26, ఆగస్టు 2022, శుక్రవారం

బ్లాక్ టర్మలిన్ క్లస్టర్ (Black Tourmaline)


బ్లాక్ టర్మలిన్ క్లస్టర్ (Black Tourmaline)

బ్లాక్ టర్మలిన్ నలుపు రంగును కలిగి ఉంటుంది. బ్లాక్ టర్మలిన్ ఎక్కువగా ఆప్రికా, పాకిస్ధాన్, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలలో ఎక్కువగా లభిస్తుంది. ఇది మెరుగు పెట్టినట్లు ఉంటుంది. ఇందులో ఐరన్ మరియు మాంగనీస్ ఉంటాయి. అత్యంత అరుదుగా లభించే తెల్లటి వెండి రంగులో మెరుస్తూ ఉండే మైకా ఖనిజాన్ని కలిగి ఉండే బ్లాక్ టర్మలిన్ చాలా విశిష్టమైంది. అయస్కాంత శక్తులు కలిగి ఉంటుంది.

బ్లాక్ టర్మలిన్ మన నిత్య జీవన విధానంలో పలు రకాలుగా ఉపయోగపడుతుంది. ముందుగా బ్లాక్ టర్మలిన్ ముడి పదార్ధాన్ని నీటితో శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచి ఉదయం సూర్యోదయం నుండి కనీసం ఒక గంట సూర్యరశ్మికి బ్లాక్ టర్మలిన్ క్లస్టర్ ఉంచి పలు విధాలుగా ఉపయోగించవచ్చును. పలు రకాలుగా ఉపయోగించుకున్న బ్లాక్ ర్మలిన్ శుద్ధి కావటానికి ప్రతి నలభై ఐదు రోజులకొకసారి ఇలా సూర్యోదయానికి ఒక గంట ఉంచితే దానిలో ఉన్న నెగిటివ్ శక్తులు నశించి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.  

బ్లాక్ టర్మలిన్ కొత్తగా నిర్మించే గృహాలు, ప్యాక్టరీలకు శంకుస్ధాపన సమయంలో బ్లాక టర్మలిన్ ముడి పదార్ధాని భూమిలో స్ధాపితం చేయటం వలన భూమి లోపల అదృశ్యంగా ఉండే ఎముకలు, వెంట్రుకలు, బూడిద వంటి శల్య దోషాలను అరికడుతుంది. ఐ శల్య దోషాల కారణంగా ఆ ఇంటిలో నివసించే వారికి తరచుగా అనారోగ్య సమస్యలు, తరచుగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంత శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలు  ఉన్న గుర్తింపు లేకపోవటం చేస్తుంది. ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా చేస్తుంది. ఇక్కడ పని చేసే వారు నిలకడగా ఉండలేరు.  ఈ శల్య దోషాల నుండి వచ్చే ప్రతికూలమైన ఎనర్జీని కట్టడి చేసి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది.

బ్లాక్ టర్మలిన్ ముడి పదార్ధాన్ని బెడ్రూం లో టేబుల్ పైన ఉంచి దానిపై బ్లూ కలర్ బల్బు లైటింగ్ పడే విధంగా ఉంచిన మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. అలసిపోయిన శరీరానికి ప్రశాంతమైన నిద్రని కలిగిస్తుంది. బద్ధకం లేకుండా నిద్ర నుండి లేవగానే యాక్టివ్ గా ఉండే విధంగా ఎనర్జీని ఇస్తుంది. మతిమరుపును నివారిస్తూ ఙ్ఞాపక శక్తిని పెంచుతుంది. సూక్ష్మ పరిశీలన ఙ్ఞానాన్ని కలిగిస్తుంది. ఊహాత్మకమైన విషయాలపై ద్రుష్టి సారించే విధంగా దోహదపడుతుంది. చెడు కలల నుండి విముక్తి లభిస్తుంది. నిద్రలో కలవరపాటు ఉన్నవాళ్ళు బ్లాక్ టర్మలిన్ దగ్గర ఉంచుకోవటం మంచిది.

అనారోగ్య కారణాల వలన మన ఇంటిలో అకారణంగా మరణించిన వ్యక్తులు ఉన్న ఇంటిలో నివసించటానికి కొంతమంది బయపడతారు. వ్యక్తి చనిపోయిన ఇంటిలో ఒక సంవత్సరం పాటు నివాసానికి యోగ్యం కాదని చెబుతారు. అలా నివాసం ఉండటం వలన చనిపోయిన వారి ఆత్మలు పీడిస్తాయని కలలోకి వచ్చి ఇబ్బంది పెడతాయని భయపడుతూ ఉంటారు. ఇప్పుడున్న సామాజిక పరిస్ధితులలో ఇంటిని వదిలి సంవత్సరం పాటు వేరుగా ఉండటం సాధ్యపడని పరిస్ధితులలో బ్లాక్ టర్మలిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.  ఇలాంటి ఇంటిలో ముందుగా పుణ్యాహవచనం చేసి బ్లాక్ టర్మలిన్ ఆ ఇంటికి సంవత్సరం పాటు ప్రధాన దర్వాజాకు కట్టిన లేదా ఇంటిలో ఉంచిన ఎటువంటి ఇబ్బందులకు అవకాశం లేకుండా రక్షణ కవచంలా పని చేస్తుంది.

ఇంటిలో బాత్రూం సరైన దిక్కులలో నిర్మాణం చేయని ఇంటిలో బ్లాక్ టర్మలిన్ నల్లని గుడ్డలో కట్టి ఎక్కడన్న బాత్రూం లో ఉంచిన అక్కడ నుండి వచ్చే ప్రతికూలతలను తగ్గిస్తుంది. ఇంటికి కట్టిన గుమ్మడికాయ తరచుగా తొందరగా పాడవుతున్న గుమ్మడికాయ స్ధానంలో బ్లాక్ టర్మలిన్ ఎర్రటి గుడ్డలో ఉంచి నల్లటి త్రాడుతో కట్టి తగిలించిన నరదృష్టి, శత్రు బాధల నుండి విముక్తి లభిస్తుంది. ప్యాక్టరీలో పనిచేసే వారు తరచుగా ప్రమాదాలకు గురవుతున్న, వర్కర్స్ సరిగా పని చేయకున్న  ప్రభుత్వ లేదా ప్రవేటు కార్యాలయాలలో పనిచేసే వ్యక్తుల మద్య సమన్వయ లోపం ఉంటే  బ్లాక్ టర్మలిన్ ప్రధాన ద్వారానికి వ్రేలాడ దీస్తే మంచిది.     

బ్లాక టర్మలిన్ జాతకంలో శనిగ్రహ దోషాలనుండి, కాలసర్ప దోషాల నుండి విముక్తి కలిగిస్తుంది. సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కలిగిస్తుంది. పోటీతత్వ పరీక్షలలో విజయాన్ని అందిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. మానసికమైన అవగాహన కలిగిస్తుంది. అసూయ ద్వేషాల నుండి విముక్తి కలిగిస్తుంది. శని గ్రహ దోషం నుండి ఇబ్బందులను అదిగమించటానికి చిన్న బ్లాక్ తర్మలిన్ ముక్కను చేతిలో ఉంచుకొని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తూ ఉండటం వలన మనస్సు  ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత లభిస్తుంది. చిన్న ముక్కని నీటిలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మలబద్ధకం నుండి, కండరాల నొప్పి, నరాల నొప్పి, కీళ్ళ నొప్పులు, తిమ్మిర్లు మొదలగు అనారోగ్య సమస్యల నుండి తొందరగా కోలుకొనే విధంగా చేస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...