ఆకస్మిక లాభాలు అనగా పందెం, జూదం, లాటరీలు మొదలగువాని వలన కలిగే లాభం. ఇటువంటి ధన ప్రాప్తి కోసం జాతకచక్రంలో ధన యోగముండాలి. ఇటువంటి ఆకస్మిక లాభాలు పంచమ స్ధానం వాని అధిపతిని బట్టి విచారించటం పంచమ స్ధానం బలం కలిగి అందులో శుభ గ్రహాలు ఉండి శుభగ్రహ దృష్టి కలిగి ఉండి పంచమాధిపతి బలవంతుడై ద్వితీయ లాభ స్ధానాల్లో శుభగ్రహ దృష్టి కలవారై ఉంటే జాతకునికి ఆకస్మిక లాభాలు ఉంటాయి. పంచమ స్ధానం పాపగ్రహ సంయోగం, పాపగ్రహ వీక్షణ కలిగి పంచమాధిపతి ద్వాదశ స్ధానంలో పాపగ్రహ సంయోగం, పాపగ్రహ వీక్షణం కలిగి ఉంటే జాతకుడు నష్టపోయే ప్రమాదం ఉంది. చంద్రుడు రాహువు పంచమ స్ధానంలో ఉంటే ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక లాభాలకు, నష్టాలకు అష్టమ స్దానాన్ని పరిశీలించాలి. అష్టమంలో పాపగ్రహాలుంటే ఆకస్మిక నష్టాలు, శుభగ్రహాలు, స్ధాన బలం మొదలగు షడ్బలాలు కలిగి ఉంటే ఆకస్మిక లాభాలు వస్తాయని గుర్తించుకోవచ్చు.
ఆకస్మిక
ధనప్రాప్తిని కలిగించే కొన్ని యోగాలు
లాభస్ధానాధిపతి
భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరిగటం వలన ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
లాభ
స్ధానాధిపతి (ద్వితీయ భావాధిపతి) ధనాధిపతుల మద్య పరివర్తన జరగటం.
ధనాధిపతి
మరియు భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగటం.
ధనాధిపతి
మరియు భాగ్యాధిపతుల యుతి 1,2,4,5,7,9,10,11
స్ధానాలలో ఉంటే ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
ధనాధిపతి
మరియు లాభాధిపతుల మధ్య యుతి 1,2,4,5,7,9,10,11
స్ధానాలలో ఉంటే ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
భాగ్యస్ధానాధిపతి
మరియు లాభధిపతుల మధ్య యుతి 1,2,4,5,7,9,10,11 స్ధానాలలో
ఉంటే ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
భాగ్యాధిపతి
భాగ్యంలో శుభ షడ్వర్గులలో ఉంటే ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
భాగ్య
స్ధానంలో ఉన్న గ్రహానికి ఉచ్చ స్ధానం అయి ఉండి నవాంశలోను శుభ స్ధానంలో ఉండి బలంగా ఉంటే
ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
లాభాధిపతికి
1,2,4,5,9,10,11 స్ధానాలలో సప్తమాధిపతి ఉచ్చ క్షేత్రాలలో ఉన్న ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
భాగ్యాధిపతికి
1,2,4,5,9,10,11 స్ధానాలలో సప్తమాధిపతి ఉచ్చ క్షేత్రాలలో ఉన్న ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
ధనాధిపతికి 1,2,4,5,9,10,11 స్ధానాలలో సప్తమాధిపతి ఉచ్చ క్షేత్రాలలో ఉన్న ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. ధనాధిపతి సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరిగిన ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
లాభాధిపతి
సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరిగిన ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
భాగ్యాధిపతి
సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరిగిన ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
జాతకంలో
మాలికా యోగం కలిగి ఉన్నా ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
లగ్నాధిపతి
ద్వితీయాధిపతుల మధ్య పరివర్తన కలిగిన ఉన్న ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
రవి
2,9,11 భావాలలో
ఉచ్చ లేదా స్వక్షేత్ర స్ధితి పొందటం వలన ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి.
2,9,11 అధిపతులు రాశి నవాంశ
లలో బలంగా ఉండటం వలన ఆకస్మిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
పంచమంలో
చంద్రుడు గాని రాహువు గాని బలవంతుడై ఉండి గురు దృష్టి కలిగి ఉన్న ఆకస్మిక ధనప్రాప్తి
కలిగే అవకాశాలు ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి