29, జూన్ 2016, బుధవారం

గ్రహాలకు మూర్తి నిర్ణయం

గ్రహాలకు మూర్తి నిర్ణయం


శ్లోకం:- జన్మ రక్ష రాజేశ్చ గ్రహ ప్రవేశకాలొడు రాశౌ

యది చార జంచ రుద్రేరసే జన్మని హేమమూర్తి

శ్శుభంక రాజేషు రాజితశ్చ సచాద్రి దిగ్విహ్నిషు

తామ్రమూర్తిః కష్టం గజార్కాబ్ధిషు కౌహితస్య


రవి మొదలైన గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతున్నప్పుడు ఆ రాశిని ప్రవేశించే కాలంలో ఉన్న నక్షత్రం ఏది అవుతుందో పంచాంగాన్ని బట్టి తెలుసుకొని జన్మరాశి లగాయితు నిత్య నక్షత్ర రాశి వరకు లెక్కించగా 1,6,11 రాశుల్లో ఒకటైన సువర్ణమూర్తి అని, 2,5,9 రాశుల్లో ఒకటైతే రజిత మూర్తి అని 3,7,10 రాశుల్లో ఒకటైతే తామ్రమూర్తి అని, 4,8,12 రాశుల్లో ఒకటైతే లోహమూర్తి అని అంటారు.



గోచారరీత్యా గ్రహాలు దుష్టస్ధానాలలో ఉన్న సువర్ణమూర్తి, రజితమూర్తి అయిన శుభ ఫలితాలను ఇస్తారు. తామ్రమూర్తి, లోహమూర్తి అయిన గ్రహాలు శుభస్ధానాలలో ఉన్న చెడు ఫలితాలనే ఇస్తారు.


ఏ  జాతకుడికి అయిన జాతకఫలితాలు చెప్పేటప్పుడు రెండు విధాలుగా పరిశీలన చేయవలసిన అవసరం వస్తుంది.


అది ఒకటి గ్రహచారము , రెండవది గోచారము
గ్రహచారము అనగా మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా గ్రహములు పొందిన రాశి యొక్క స్వభావమును అనుసరించి గ్రహ దశలను తెలుసుకొని జన్మ లగ్నము లగాయితూ గ్రహములు పొందిన  ఆధిపత్యము ననుసరించి ఆయా గ్రహముల బలాబలములను   తెలుసుకొని ఫలిత నిర్ణయం చేయటం మొదటిది.

ఇక రెండవది గోచారము ఈ విధానములో వర్తమాన పరిస్థితులలో గ్రహముల గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణముగా మానవ జీవితముపై కలుగు  శుభ ,అశుభ ఫలితములను తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది .  గోచారము ప్రకారము గ్రహములకు ఫలితములను తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు జన్మ లగ్నమును ప్రామాణికముగా తీసుకోకూడదు. ఇక్కడ జన్మ రాశి  మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గోచారము ఫలితమును సులభంగా తెలుకోవడానికి మహర్షులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసినారు. ఈ మూర్తులను లోహములతో పోల్చి చూపారు .

పంచ లోహాలలో బంగారము , వెండి , రాగి , ఇత్తడి  , ఇనుము . ఇవి ఒకదానికన్న ఒకటి తక్కువ విలువ కలవి . ఉదా : బంగారము చాలా విలువ కలిగినది దానికన్నా వెండి తక్కువ విలువ దానికన్నా రాగి , దానికనా ఇత్తడి , దానికన్నా ఇనుము ఇలా విలువ తగ్గి పోతుంది .

ఈ లోహాలకున్న విలువలకు అనుగుణముగా సాధారణ మానవునకు కూడా సులభంగా అర్ధం అవుతుందనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసారు .

1 సువర్ణమూర్తి (బంగారము )2 రజిత మూర్తి( వెండి )3 తామ్ర మూర్తి (రాగి ) 4 లోహ మూర్తి (ఇనుము 0

సువర్ణ మూర్తి 100 %  శుభ ఫలితములను
 రజిత మూర్తి 75% శుభ ఫలితములను
తామ్ర మూర్తి 50% శుభ ఫలితములను
లోహ మూర్తి  25% శుభ ఫలితములను ఇచ్చును. ఈ గ్రహములకున్న మూర్తి ప్రభావము ప్రకారము

          గ్రహములు నిత్యమూ పరిభ్రమణము చెందుతూనే ఉంటాయి.


ప్రతి గ్రహము తన కక్ష్యను అనుసరించి ముందుకు కదులుతూ ఉంటుంది . అలా గ్రహములు ఒకరాశినుండి మరొక రాశిలోకి ప్రవేశించు సమయమును తెలుసుకొని మూర్తి నిర్ణయము చేయబడుతుంది .

ప్రతి సంవత్సరము మనం రాశి ఫలితములను తెలుసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారము . దీనికి ప్రత్యేకించి  ఒక సమయాన్ని నిర్ణయించడం జరిగింది.


మన తెలుగు వారు ముఖ్యముగా ఉగాది నుండి సంవత్సరము ప్రారంభము అయినట్లుగా భావించి రాశి  ఫలితములను తెలుసుకోవడం జరుగుతుంది. ఉగాది సమయములో ఉన్న గ్రహముల స్థితి ప్రకారము మాత్రమే సంవత్సర ఫలితములు ఆధారపడి ఉండవు. గ్రహములలో నిత్యమూ జరుగు సంచారమును బట్టి మానవునకు కలుగు శుభ, అశుభములు ఆధారపడి ఉంటాయి . వీటిని సూక్ష్మముగా తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని మూర్తుల నిర్ణయము చేయడం జరిగింది.


చంద్రుని గమనము వలన నక్షత్రములను తెలుసుకోవడం జరుగుతుంది. మనకు మన జన్మ నక్షత్రము తెలిస్తే జన్మరాశి తెలుస్తుంది. జన్మ నక్షత్రము తెలియని వారికి పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు.


జన్మ లేక నామ నక్షత్రము తెలుసుకున్న తరువాత జన్మరాశిని  లేక నామ రాశిని తెలుసుకోవాలి .

ఏ గ్రహమునకు మూర్తి నిర్ణయము చేయవలెనో మొదట గుర్తించాలి . పిమ్మట ఆ గ్రహము ఏ రోజున ప్రవేశించు చున్నది . గ్రహము ప్రవేశించు రోజున ఉన్న నిత్య నక్షత్రము ఏమిటి ? ఆ నక్షత్రమునకు సంభందించిన రాశి ఏమిటి అను విషయమును జాగ్రత్తగా లెక్కించవలెను. ఆ విధముగా లిక్కింపగా వచ్చిన రాశి సంఖ్యను బట్టి మూర్తి నిర్ణయము చేయాలి .


జన్మరాశి లేక నామ రాశి నుండి

1  6    11  రాశులలో ఉన్న గ్రహములు సువర్ణ మూర్తులు

2  5    9  రాశులలో ఉన్న గ్రహములు రజిత ( వెండి ) మూర్తులు.

3   7   10  రాశులలో ఉన్న గ్రహములు తామ్ర ( రాగి ) మూర్తులు

4   8   12   రాశులలో ఉన్న గ్రహములు లోహ ( ఇనుము ) మూర్తులు


ఈ విధముగా మూర్తి నిర్ణయము చేయాలి. పంచ లోహాలలో వాటికి ఉన్న విలువను ఆధారముగా చేసుకొని గ్రహములు ఇచ్చు శుభ ఫలితములను తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని ఈ మూర్తి నిర్ణయము చేయడం జరిగింది .

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...