27, ఏప్రిల్ 2015, సోమవారం

శనిగ్రహ దోష పరిహారాలు

Nerella Raja Sekhar's photo.శనిగ్రహ దోష పరిహారాలు

శని అంటే నవగ్రహాలలో ఒక అతి ముఖ్య గ్రహం.జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు ‘పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తువుంటాయి.వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి వ్యక్తి ఎం తో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనం గడిపి, ‘శని’’గాడు అని ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు.

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని,ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది.వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నవ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.

రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే.ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన,వాతావరణం,నీరు మార్చటం వలన, రత్నధారణ వలన,జప దాన హోమాదుల వలన,ఔషదాల వలన,మంత్రోచ్ఛారణ వలన,కాస్మిక్ కిరణాల ద్వారా,కలర్ ధెరపీ ద్వారా,అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును,ముఖ్యంగా ఆదిత్య హృదయం,దుర్గాసప్తశ్లోకి,సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.

పరివర్తన యోగం

జాతకచక్రంలో పరివర్తన యోగం:-

పరివర్తన యోగం అంటే జాతకచక్రంలో రెండు గ్రహాలు ఆదిపత్యం వహించే రాశుల మద్య జరిగే పరివర్తననే పరివర్తన యోగం అంటారు.

ఉదా:- కన్యా రాశికి అధిపతి బుధుడు,మీన రాశికి అధిపతి గురువు, కన్యా రాశిలో గురువు,మీనరాశిలో బుదుడు ఉండటం వలన ఒకరి ఆదిపత్య రాశిలో ఇంకొకరు ఉండటం జరిగింది.దీనినే పరివర్తన యోగం అంటారు.

21, ఏప్రిల్ 2015, మంగళవారం

అనంత కాలసర్పదోషం

అనంత కాలసర్పదోషం.

అనంత కాలసర్పదోషం రాహువు లగ్నంలో కేతువు సప్తమంలో గ్రహాలన్నీ రాహు కేతువుల మద్య ఉంటే అనంత కాలసర్పదోషం అంటారు.

జ్యోతిష్య విద్వాంసులైతే మొత్తం 288 రకాల కాలసర్పదోషాలను వర్ణించిచెప్పాడు.వీటిలో కాలసర్పభావాల ప్రకారం 12 ముఖ్యమైనవి .

అనంత, కులిక, వాసుకి, శంఖ, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, మహాశంఖ, పతాక, విషధర, శేషనాగ అని 12 రకాల కాలసర్పయోగాల గురించి పూర్వీకులు వివరించారు. 

11, ఏప్రిల్ 2015, శనివారం

జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం

జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం 

జాతకచక్రం ద్వారా జాతకుడికి దిక్కు కలసి వస్తుందో అష్టకవర్గు ని పరిశీలించి తెలుసుకోవచ్చు.అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి నివశించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు.వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలసి వస్తుందో అష్టక వర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చును.

1)అగ్నితత్వ రాశులైన మేషం,సింహ,ధనస్సు రాశులు (1,5,9 రాశులు) తూర్పు దిక్కును తెలియజేస్తాయి.
2)భూతత్వ రాశులైన వృషభం,కన్య,మకర రాశులు (2,6,10 రాశులు) దక్షిణ దిక్కును తెలియజేస్తాయి.
3)వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశులు (3,7,11 రాశులు) పడమర దిక్కును తెలియజేస్తాయి.
4)జలతత్వ రాశులైన కర్కాటకం వృశ్చికం,మీన రాశులు (4,8,12 రాశులు) ఉత్తర దిక్కును తెలియజేస్తాయి.

అగ్నిభూ,వాయు,జల తత్వ రాసుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాది, సంపాదన ఉంటుంది.

పైన ఉన్న జాతక చక్రంలోని అష్టకవర్గు చక్రాన్ని పరిశీలిస్తే 

అగ్నితత్వ రాశులైన మేషరాశిలో 28 సింహరాశిలో 26 ధనస్సురాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులు 81 తూర్పు దిక్కును తెలియజేస్తాయి. 

భూతత్వ రాశులైన వృషభరాశిలో 30 కన్యారాశిలో 26 మకరరాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులు 83 దక్షిణ దిక్కును తెలియజేస్తాయి. 

వాయుతత్వ రాశులైన మిధునరాశిలో 36 తులారాశిలో 20 కుంభరాశిలో 31 మొత్తం సర్వాష్టక బిందువులు 87 పడమర దిక్కును తెలియజేస్తాయి.

జలతత్వ రాశులైన కర్కాటకరాశిలో 35 వృశ్చికరాశిలో 30 మీనరాశిలో 21 మొత్తం సర్వాష్టక బిందువులు 86 ఉత్తర  దిక్కును తెలియజేస్తాయి.

వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశుల సర్వాష్టక వర్గుల బిందువుల మొత్తం 87 వచ్చాయి.ఈ మొత్తం అగ్ని,భూ,జలతత్వ రాశుల సర్వాష్టక బిందువుల కంటే అధికంగా ఉన్నాయి కాబట్టి జాతకుడికి పడమర దిక్కు బాగా కలసి వస్తుంది.







3, ఏప్రిల్ 2015, శుక్రవారం

శుక్ర మూఢమి

శుక్ర మూఢమి లేదా మౌఢ్యమి...

బుధుడు,శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడుభూమిపైన ఉన్న మనకు బుధ,శుక్రులు కనిపించారు.అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం,శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.

శుక్రుడు సూర్యునికి అవతలివైపునకు వెళ్ళినప్పుడు “ప్రాక్ అస్తంగత్వం” అని,శుక్రుడు సూర్యునికి భూమికి మద్య అస్తంగత్వం అయినప్పుడు పశ్చాద అస్తంగత్వం అంటారు. మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు.అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి.గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

1, ఏప్రిల్ 2015, బుధవారం

గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం

గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం..

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.

సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...