25, సెప్టెంబర్ 2018, మంగళవారం

పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రం

పంచముఖ హనుమాన్ వాహన నియంత్రణ యంత్రం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతక చక్రాన్ని అనుసరించి చతుర్ధ స్ధానంలో పాప గ్రహాలు ఉన్న, చతుర్ధాదిపతి పాప క్షేత్రాలలో ఉన్నా, వాహన సౌఖ్య కారకులైన గురు, శుక్రు బాగ లేకపొయిన తరచుగా రొడ్డు ప్రమాదాలు కలగటం, వాహనం నడపాలంటే భయపడటం జరుగుతుంది. తరచుగా   పంచముఖ హనుమాన్ వాహాన నియంత్రణ యంత్రం వాడటం వలన వాహన సౌఖ్యత కలుగుతుంది.

17, సెప్టెంబర్ 2018, సోమవారం

కన్యారాశి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం.

కన్యారాశి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం.

కన్యా లగ్నం, కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి, షణ్ముఖి, సప్తముఖి రుద్రాక్షలు. కన్యా  లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. కన్యా  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు లేదా బుధవారం రోజు  శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును. 

12, సెప్టెంబర్ 2018, బుధవారం

కుజగ్రహ దోష నివారణకు “బగళాముఖి యంత్రం”

కుజగ్రహ దోష నివారణకు “బగళాముఖి  యంత్రం” 

జాతకంలో కుజ గ్రహ దోష నివారణకు తాంత్రిక దేవతాధిపతిగా బగళాముఖిని పూజిస్తారు. శత్రు పీడలు, ఋణబాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు బగళాముఖి యంత్రం ఉన్న కార్డును మొదటిసారి మంగళవారం రోజు పూజా మందిరంలో ఉంచి పూజ చేసిన పిదప వాహనంలో గాని, ముఖ్యమైన పనుల్లో విజయాల కోసం దగ్గర ఉంచుకొని వెళ్ళటం ద్వారా బగళా దేవి అనుగ్రహం లభించి వాహన ప్రమాదాల నుండి రక్షణ మరియు అన్ని పనుల్లోనూ విజయం సాధించవచ్చును.  

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...