21, ఫిబ్రవరి 2016, ఆదివారం

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం

మత్స్య పురాణంలో గృహ నిర్మాణాలు ఏ మాసంలో చేస్తే ఏ ఫలితమో కూడా సూతుడు పేర్కొన్నాడు.

గృహారంభానికి చైత్ర మాసం వ్యాధి ప్రదం; వైశాఖ మాసం ధన, రత్న ప్రదం; జ్యేష్ఠం మృత్యుకరం; ఆషాఢం భృత్య, రత్న, పశువృద్ధికరం; శ్రావణం భృత్య, లాభం; భాద్రపదం హానికరం; ఆశ్వయుజం పత్నీ నాశకరం; కార్తీకం ధన, ధాన్య వృద్ధికరం; మార్గశిరం అన్న వృద్ధికరం; పుష్యం చోర భయప్రదం; మాఘం బహులాభ దాయకం; ఫాల్గుణం కాంచన బహుపుత్ర ప్రధమని సూతుడు చెప్పాడు.

18, ఫిబ్రవరి 2016, గురువారం

జాతకచక్రంలో సంతాన స్ఫుట నిర్ణయం



జాతకచక్రంలో సంతాన స్ఫుట నిర్ణయం 


సంతాన కలుగక సమస్యలు అనుభవిస్తున్న దంపతుల జాతకాలను పరిశీలించి వారికి సంతానం సమస్యలు ఉన్నది లేనిది  సంతాన స్ఫుటం ద్వారా నిర్ణయించవచ్చును. దంపతుల జాతకచక్రములలోని గ్రహ స్ఫుటాలను వేరు వేరుగా తీసుకోవాలి. స్త్రీ జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని క్షేత్రస్ఫుటం అంటారు. పురుష జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని బీజస్ఫుటం అంటారు. స్ఫుటం 360° డిగ్రీల కంటే ఎక్కువ వస్తే వచ్చిన స్ఫుటం నుండి 360° తీసివేయాలి. క్షేత్రస్ఫుటం లో క్షేత్రం అనగా గర్భం నిలిచి ఉండే స్ధానం. బీజ స్ఫుటంలో బీజం అనగా వీర్యం అంటారు. బీజ, క్షేత్ర స్ఫుటములపైన, బీజ, క్షేత్ర స్ఫుట స్ధానముల నుండి పంచమ స్ధానం పైన పాపగ్రహాల, నపుంసక గ్రహాల దృష్టి ,యుతి లేక పోవటం మంచిది. బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురుదృష్టి,,యుతి. ఉండటం మంచిది. గోచారంలో బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురు సంచారం గాని, దృష్టి గాని ఉన్నప్పుడు సంతానం కలగటానికి మంచి సమయంగా గుర్తించాలి.

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

భృగుషట్క దోషము

భృగుషట్కదోషము

జన్మలగ్నాత్తు శుక్రుడు ఆరవస్థానములో ఉంటే దానిని భృగుషట్కదోషము అంటారు.ఈ భృగుషట్కదోషము వలన శుక్రుడు సత్ఫలితములు ఇవ్వలేడు.

మర్మావయవములకు సంబంథించిన వ్యాథులు,భార్యతో సుఖించ లేకపోవడం, సంసారములో అన్యోన్యత లేక పోవడము,సంసార విషయాలు రచ్చకెక్కడం, నలుగురికి తెలియడము,అవమానాలు పాలుకావడం, తీర్పులు, పంచాయితీలు, ఇందువల్ల మరిన్ని కష్టాలు ఏర్పడుట సంభవించును.

ఏకాదశ శుక్రుడు దోష ఫల ప్రదుడు

ఏకాదశ శుక్రుడు దోష ఫల ప్రదుడు

సాథారణముగా ఏ గ్రహమైనా ఏకాదశ స్థానములో ఉంటే చాలా మంచిది.అని ఆ గ్రహ దశలలో మంచియోగం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర ప్రమాణిక గ్రంథములలో చెప్పబడుతుంది.కానీ శుక్రుడు మాత్రం ఏకాదశంలో యోగించడు.వేల జాతకాలు పరిశీలించి తెలుసుకున్న సత్యం.

శుక్రుడు లాభస్థానములో కంటే వ్యయస్థానములోఅంటే పన్నెండవ స్థానంలోనే ఎక్కువగా యోగి స్తాడు.లాభస్థానములో ఉండి శుక్రుడు ఉఛ్ఛస్థితిని పొందినప్పుడు మరింత ప్రతికూల ఫలితాలను ప్రసాదిస్తాడు.శుక్రుడు నీచలోనూ యోగకారకుడే.27వ డిగ్రీలోనూ,పరమ నీచలోనూ ఉన్నప్పుడు మాత్రం యోగకారకుడు కాదు.నీచ భంగమయినప్పుడు శుక్ర గ్రహం మంచియోగాన్ని ఇస్తుంది. ఏ కాదశంలో ఉన్న శుక్రుడు మారక యోగ లక్షణాలను కలిగి ఉంటాడు.

శుక్రహోర

శుక్రహోర

శుక్ర హోరకు అథిపతి శుక్రుడు.శుక్ర వారము లేదా చంద్రుడు భరణి,పూర్వ ఫల్గుణి,పూ ర్వాషాఢ నక్షత్రములలో సంచరిస్తున్నప్పుడు శుక్రహోరా సమయములో శుక్రుని ప్రభావము చాలా అథికముగా ఉంటుంది.
శుక్రవారం శుక్రహోరలో కఠిన హృదయాలు సైతం కరుణ,ప్రేమతో నిండే సమయము.ఎవరైనా కోపిష్టి. మూర్ఖుడు, కఠినుడు అయిన వ్యక్తిని కలవడానికి శుక్రహోరను ఎన్నుకోండి.ఆ సమయములో మీరు చెప్పిన విషయాన్ని స హనముతో వింటారు.మీకు శాంతముగా సమాథానము ఇస్తాడు.

పెళ్ళి చూపులకు శుక్రహోర సమయము ఉత్తమమైనది.నగలు,పట్టు చీరలు,రత్నాలు, గంథము,గ్లాసు,సుగంథ ద్రవ్యములు,అలంకరణ వస్తువులు కొనడానికి మంచి సమయము.అలా గే విలాసవంతమైన వస్తువులు, వాహనము కొనడానికి,సినిమా థియేటర్లు,స్టూడియోలు,సంగీత కళాశాలలు.పాఠశాలలు,కళాశాలలు శుక్రవారముశుక్రహోరలో ప్రారంభించుట శుభదాయకము.

రాశులు అనారోగ్యం - జాగ్రత్తలు

రాశులు అనారోగ్యం - జాగ్రత్తలు

సాధారణంగా అనారోగ్యాలు పన్నెండు రాశులవారికి వేరువేరుగా ఉంటాయి. అవి రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి ప్రయోజనం పొందవచ్చు. అసలు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏయే రాశులవారికి ఎలాంటి అనారోగ్యాలు సూచించబడుతున్నాయి, వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి మందులు వాడి చక్కని ఫలితాలు పొందవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం...

మేషం...
సాధారణంగా ఈ రాశివారికి తల, ఉదరం, పైత్యం, నత్తి, మూత్రపిండాలు, అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు (వ్రణాలు), చర్మా నికి సంబంధించిన విచిత్ర వ్యాధులు కలిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా... అండవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫం, రక్తసంబంధ వ్యాధులు హెచ్చు.
జాగ్రత్తలు: 1) ధ్యానం చేస్తూ ఉండాలి. 2) చల్లదనాన్ని ఇచ్చే పూలు (పూల సువాసన). 3) పసుపు, తేనె పరగడపున తీసుకోవాలి. 4) ఆహారంలో కందిపప్పు ఎక్కువగా ఉండాలి.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...