6, సెప్టెంబర్ 2022, మంగళవారం

చింతామణి స్టోన్


చింతామణి స్టోన్
 

చింతామణి స్టోన్ ధాయిలాండ్, టిబెట్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో లభిస్తుంది. చింతామణి స్టోన్ ఆరిజోనా అనే పట్టణంలో సోలమన్ అనే ప్రాంతంలో ప్రధమంగా లభించేవి. చూడటానికి నల్లగా కనబడుతుంది. ఇవి గ్రహ శకలాలు అని నక్షత్ర అవశేషాలు అని కొందరి అభిప్రాయం. సూర్యరశ్మికి గాని బల్బుకి దగ్గరగా ఉంచినప్పుడు తెల్లగా ఉంటుంది. పూర్వకాలంలో రాజుల కాలంలో ఈ స్టోన్ ప్రత్యేకమైన కిరీటాలలోను, కంట మాలలోను, విలువైన రత్నంగా ధరించేవారు.

చింతామణి స్టోన్ ముఖ్యంగా ఇతరుల దృష్టి మరల్చటానికి ఉపయోగపడుతుంది. చింతామణి స్టోన్ దగ్గర ఉన్న లేదా మెడలో ధరించిన నరదృష్టి ప్రభావాల వలన కలిగే నష్టాలను అరికడుతుంది. రాత్రి సమయంలో పిల్లలు ఎక్కువగా చికాకు చేస్తున్న, సరిగా నిద్ర పోకుండా ఏడుస్తున్నా, భయపడుతున్నా పిల్లలు నిద్రించే దగ్గర చింతామణి స్టోన్ మీద కాంతి పడే విధంగా ఉంచిన పిల్లలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోయే అవకాశాలు ఉంటాయి.

చింతామణి స్టోన్ మద్యపానం అధికంగా సేవించే వారికి ధూమపానం అధికంగా సేవించే వారికి ఈ స్టోన్ రాత్రి సమయంలో త్రాగే నీటిలో ఉంచి ఉదయం సేవించే విధంగా చేసిన చెడు అలవాట్లను, దురలవాట్లను రూపుమాపుతుంది. చింతామణి స్టోన్ మెడలో లాకెట్ లా ధరించే వారికి కోరికలు నెరవేర్చే అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గనిర్దేశం చేయటానికి ఉపయోగపడుతుంది. తరచుగా జూదం, లాటరీలు, షేర్ మార్కెట్ ద్వారా నష్టాలు చవి చూసే వారికి చింతామణి స్టోన్ అద్భుతంగా పనిచేస్తుంది.   

చింతామణి స్టోన్ జాతక చక్రంలో సూర్య, చంద్ర గ్రహాలతో రాహు, కేతువులు గాని కలసి 12 డిగ్రీలలోపు ఉంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది. గ్రహణ దోష ప్రభావం వలన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు జరిగే అవకాశాలు ఉంటాయి. తమ ప్రమేయం లేకుండా యాదృచ్చికంగా జరిగే నష్టాలకు ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. అకస్మాత్తుగా జరిగే అనారోగ్యాలకు, ఆర్ధిక నష్టాలకు కారణం ఈ గ్రహణ దోషం.

గ్రహణ దోష ప్రభావం తగ్గటానికి చింతామణి స్టోన్ ఉదయం సూర్యోదయానికి చింతామణి స్టోన్ పై సూర్యరశ్మి పడే విధంగా ఉంచి ఒక గంట తరువాత తీసి చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేయటం ద్వారా గ్రహణ దోష ప్రభావాన్ని తగ్గించవచ్చు. లేదా సూర్యరశ్మికి ఉంచిన చింతామణి స్టోన్ వాటర్ లో కొంతసేపు ఉంచి ఆ నీటిని స్వీకరించిన దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి చాలా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా కంటి సమస్యలు, చర్మ సమస్యలు ఉన్నవారికి ఈ చింతామణి స్టోన్ లాకెట్ గా ధరించిన, అనారోగ్యం ఉన్న శరీర బాగాలపై ఉంచిన ఉపశమనం కలుగుతుంది.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...