17, నవంబర్ 2022, గురువారం

వైధవ్య యోగం ఉన్న స్త్రీకి దీర్ఘ సుమంగలీ యోగం కలిగించే పరిహారం


శ్లోస్మరేశే కేంద్రరాశిస్ధే రంధ్రే శేనసమన్వితే

పాపగ్రహేణసందృష్టే యోగో వైధవ్య సంజ్ఞికః

తా. సప్తమాధిపతి ఆష్టమాధిపతితో కలసి కేంద్రమందుండి పాపగ్రహముచే చూడబడిన యెడల యా స్త్రీకి వైధవ్యము సంభవమగును.

శ్లో స్మరేశేనిసంయుక్తే భూమిపుత్రేణవీక్షితే

చంద్రరాహుస్థి తేరంధ్రే యోగో వైధవ్య సంజ్ఞికః

తా. సప్తమాధిపతి శనితో కలసియుండి కుజునిచే జూడబడినయెడల యా స్త్రీ వైధవ్యమును బొందును. లగ్నాదష్టమమందు కుజరాహువులున్న యెడల యాస్త్రీకి వైధవ్యము సంభవించును.

శ్లో నిధనే శేయధాభౌమే స్మరేణచసమన్వితే

చంద్రరాహుస్థి తేరంధ్రే యోగో వైధవ్యసంజ్ఞికః

తా. అష్టమాధిపతియు కుజుడు వీరిద్దరు సప్తమాధిపతితో కలసినను అష్టమ మందు చంద్రరాహువులున్నను యా స్త్రీకి వైధవ్యము సంభవించును.

శ్లో శనిభౌమయు తేరాహు స్మరరంధ్రగతో యది

బాల్యే వైధవ్య సంపాప్తి ర్యోగో వైధవ్యసంజ్ఞికః

తా. రాహువు శనికుజులతో కలసి సప్తమమందైనను అష్టమమందైనను నున్న యెడల యా స్త్రీకి బాల్యమందు వైధవ్యము సంభవించును.

శ్లో నవమాధిపజీవౌద్వా అ స్తనీచగతౌయాది

షష్టాష్టమవ్యయస్ధౌచే ద్భర్తృరల్పాయురాది శేత్ |

తా. నవమాధిపతియు గురుడును వీరిద్దరును అస్తంగతులైనను నీచను పొందినను షష్టాష్టమ వ్యయస్థానములను బొందినను అల్పాయుర్దాయము గలవాడగును.

శ్లో: అశ్వనీకృత్తికాశ్లేష పుబ్బోత్తరమఖానుచ

మూలాయాంశత తారాయ మనూరాధౌచజన్మనాం

పుంసాంచపాణిగ్రహణం భ వేత్క న్యా సుమంగలీ

తా. ఆశ్విని, కృత్తిక, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, మఖ, మూల, శతభిషం, అనూరాధా ఈతొమ్మిది నక్షత్రములలో యేనక్షత్రమందైనను జనించిన వరునకు ఆకన్యకను యిచ్చి వివాహమును జేసిన యెడల ఆ స్త్రీ సకలదోషరహితియగుచు దీర్ఘ సుమంగలీ యగును.

జన్మోత్ధంచవిలోక్య బాల విధవాయోగం విధాయవ్రతం

సావిత్య్రా ఉతపైప్పలంకిహి సుతయాదద్యాదిమా వారహః

సల్లగ్నేచ్యుతమూర్తి పిప్పలఘటైః కృత్వావివాహం స్ఫుటం

దద్యాత్తాంచిరజీవినేత్రభవేద్ధోషః పునర్భూభవః

జాతకమందు బాల వైధవ్య యోగం ఉన్నప్పుడు సావిత్రీ వ్రతం గాని, పిప్పల వ్రతం గాని చేయించాలి. లేదా అచ్యుతమూర్తితో రహస్య వివాహం గాని, పిప్పల వృక్షంతో వివాహం గాని, కుంభ వివాహం గాని జరిపించి చిరంజీవియైన (జాతకంలో దీర్ఘాయువుగల) వరునితో వివాహం చేయాలి అలా చేస్తే పునర్భూదోషం ఉండదు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...