8, ఫిబ్రవరి 2017, బుధవారం

వైడూర్యం (Cats`eye)

వైడూర్యం

వైడూర్యమునకు ఏక సూత్రము, ఖరాబ్జాంకురము, పిల్లి కన్ను, విదురాజం, అగ్రరోహ, మేఘరాంకుర, బాలసూర్య  అనేపేర్లు గలవు. వైడూర్యం ఛాయాగ్రహమైన కేతువుకి ప్రీతికరమైనది. ముదురు పచ్చరంగులో మధ్య సన్నని గీతలు గల రత్నం వైడూర్యం. వీటిలో 2 రకాలు గలవు. Alexandrite, Cats`eye. ఈ రెండింటికి వేరు వేరు లక్షణాలు కలిగి ఉన్నాయి. పసుపు పచ్చ రంగు కలిగి బూడిదవర్ణం కలిగి మధ్య తెల్లనిరంగులో సన్నని రేఖలు ఉంటాయి. అలానే బంగారు వర్ణంలో కలిగిన గోధుమ రంగులో మధ్యలో తెలుపు, తేనే రంగుల మిశ్రమంలో ఉండేవి అత్యంత విలువ కలది.

రత్నశాస్త్రం ప్రకారం వైడూర్యం పగలు సన్నని సందులో నుండి చూసిన పిల్లి కన్నువలె మెరుస్తు సన్నని గీత కదులుతూ ఉంటుందని, గచ్చకాయ, గోధుమరంగు, తెలుపు, నలుపు, బంగారు రంగులలోనూ లభ్య మగును. ఎక్కువగా గచ్చకాయ రంగులోనే లభ్యమగును. ప్రకృతిలో సున్న పురాతి నుండి లభిస్తాయి. బర్మా, సిలోన్, బ్రెజిల్, చైనా, ఇండియాలో, ఆప్ఘని స్తాన్, అర్జెంటైనా, రష్యా, చిలీ, అమెరికా, కెనడాలలో లభ్యమవుతున్నాయి. దీనికి కొండగాజు అనేపేరు కలగి ఫెరో రాజుల కాలంలో ఆభరణాలు గాను, ముద్రలగాను వాడినట్లు బైబిల్ గ్రంధంలో 28 వ అధ్యాయం, 6 వాక్యములో చెప్పబడింది. వైడూర్యమును ఈజిప్ట్ దేశములో అనేకమంది చక్రవర్తులు ధరించినట్టు చరిత్ర చెబుతుంది. రసాయన శాస్త్రం ప్రకారం కాల్షియం, సోడియం, అల్యూమినియం అనే రసాయన సమ్మేళనం వలన వైడూర్యం తయారవుతుంది.

                           తెల్లగా ఉండు వైడూర్యాలు బ్రాహ్మణ జాతి, తెలుపు, ఎరుపు మిళిత వర్ణము కలవి శూద్రజాతి, పసుపు, నలుపు మిశ్రమ వర్ణం కలవి వైశ్య జాతి, నలుపువర్ణం కలవి శూద్రజాతి వైడూర్యములు. రంగు, రూపం ఉన్న సుతార లక్షణము కల, బరువు ఎక్కువ ఉండి చిన్నగా ఉన్న ధన లక్షణం కల, కాంతి వంతంగా ఉన్న అత్యచ్ఛ లక్షణం కల, అద్భుతమైన కళ ఉన్న కలిల లక్షణం కల, లోపల ప్రతిబింబము కనిపిస్తూ ఉన్న వ్యంగ లక్షణం కలిగిన వైడూర్యాలు ధరించుటకు శ్రేష్ఠమైనవి. పులికన్ను, నలుపు, కృష్ణ వైడూర్యం, క్రాసుగా సూత్రములు కలవి అనేక రకాలు కలవు. నీలిరంగులో ఉన్నవి కృష్ణ వైడూర్యం, బంగారు రంగులో ఉన్నవి కనక వైడూర్యం అని చెప్పబడింది.    

గువ్వరాయి వలె కనిపించే వైడూర్యములను కర్కరము అంటారు. వీటి వలన కలహాలు కలిగే అవకాశాలు ఎక్కువ. చేతిలో పట్టుకుంటే గరుకుగా ఉండే వాటిని కర్కశ దోషం అంటారు. వీటివలన మానసిక అశాంతి కలుగును. ముక్కలు ఊడినట్లు ఉన్న త్రాసదోషం ఉన్న వాటిని ధరించిన నాశనం, అష్ట కష్టాలు కలుగును. మలినంగా,కాంతి విహీనంగా కనపడే వాటిని దేహ దోషం వలన అశుభం కలుగును. మిశ్రమ వర్ణములతో ఉన్న వాటి వలన ధరిద్రం కలుగుతుంది. కాంతిహీనం, మలినాలు, పగిలినట్లు ఉన్న, మట్టి, రాళ్ళు ఉన్న వైడూర్యరత్నాలు ధరించట మంచిది కాదు.

ఆయుర్వేదశాస్త్రం ప్రకారం వైడూర్యాన్నిగుర్రం మూత్రం నందు శుద్దిచేసి నేలవంకాయ రసమునందు రెండు రోజులు ఉంచి భస్మం చేసిన దానిని సేవించిన రక్త, పిత్తదోషాలు, అగ్ని, మలదోషాలు తగ్గించును. జ్ఞానావృద్ధిని, ఆయువృద్ధిని కలిగించును. స్త్రీలు ప్రసవించు సమయమునకు ముందు ఒక పాత్రలో జలం పోసి అందులో వైడూర్యాన్ని ఉంచి కొంతసేపటి తరువాత ఆ నీటిని సేవించిన సుఖ ప్రసవమగును.  వైడూర్యమును నేతిలో ఉంచి ఆనేతిని ప్రసవసమయంలో ఆ స్త్రీ సేవించిన సుఖ ప్రసవమగును.

వైడూర్యం ధరించుట వలన కలుగు ప్రయోజనాలు:- వైడూర్యం వలన చేతబడులు, బాణామతి వంటి దుష్ట శక్తుల నుండి భూత, ప్రేత, పిశాచాల బారినుండి రక్షిస్తుంది. ఇతరులు ప్రయోగించిన మంత్ర తంత్రములు నిష్పల మగును. స్త్రీలు ధరించిన సుఖప్రసవమగును.వైడూర్యం ధరించిన ఒక విధమైన దివ్య శక్తులు లభించగలదు. సర్వజన వశీకరణ జరుగును. ప్రముఖులతో పరిచయం కలుగును. దరిద్రం తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. జ్ఞానసంపద, మంత్ర సిద్ధులు కలుగును. నీటి గండములు, విషజంతువుల విషం హరించును.

దైవభక్తి, ధనవృద్ధి, ప్రమోషన్లు, రోగనిరోదకశక్తిని కలిగించును. కేన్సర్, హెమరేజ్, కీళ్ల నొప్పులు, వైరాగ్యం, దుఃఖం, జ్వరం, చర్మ వ్యాధులు, అధికారుల ద్వారా కలుగు నష్టాలు వైడూర్యం ధరించుట వలన తొలగిపోవును. మోక్షకారకుడైన కేతువు జాతకచక్రంలో లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉండి శుభగ్రహ దృష్టి లేకున్నా, కేతు దశ అంతర్ధశలలో, అశ్వని, మఖ, మూల నక్షత్రాలలో జన్మించినవారు వైడూర్యం ధరించవచ్చును. వైడూర్యం స్త్రీ ధరించిన సౌభాగ్యం,ఆయువృద్ధి కలుగజేయును. వైడూర్యం ధరించే ముందు “అశ్వద్వజాయి విద్మహే శూల హస్తాయా ధీమహీ తన్నో కేతు ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్లు కలిగిన వైడూర్యాన్ని గురువారం రోజు గురు హోరాలో ఉలవలు దానం ఇస్తూ ఉంగరం ధరించాలి.

8 కామెంట్‌లు:

  1. వైడుర్యం ను ఏ చేతికి ఏ వ్రేలికి ధరించాలి

    రిప్లయితొలగించండి
  2. ఎడమచేయి చిటికెన వేలికి ధరించాలని కొంతమంది పంతుల్లు చెప్పారు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆడవాళ్ళు రెండు చేతులుకు ధరించవచ్చు.మగవారు కుడి చేతికి ధరించుట శ్రేష్టం

      తొలగించండి
  3. వైడూర్యము మెడలో ధరించవచ్చునా

    రిప్లయితొలగించండి
  4. అశ్వని 3వ పాదం, మేషరాశి, వృషధ లగ్నం కలిగిన వారు వైడూర్యపు ఉంగరం ఏ వేలుకి ధరించాలి, ఏ రంగు ఉన్నది తీసుకోవాలి.

    రిప్లయితొలగించండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...