జాతకచక్రాన్ని పరిశీలన చెసేటప్పుడు,ప్రశ్నచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు దగ్ధరాశిని పరిశిలించటం ఎంతో ముఖ్యం.ముందుగా జాతకచక్రంలో జన్మతిధిని గాని,ప్రశ్నచక్రంలో ప్రశ్నదినపు తిధిని గాని గుర్తించాలి.ప్రతి తిధికి కొన్ని రాశులు దగ్ధ రాశులగును.దగ్ధ రాశులలో పడిన భావములు తమ కారకత్వాలను పోగొట్టుకొనును.అలాగే దగ్ధ రాశులలో ఉన్న గ్రహలు కూడ తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
31, అక్టోబర్ 2014, శుక్రవారం
జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”
జాతకచక్రాన్ని పరిశీలన చెసేటప్పుడు,ప్రశ్నచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు దగ్ధరాశిని పరిశిలించటం ఎంతో ముఖ్యం.ముందుగా జాతకచక్రంలో జన్మతిధిని గాని,ప్రశ్నచక్రంలో ప్రశ్నదినపు తిధిని గాని గుర్తించాలి.ప్రతి తిధికి కొన్ని రాశులు దగ్ధ రాశులగును.దగ్ధ రాశులలో పడిన భావములు తమ కారకత్వాలను పోగొట్టుకొనును.అలాగే దగ్ధ రాశులలో ఉన్న గ్రహలు కూడ తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
లాపిస్ లాజులి స్టోన్ (Lapis Lazuli )
నిత్య జీవితంలో కొన్ని నియమాలు పాటిస్తే శని గ్రహ దోషం నుండి విముక్తి పొందవచ్చు.జైమిని సిద్ధాంతంలో శని మహాదశలలో,ఏల్నాటి శని,అష్టమశని ,అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఎవరి వ్యాపకాలలో వారు ఉంటే శని ఏమి చేయడు.ఇతరుల పనులలో అనవసరంగా తలదూర్చటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నవగ్రహ దోష నివారణకు హోమ సమిధలు

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”
అంటూ శారీరక,మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు,దానాలు,జపాలు,హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది.వానిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగ పడుతుంది.హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటంవలన ఒక్కో సమిధ వలన ఒక్కో రోగం నివారించబడుతుంది.
24, అక్టోబర్ 2014, శుక్రవారం
తులసిమాల(Tulasi Mala)

తులసి మాలలో అత్యంత శ్రేష్టమైనవి వ్రిందావన్ (బృందావన్) తులసి .ఈ తులసి శ్రీ కృష్ణుని జన్మస్థానమైన మధుర పట్టణంలోని నిదివన్ మరియు సేవా కుంజ్ అను రెండు వనములందు లభించును.
జాతకచక్రంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు తులసిమాలతో జపం చేయటంగాని,మెడలో దరించటంగాని చేస్తే శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు.రామతులసి శుక్రగ్రహ దోషాలు పోవటానికి,కృష్ణతులసి శని గ్రహ దోషాలు పోవటానికి మెడలో దరిస్తారు.
21, అక్టోబర్ 2014, మంగళవారం
వైజయంతి మాల(Vyjanti Mala )

వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి.వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.
క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.
"కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె
మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ"
లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.
మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ"
లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.
18, అక్టోబర్ 2014, శనివారం
సాలగ్రామమాల (Salagramamala)

సాలగ్రామాలకి హిందూమతంలో బారీ ప్రాముఖ్యత కలిగివుంది. సాలగ్రామాలు నేపాల్ లోని ముక్తినాధ్ నందు గల “కాలగండకి”నది నందు లభిస్తాయి. ఈ నదినే “కృష్ణ గండకి” అని కూడ పిలుస్తారు.సాలగ్రామాలు నలుపు రంగులో మాత్రమే లభిస్తాయి.వ్రిందా అనే మహిళ శాపం వలన సాలగ్రామాలు నలుపు రంగును కలిగి ఉన్నాయి అని పురాణాలలో ప్రస్తావించారు.
17, అక్టోబర్ 2014, శుక్రవారం
పాదరస సాయిబాబా (Padarasa Saibaba)

జ్యోతిశ్శాస్త్రంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. ‘‘బుద్ధిలో బృహస్పతి వంటి వాడు’’ అని వాడుతుంటారు. ‘చంద్రోమాతా పితా స్యూర్యః ప్రాణాశ్చైత బృహస్పతిః’ అని ఉపనయన ముహూర్త విషయంలో, అక్షరాభ్యాస, అన్నప్రాసన, గర్భాదాన, దేవాలయ ప్రతిష్ఠా విశేషాల్లో బృహస్పతి బలం లేని ముహూర్తం పెట్టకూడదని శాస్త్రం.
మనిషి బతికినంత కాలం వాడకం కోసం జీవనం కోసం అవసరమయ్యే ధనం, విద్య, దేహ పుష్టి గురు గ్రహం ద్వారా లభించేవి. ‘గురుణా దేహ పుష్టిశ్చా బుద్ధిః పుత్రార్ధ సంపదః’బృహస్పతి యొక్క సానుకూల ఫలితాలు పొందడం కోసం పాదరసంతో చేసిన సాయిబాబాఆరాధన విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది.
స్పటికమాల (Crystal Mala) క్రిస్టల్ మాల

శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్ఫటిక మాల ధారణ వల్ల కూడ జాతకులు శాంతిని అనుభవిస్తారని చెప్పబడింది.వివాహకారకుడు శుక్రుడు .వివాహం కాని వారు,వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం అయిన తరువాత దాంపత్య సౌఖ్యంలో ఇబ్బందులు ఎదుర్కోనేవారు శుక్రగ్రహనికి చెందిన స్పటిక మాలను ధరించటం మంచిది. 'స్ఫటికమంత స్వచ్ఛన' (క్రిస్టల్ క్లియర్) అనేపద ప్రయోగం మనం విని వున్నదే. నిర్మలమయిన మనస్సును స్ఫటికంతో పోలుస్తారు.
''మాలాకప్తాసనస్థ: స్ఫటిక మణి నిభై ర్మౌక్తికై ర్మండి తాఙ్గ:'' అంటూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రావళిలో స్పటికమణి గురించిన ప్రస్తావన వుంది. చాలామంది రుద్రాక్షలతో పాటు స్ఫటిక మాలను కూడ కంఠసీమలో ధరిస్తారు.
13, అక్టోబర్ 2014, సోమవారం
11, అక్టోబర్ 2014, శనివారం
నల్ల పసుపు (Black turmeric) (Black Haldi)

జాతకంలో శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు చాలా బాగ ఉపయోగ పడుతుంది. నల్ల పసుపు అనేక దుష్ప్రభావాలను అరికడుతుంది.నల్లపసుపు ని "కృష్ణ హరిద్ర"అని అంటారు.
నల్లపసుపు తాంత్రిక విధానంలో ధనవృద్ధి కారక వస్తువుగా ఉపయోగపడుతుంది.నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ మరియు నేపాల్ లోను లభిస్తుంది.
6, అక్టోబర్ 2014, సోమవారం
ముత్యపు శంఖం(Moti Sanku)

ముత్యపు శంఖం శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. ముత్యపు శంఖం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ముత్యపు కాంతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ముత్యపు శంఖం మేరువు ఆకారంలో పైన సన్నగా ఉండి కిందవైపు ఉదరం ఉంటుంది. ముత్యపు శంఖాలు కొన్ని పైన కోన తేలి ఉంటాయి.మరికొన్ని రంధ్రంతో ఉంటాయి.రంధ్రంతో ఉన్న ముత్యపు శంఖాలతోటి ద్వని(ఊద) చేయవచ్చు.
ముత్యపు శంఖాలని సోమవారం రోజు గాని ,శుక్రవారం రోజు గాని , దీపావళి,అక్షయతృతీయ రోజు పూజలు చేస్తారు. ముత్యపు శంఖాలు జ్యోతిష్యంలో చంద్రగ్రహానికి సంబందించినది కాబట్టి సోమవారం ప్రశస్తమైనది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)