9, జూన్ 2016, గురువారం

లక్ష్మీ నారాయణ సాలగ్రామం


లక్ష్మీ నారాయణ సాలగ్రామం

          ఉదయించే సూర్యుడి తేజస్సుతో, పీతాంబరం( పసుపు వస్త్రాలు) ధరించి, నాలుగు భుజములు కలవాడు, శంఖము, చక్రము, గద, మొదలగు ఆయుధాలు ధరించిన వాడు, క్ష్మీ దేవి పతి అయిన హరిని, కలువల వంటి కన్నులు కలవారు, శాంతమూర్తులు, రత్నఖచిత కిరీటము, ఆభరణాలు ధరించినవారు, మూడు లోకాలకు ఆధారమయిన జగదాధార చక్రమందు ఆదిశేషునితో చుట్టబడిన తాబేలు, మధ్య భూమిపై , అంకుశము వంటి పద్మ దళం పైనున్న బంగారు మేరు పర్వతం పై కొలువున్న లక్ష్మీనారాయణులను, సూర్యుడు నారాయణుడి వలనే ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు నారాయణుడి నుంచి కాంతిని(వెలుగును) పొందుతున్నాడు. ప్రత్యక్ష నారాయణుడి స్వరూపమే “అగ్ని”. అట్టి నారాయణుడిని సాలగ్రామ రూపంలో  ధ్యానించు వారికి విజయం, పవిత్రత కలుగుతాయి. లక్ష్మీ నారాయణ సాలగ్రామ నామ ఉచ్చరణ చేతనే మనుషుల పాపాలు తొలగించబడతాయి.


     లక్ష్మీ నారాయణ సాలగ్రామం పూజించే వారికి బంధాల వల్ల జనించే జన్మ, మృత్యు, జర, వ్యాధి వంటి ఈతి బాధలకు అతీతమయిన భావ బాధల నుంచి విముక్తుడిని గావిస్తాడు లక్ష్మీ నారాయణుడు. లక్ష్మీ నారాయణ సాలగ్రామం ఇంటిలో ఉన్న  బాధలను, భయాన్ని, రోగాలను పోగొడుతుంది. ఎటువంటి భూత ప్రేత పిశాచ బాధల పీడ ఉండదు. అన్ని దోషాలు, దుర్గుణాలు, నిర్మూలన అవుతాయి, భక్తి వంటి సుగుణాలు పెంపొందును. ధర్మ, అర్ధ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదిస్తాడు లక్ష్మీ నారాయణుడు. 

          లక్ష్మీ నారాయణ సాలగ్రామం చామన చాయ వర్ణం కలిగి ఉంటుంది. చుట్టూ రేఖలు ఉండి మద్యలో ఎత్తుగా ఉన్న లక్ష్మీ నారాయణ సాలగ్రామం అందురు. ఈ సాలగ్రామాన్ని దర్శించినంత మాత్రానే కోరికలు తీరును. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ అనే మంత్రంతో లక్ష్మీ  నారాయణ సాలగ్రామం ఏకాదశి, రధ సప్తమి వంటి రోజులలో పూజ చేసిన వారికి కుటుంబంలో కలతలు లేకుండా చేస్తాడు. దుఃఖాల బారి నుండి విముక్తుడను చేస్తాడు. కుటుంబ సౌఖ్యాలను, కూటికి, బట్టకు లోటు లేకుండా చేస్తాడు. లక్ష్మీ నారాయణ సాలగ్రామం రియల్ ఎస్టేట్ వారు పూజించటం చాలా మంచిది. ఎల్లప్పుడు ధనానికి లోటు రానీయడు. వృషభ రాశి వారు లక్ష్మీ నారాయణ సాలగ్రామం పూజా చేసిన, దానం చేసిన దోషాలు తొలగిపోతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...