7, నవంబర్ 2023, మంగళవారం

హిమాలయ ‘రాక్ సాల్ట్”

హిమాలయ రాక్ సాల్ట్

హిమాలయాల నుండి తవ్విన గులాబీ రంగు స్పటికాలను ఉపయోగించి రాక్ సాల్ట్ ను తయారుచేస్తారు. ఇవి ముఖ్యంగా హిమాలయాల్లో నుండి లభిస్తాయి. హిమాలయాల నుండి వచ్చిన రాక్ సాల్ట్ స్టోన్స్ ప్రదానంగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అని శాస్త్రీయంగా నిరూపితమైనది. ఈ రాక్ సాల్ట్ స్టోన్ నందు హైగ్రోస్కోపిక్ లక్షణాలు ఉండటం వలన ఆస్తమా, దగ్గు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆనారోగ్య సమస్యలను నివారిస్తాయి.

హిమాలయ రాక్ సాల్ట్ స్టోన్ కి కొంత కాంతిని ఉపయోగించటం వలన శరీరంలోని నరాల బలహీనత, బద్ధకం, ఒత్తిడి, చెడు ఆలోచన విదానాన్ని తొలగిస్తాయి. అంతేకాక మొభైల్ ఫోన్ల నుండి, మొభైల్ టవర్ల, రేడియో వర్ల నుండి టెలివిజన్ మరియు ఇతర ఎలట్రానిక్ పరికరాల నుండి వచ్చే ప్రతికూల తరంగాల నుండి రక్షిస్తుంది.

జాతకంలో కుజ గ్రహ దోషాల నుండి విముక్తి పొందటానికి  రాక్ సాల్ట్ స్టోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కుజ గ్రహ దోషాల వలన వైవాహిక సమస్యలు, తరచుగా గొడవలు, వాహన ప్రమాదాలు, తరచుగా దెబ్బలు తగలటం, సంతాన సమస్యలు ఎదుర్కోవటం, స్త్రీల మెన్సస్ ప్రాబ్లమ్స్ కలగటం, రక్తహీనత కలగటం ఇవన్నీ కుజ గ్రహ దోషాల వలన ఎదుర్కొనే సమస్యలు.  సమస్యలను రాక్ సాల్ట్ స్టోన్ ఎంతగానో ఉపయోగపడతాయి. తరచుగా అబార్షన్స్ అయ్యే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రాక్ సాల్ట్ స్టోన్ వాటర్ లో వేసుకొని ఆ వాటర్ స్వీకరించవచ్చు. ఈ స్టోన్ ఉపయోగించి దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ  స్టోన్ ఇంటిలో హాల్ లో గాని, బెడ్రూమ్ లోగాని ఉంచి శాశ్వతంగా కుజ గ్రహాల నుండి వచ్చే సమస్యలను నివారించుకోవచ్చును.

హిమాలయ రాక్ సాల్ట్ స్టోన్ ఉపయోగించి కొన్ని రకాల వాస్తు దోషాల నుండి విముక్తి కలిగిస్తుంది. ఒక ఇంటిలో గాని, వ్యాపార సంస్ధలో గాని ఆగ్నేయంలో గాని, దక్షిణంలో గాని వాస్తు దోషాలు ఉన్నప్పుడూ ఈ రాక్ సాల్ట్ స్టోన్ ను కిలోకి తగ్గకుండా ఉంచి వాస్తు దోషం ఉన్న ప్రదేశంలో ఉంచిన ఆ ప్రదేశం నుండి వచ్చే ప్రతికూల సమస్యలను ఈ రాక్ సాల్ట్ స్టోన్ ను బాగా ఉపయోగపడుతుంది. దక్షిణ దిక్కు వీధిపోటు ఉన్న, దక్షిణ దిక్కు పెరిగినా రాక్ సాల్ట్ స్టోన్ ని ఉంచటం ద్వారా దోషాన్ని నివారించవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...