11, అక్టోబర్ 2022, మంగళవారం

ఔషద ఆకులు (Sage Leaves)

 


ఔషద ఆకులు (Sage Leaves)

సాల్వియా జాతికి చెందిన తులసి మరియు పుదీనా కుటుంబానికి చెందిన సువాసన, సుగంధ ద్రవ్యాలకు మరియు సాంప్రదాయ మూలికా ఔశదంగా ఈ ఆకులు ఉపయోగపడుతున్నాయి.  సేజ్ అనే మూలిక ఆకులు ఈజిప్షియన్, రోమన్, గ్రీకు, అమెరికన్ వైద్య సాంప్రదాయంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. భారత దేశంలోని కొన్ని జాతుల వారు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు.

కొండ ప్రాంతంలో జీవించే కొన్ని జాతుల వారు హాని కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్ క్రిముల నుండి ఉపశమనం పొందటానికి ఈ ఆకులను ఎండబెట్టి ధూపం వేసి శరీరాన్ని హానికర క్రిముల నుండి రక్షించుకునేవారు. అంతే కాక శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులకు ఈ ఆకులు ఉపశమనం కలిగిస్తాయని నమ్మేవారు.

సాల్వియా జాతికి చెందిన ఈ ఆకులు చిన్న సాధారణ అనారోగ్యాలకు, ఉభకాయం, మధుమేహం, గుండెజబ్బులు మొదలగు ప్రాణాంతక వ్యాధుల నుండి ఉపశమనం లేదా నివారణ కలిగిస్తాయని సూచించేవారు. అంతే కాక జీర్ణక్రియలోని లోపాలను, దగ్గు, ఆస్తమా, నోరు, గోతు మంటలు, నిరాశ, అధిక చెమట, చర్మ వ్యాధులు, రక్త ప్రసరణ, శ్వాస కోశ సమస్యలు, ఏదో తెలియని భయాలను, గుప్త శక్తులు మరియు గుప్త శత్రువుల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది.  మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.  

పూర్వం కొన్ని జాతుల వారు ఎండిన సేజ్ ఆకులను మసాలాగా వంటలో ఉపయోగించేవారు. మానసిక స్ధితిని మెరుగు పర్చటమే కాకుండా అంతర్గతంగా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. పూర్వం కొంతమంది ఋషులు హోమం చేసేప్పుడు హోమ గుండంలో ఈ ఎండిన సేజ్ ఆకులను సమర్పించేవారు. ముఖ్యంగా శక్తి దేవతలకు సంబందించిన హోమాలు చేసేటప్పుడు ఈ ఆకులను ఉపయోగించేవారు.

సేజ్ ఆకులు మన నిత్య జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొత్తగా గృహారంభ, గృహ ప్రవేశం చేసేవారు ఈ సేజ్ ఎండిన ఆకుల కట్టను చిన్న మట్టి మూకుడు ప్లేట్ ను తీసుకొని ఆ ఆకుల కట్టను ధూపం వేయటం వలన కంటికి కనపడని అదృశ్య, దృశ్య హానికర బ్యాక్టీరియా, కొన్ని రకాల వాస్తు దోషాలను తొలగిస్తుంది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయ, నైరుతి సింహా ద్వారం ఉన్నవారు, మూడు దిక్కుల దోషం ఉన్నవారు తప్పనిసరిగా వారానికి ఒక్కసారి ఈ సేజ్ ఆకులను ధూపం వేయటం వలన ఆయా దిక్కుల దోషం తొలగి ఆ ఇంటిలో నివసించే వారికి రక్షణ కవచంలా కాపాడుతుంది.

శుభకార్యాలు, ముఖ్యమైన పండుగలు జరిగే ఇంటిలో ఈ సేజ్ ఆకులతో ధూపం వేయటం వలన ఆ కుటుంబంలో ఆర్ధికాభివృద్ధి, వంశాభివృద్ధి, ఆరోగ్య అభివృద్ధి కలుగుతాయి. మృత్యుంజయ, చండీ, సుదర్శన ఇలా ఇంటిలో చేసుకునే కొన్ని ముఖ్యమైన హోమాలలో  ఈ సేజ్ ఆకులను ఉపయోగించటం వలన ఆ హోమ ఫలితాలను సంపూర్ణంగా పొందే అవకాశాలు ఉంటాయి.

చిన్న పిల్లల దిష్ఠి దోషాలు తొలగటానికి, బాలారిష్ఠ దోషాలు తొలగటానికి, నక్షత్ర దోషాలను అరికట్టటానికి ఈ సేజ్ ఆకుల కట్టను చిన్న పిల్లలకు దిష్ఠి తీసి ఈ సేజ్ ఆకుల కట్టను కాల్చటం వలన దిష్టి దోషాలు తొలగిపోతున్నాయి అనేది తెలుసుకునే విధంగా కొత్త రకమైన వాసన కలిగే అవకాశాలు ఉంటాయి. కొన్నిరకాల గ్రహాల వలన కలిగే బాలారిష్ట దోషాలను తొలగించుకోవటానికి ఆయా గ్రహాలకు సంబందించిన సమిదలతో పాటు ఈ సేజ్ ఆకులతో హోమం గాని ఆయా గ్రహాధిపతులను పూజించే క్రమంలో గ్రహాలకు అధిపతి అయిన దేవ, దేవతలకు ధూపం వేయటం వలన బాలారిష్ఠ దోషాలు తొలగిపోతాయి. గండ నక్షత్ర దోషాలు తొలగించుకోవటానికి నక్షత్ర బలి లేదా నక్షత్ర శాంతి చేసే క్రమంలో ఈ సేజ్ ఆకులను నక్షత శాంతి హోమంలో ఉపయోగించటం వలన గండ నక్షత్ర దోషాలు తొలగిపోతాయి.

వ్యాపార సంస్ధలలో, ఆపీసుల్లో, ప్యాక్టరీలలో రకరకాల ప్రజల సంచారం ఉంటుంది కావున కొన్ని రకాల నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కావున వారానికి ఒక్కసారి అయిన సరే ఈ సేజ్ ఆకుల కట్టను ధూప వేయటం వలన నరదృష్టి తొలగిపోయి వ్యాపారాభివృద్ధి కలగటమే కాకుండా జనాకర్షణ, ఆర్ధికాభివృద్ధి కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.  

గ్రహణ సమయంలోను ఈ ఔషద ఆకులు గ్రహణ ప్రభావం వలన ఏర్పడిన చెడు శక్తులను అదుపు చేస్తుంది. గ్రహణం అయిన తరువాత ఇంటిని శుభ్రంగా శుద్ధి చేసుకొని ఈ ఔషద ఆకులతో ధూపం వేయటం వలన కుటుంబంలో ఉన్న వ్యక్తులపై ఎటువంటి గ్రహణ ప్రభావం చూపించదు. 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...