30, ఏప్రిల్ 2021, శుక్రవారం

నక్షత్రాలలో రోగారంభం - రోగం ఉండే రోజులు.

కృత్తికాసు యదా కశ్చిజ్జ్వరాది ప్రతిపద్యతే

నవరాత్రం తదాపీడా త్రిరాత్రం రోహిణీషుచ

మృగశీర్షే పంచరాత్ర మార్ద్రా ప్రాణ భయం తధా

పునర్వ సూచ పుస్యశ్చ సప్తరాత్రం విధీయతే

నవరాత్రం తధా శ్రేషాః శ్మశానంతం మఘాసుచ

ద్వేమాసౌ ఫల్గునీచైవ హోత్తరాసు త్రిపంచకమ్

హస్తేన జాయతే పక్షం చిత్తాచైవార్ధమాసకమ్

మాసద్వయం తధా స్వాతీ విశాఖే పంచ వింశతిః

అనూరాధ దశ ప్రోక్తా జ్యేష్ఠా చైవార్ధా మాసకమ్

మూలేచ జాయతే మోక్షః పూర్వాషాడ స్త్రీ పంచకమ్

ఉత్తరే దినా వింశత్యా ద్వేమాసౌ శ్రావణే తధా

ధనిష్ఠాయా మర్ధమాసో వారుణేచ దశాహకమ్

పూర్వాభాద్ర పడేమోక్ష ఉత్తరాసు త్రిపంచకమ్

రేవతీ సప్తరాత్రంచ హ్యాహోరాత్రం తధాశ్వినీ

భరణీ తత్ క్షణేనైవ మరణంటు నసంశయః


కృత్తికా నక్షత్రంలో జ్వరాదులు వస్తే తొమ్మిది రాత్రులు పీడ.

రోహిణీ నక్షత్రంలో జ్వరాదులు వస్తే మూడు రాత్రులు పీడ.

మృగశిర నక్షత్రంలో జ్వరాదులు వస్తే ఐదు రాత్రులు పీడ.

ఆర్ధ్ర నక్షత్రంలో జ్వరాదులు వస్తే ప్రాణ భయం.

పునర్వసు, పుష్యమి నక్షత్రంలో జ్వరాదులు వస్తే ఏడు రాత్రులు పీడ.

ఆశ్లేష నక్షత్రంలో జ్వరాదులు వస్తే తొమ్మిది రాత్రులు పీడ.

మఘ నక్షత్రంలో జ్వరాదులు వస్తే మరణం.

పుబ్బ నక్షత్రంలో జ్వరాదులు వస్తే రెండుమాసాలు పీడ.

ఉత్తరా నక్షత్రంలో జ్వరాదులు వస్తే పదిహేను రోజులు పీడ.

హస్తా నక్షత్రంలో జ్వరాదులు వస్తే ఒక పక్షం రోజులు పీడ.

చిత్తా నక్షత్రంలో జ్వరాదులు వస్తే పదిహేను రోజులు పీడ.

స్వాతి నక్షత్రంలో జ్వరాదులు వస్తే రెండు మాసాల పీడ.

విశాఖ నక్షత్రంలో జ్వరాదులు వస్తే ఇరవై రోజులు పీడ.

అనూరాధ నక్షత్రంలో జ్వరాదులు వస్తే పది రోజులు పీడ.

జ్యేష్ఠ నక్షత్రంలో జ్వరాదులు వస్తే పదిహేను రోజులు పీడ.

మూలా నక్షత్రంలో జ్వరాదులు వస్తే మరణం. (మోక్షం)

పూర్వాషాడ నక్షత్రంలో జ్వరాదులు వస్తే పదిహేను రోజులు పీడ.

ఉత్తరాషాడ నక్షత్రంలో జ్వరాదులు వస్తే ఇరవై రోజులు పీడ.

శ్రవణా నక్షత్రంలో జ్వరాదులు వస్తే రెండు మాసాల పీడ.

ధనిష్ఠా నక్షత్రంలో జ్వరాదులు వస్తే పదిహేను రోజులు పీడ.

శతభిషా నక్షత్రంలో జ్వరాదులు వస్తే పది రోజులు పీడ.

పూర్వాభాధ్ర నక్షత్రంలో జ్వరాదులు వస్తే మరణం (మోక్షం).

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జ్వరాదులు వస్తే పదిహేను రోజులు పీడ.

రేవతి నక్షత్రంలో జ్వరాదులు వస్తే ఏడు రోజులు పీడ.

అశ్వనీ నక్షత్రంలో జ్వరాదులు వస్తే ఒక రోజు పీడ.

భరణీ నక్షత్రంలో జ్వరాదులు వస్తే మరణం.


పై నక్షత్రాలు రోగి నక్షత్రానికి నైధన తార అయినప్పుడు మాత్రమే ఫలితాలు జరుగుతాయి. కానీ శుభ తారాబలం ఉన్నప్పుడు పై ఫలితాలు జరగకపోవచ్చు. నైధనతారలో వర్జ్యంలో జ్వరం వస్తే తప్పక పై లక్షణాలు కనిపిస్తాయి. జన్మ లగ్నానికి అష్టమ షష్ఠ, ద్వాదశ భావాల్లోని నక్షత్రాలైనా పై ఫలితాలు జరుగుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...