అన్ని పనులకు.
మృగశిర : అన్ని పనులకు మంచిది
ఆర్ధ : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు, శివ పూజకు.
పునర్వసు : అన్నప్రాసన,చౌలది సర్వ కార్యాలకు శుబం. పెళ్లిళ్లకు మాధ్యమం.

కాల సర్ప దోషం


గురు గ్రహ దోష నివారణ

                    
గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో సంతాన సౌఖ్యత లేక పోవటం,కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట,నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట,ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం,షుగర్,క్యాన్సర్,మూత్ర రోగాలు,పెద్ద పొట్టతో కలిగిన దేహం,పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం,గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

రోగం వస్తే తొందరగా తగ్గదు.లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, ని యంతగా ప్రవర్తించుట,

ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతా లు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరా యణ చేయడం, గురువుల ను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దా నం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును.పసుపు కొమ్ము గణపతిని,పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది.పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు,ప్రస్తుతం సాయిబాబా,దత్తత్రేయ,హయగ్రీవుడిని పూజిస్తున్నారు.


10, డిసెంబర్ 2013, మంగళవారం

గోరోచనం


ఒక ప్రసిద్ధమైన, అధ్బుతమైన పూజా ద్రవ్యం గోరోచనం. ఇది గోవు పిత్తమని కొందరు, గోవు శిరస్సు నుండి లభిస్తుందని మరికొందరు భావిస్తారు.

అనేక సాధనా ప్రయోగాల్లో దీనిని వినియోగిస్తారు. ఇది అత్యంత శక్తివంతమైనది. పవిత్రమైనదిగా సాధకులు భావిస్తారు. ఈ కారణంగా ఇది కస్తూరి వంటి పూజా ద్రవ్యాల జాబితాలోకి చేరింది. దుర్లభమైన వస్తువు.

పసుపు కొమ్ము గణపతి(Turmeric Ganesh)


గురు గ్రహ అనుగ్రహం కోసం "పసుపు కొమ్ము" గణపతి.
ఒరిజినల్ పసుపు కొమ్ము మీద గణపతి ఆకారాన్ని చెక్కబడిన గణపతిని పూజించిన గురు గ్రహ అనుగ్రహం కలుగుతాయి.జాతకచక్రంలో గురువు అనుకూలంగా లేనివారు పసుపు కొమ్ము గణపతిని పూజిస్తే వ్యతిరేక పలితాల నుండి విముక్తి కలుగుతుంది.పసుపుకొమ్ము గణపతిని పూజామందిరంలో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై గణపతిని ప్రతిష్టించాలి.పసుపుకొమ్ము గణపతికి దూపదీప నైవేద్యాలు సమర్పించి మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి.పసుపుకొమ్ము గణపతిని పూజ అనంతరం పురుగు పట్టకుండా భద్రపరుచుకోవాలి.
ఓం హరిద్ర గణపతాయనమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి.

Astrology Remedies(ఆస్ట్రాలజీ రెమిడీస్)

నవ గ్రహా పారాయణాలు, పుణ్యతిథులు .............


నవగ్రహాల శాంతికి ఆ గ్రహానికి సంబంధిత పారాయణము, పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నవగ్రహాల పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసుకుందాం..!

తొమ్మిది నవగ్రహాల్లో వరుస క్రమంలో సూర్యునికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్యపురాణం.

Astrology Remedies(ఆస్ట్రాలజీ రెమిడీస్)

జ్యోతిష్యం ద్వారా సూచించే మొక్కలను మీ ఇంట్లో నాటండి...............

మీ రాశికి తగ్గ మొక్కలు నాటండి...!

ప్రతి మనిషికి ఒక రాశి అంటూ ఉంటుంది. ఆయా రాశులకు తగ్గట్టు వారివారి జీవితాలు ముడిపడి ఉంటాయి. వివిధ రాశులలో వివిధ గ్రహాల ప్రభావం ఉంటుంది. దీంతో వారి వ్యక్తిగత జీవితాలు మారిపోతుంటాయి.

9, డిసెంబర్ 2013, సోమవారం

బుధగ్రహ దోషం(Budha graha remedies)

బుధగ్రహ దోషాల నివారణకు గణపతిని పూజించండి........


బుధవారం.. ఆదిదేవుడైన గణపతిని ఆలయాల్లో దర్శించుకోవడం మంచిదని పురోహితులు అంటున్నారు. అందుచేత బుధవారం ఉదయం, సాయంత్రం సమయాన సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

గ్రహదోషాలు(Graha Doshalu)

నవగ్రహాలలో ఒక్కో గ్రహం ... దాని తాలూక దోషం ... ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి నానారకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.

కుంకుమ - ఎర్ర చందనం కలిపిన 'రాగిపాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ - గంధం కలిపిన నీటిని 'శంఖం'తో పోసుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం - తిలలు కలిపిన 'రజిత పాత్ర'లోని నీటితో స్నానమాచరించడం వలన కుజదోషాల బారినుంచి బయటపడవచ్చు.

ఏలినాటి శని( SADE SATI)

 
  ఏలినాటి శని( SADE SATI)


ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది.ప్రతిసారీ 7 1/2సంవత్సరాలు వుంటుంది. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.

ఏలినాటి శని( SADE SATI)

ఏలినాటి శని ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ అన్నం తినేముందు కొంత భాగం కాకులకు వేయండి. ఇనుము, పెనం, సారాయి, నూనె దానం చెయ్యండి. రొట్టెముక్కల మీద నువ్వులనూనె వేసి, వీధి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా పెడుతుంటే శనిగ్రహ దోషాలకు నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏ లగ్నంవారికైనా, శనిగ్రహస్థితి బాగాలేకపోతే ప్రతినిత్యం మూడుసార్లు అంటే ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో కాలభైరవ స్తోత్రం పఠించాలి. పూర్తిగా నల్లని రంగు గల గుర్రం కాలికి కట్టిన నాడా తీసికొచ్చి, నువ్వులనూనెతో అభిషేకం చేసి శనిస్తోత్ర పఠనం చేసి, ఇంటి గుమ్మానికి కాని, తలుపుకుకానీ కొట్టడం శనిగ్రహ ప్రభావాన్ని తప్పిస్తుంది.

పసుపు మాల(Turmeric mala)


పసుపు మాల సాదారణంగా మనకు లభించే పసుపు కొమ్ములను మిషన్ ద్వారా రౌండ్ గా కట్ చేయబడి 108 పూసలతో మాలగా తయారుచేయబడి ఉంటుంది.పసుపు మాలను జాతకచక్రం లో గురుగ్రహాదోషం ఉన్నవారు జపం చేయవచ్చును. లేదా మెడలో ధరించవచ్చును.

మెడలో ధరించినప్పుడు శరీరానికి పసుపు రంగు అవుతుంది కాబట్టి మాలకు తడితగలకుండా వుంచవలెను.తడితగిలిన పురుగు పట్టటానికి అవకాశం ఉంటుంది.మెడలో వేసుకొన్నప్పుడు తడి తగిలిన వెంటనే ఆమాలను కొద్దిసేపు తడి ఆరిందాక ఎండలో ఉంచవలెను.

>>>>>>> జాతకం పరిశీలించటం ఎలా <<<<<<<వృశ్చిక రాశి వారి లక్షణాలు

జాతకులు గ్రహాల శాంతులకు దీపారాధన


గ్రహాల శాంతులకు ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా జాతకులు సుఖసంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణలు అంటున్నారు.


జాతకపరంగా నవగ్రహ పరివర్తనను అనుసరించి శుభ, అశుభఫలితాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాధిపత్యంతో కలిగే అశుభ ఫలితాలను తప్పించేందుకు నవగ్రహ ఆరాధన చేయడం మంచిదని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.

>>>>>>> జాతకం పరిశీలించటం ఎలా?<<<<<<మీనరాశి ఫలితాలు


>>>>>> జాతకం పరిశీలించటం ఎలా?<<<<<<<కర్కాటక రాశి వారి లక్షణాలు


శని దోష నివారణకు నేరేడు పండ్లు.

శని దోష నివారణకు నేరేడు పండ్లు

చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు శని కారకుడు నేరేడు పండ్లు తింటే వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. ముఖ్యంగా షుగరు రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది.దీర్ఘకాల వ్యాదులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ నిరోదక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు.దీని నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.

గోముఖ శంఖం

గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖం............

గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదుగా లభ్యమయ్యే అత్యాదునికమైన సముద్రపు నత్త పురుగు ద్వారా ఉత్పత్తి అయ్యే శంఖు జాతికి చెందినది.గోవు ముఖాకృతిని కలిగి వుండటం చేత ఈ శంఖుని గోముఖ శంఖం అంటారు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...