23, ఆగస్టు 2013, శుక్రవారం

పసుపు మాల(Turmeric mala)

 పసుపు మాలు
 పసుపు మాల

పసుపు మాల
       పసుపు మాల సాదారణంగా మనకు లభించే పసుపు కొమ్ములను మిషన్ ద్వారా రౌండ్ గా కట్ చేయబడి 108 పూసలతో మాలగా తయారుచేయబడి ఉంటుంది.పసుపు మాలను జాతకచక్రం లో గురుగ్రహాదోషం ఉన్నవారు జపం చేయవచ్చును. లేదా మెడలో ధరించవచ్చును.

20, ఆగస్టు 2013, మంగళవారం

శ్రీ లక్ష్మీ ఫలం (Sri Lakshmi Phalam)

చంద్రగ్రహ దోష నివారణకు "శ్రీపలం".

శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం,పూర్ణఫలం అనికూడ అంటారు.చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ అని పెద్దల వాక్యం. మనస్సే అన్నింటికీ కారణం. ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుని కళలతో మనస్సు ప్రభావితం అవుతుందని పెద్దలు చెబుతారు. రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి చంద్రుడు కారకుడు.

బంగారు(పసుపు) వర్ణం కలిగిన సుదర్శన సాలగ్రామాలు(Sudarshana Saligramam)

బంగారు(పసుపు) వర్ణం కలిగిన సుదర్శన సాలగ్రామాలు
   సాలగ్రామాలకి హిందూమతంలో బారీ ప్రాముఖ్యత కలిగివుంది. సాలగ్రామాలు నేపాల్ లోని  ముక్తినాధ్ నందు గల కాలగండకినది నందు లభిస్తాయి. ఈ నదినే కృష్ణ గండకి అని కూడ పిలుస్తారు.సాలగ్రామాలు నలుపు రంగులో మాత్రమే లభిస్తాయి.వ్రిందా అనే మహిళ శాపం వలన సాలగ్రామాలు నలుపు రంగును కలిగి ఉన్నాయి అని పురాణాలలో ప్రస్తావించారు.

17, ఆగస్టు 2013, శనివారం

పాదరస లక్ష్మీదేవి(Parad Lakshmi)


 పాదరస లక్ష్మీదేవి
         పాదరస లక్ష్మీదేవిని పాదరసంలో వెండి కలిపి లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమ నిష్ఠలతో అనుభవమున్నవారు తయారుచేస్తారు. పూర్వం ఇంద్రుడు,కుబేరుడు,దిక్పాలకులు,వశిష్టుడు,విశ్వామిత్రుడు,ఆదిశంకరాచార్యుల వారు  పాదరస లక్ష్మీదేవిని పూజించారని శాస్త్రాలు చెబుతున్నాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహాలు గొప్ప అతీంద్రియశక్తి కలిగి ఉంటాయి.యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి అమ్మవారి విశిష్టతను తెలిపారు అందులో పాదరస లక్ష్మీ దేవి విశిష్టత గురించి  కూడా తెలియజేశారు.

12, ఆగస్టు 2013, సోమవారం

గణేష్ శంఖము(Ganesh sanku)

గణేష్ శంఖము
            గణేష్ శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది.గణేష్ శంఖం గణపతి ఆకారాన్ని కలిగి ఉంటుంది.గణేష్ శంఖాన్ని వినాయకచవితి నాడు గాని ,బుదవారం గాని,గురువారం రోజు గాని పూజించటం చాలా మంచిది.గణేష్ శంఖం వినాయక స్వరూపంగా పూజించి శంఖ తీర్ధాన్ని సేవిస్తే చాలా మంచిది.

5, ఆగస్టు 2013, సోమవారం

దక్షిణావృత శంఖం

దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం....

శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి

దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ శోభను పెంచుతుంది. 

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...