శంఖువు
శంఖువులు పాల కర్రతోను, చండ్ర
కర్రతోను నిర్మిస్తారు. ఈ శంఖువులు గృహ నిర్మాణ సమయంలో తప్పనిసరిగా భూమిలో
గర్భస్ధానంలో ప్రతిష్ఠించాలి. ఆ శంఖువు భూమిలో ఉన్న శల్య దోషాలను, వాస్తు దోషాలను తొలగించి ఆగృహంలో నివసించే వారికి అన్ని విధాల రక్షణ
కవచంలా సహాయ పడుతుంది. శంఖువు సూచీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా గుండ్రని
వస్తువును సూర్యునికి అభిముఖంగా ఉంచినట్లయితే దాని ఛాయ ఒక నియమిత ప్రదేశం వరకు
శంఖు ఆకారంలో ప్రయాణం చేస్తుంది. ఈ శంఖువునకు శక్తిని ఆకర్షించే లక్షణం ఉంది. అందు
చేతనే శ్రీచక్రం కూడా శంఖు ఆకారంలోనే
ఉంటుంది. మన దేవాలయాలపై ఉంచే పసిడి కలశాలు చివరలు కూడా శంఖు ఆకారంలోనే ఉంటాయి.
సూర్యుని సహస్త్ర కిరణాల ప్రభావాన్ని ఈ శంఖువు తనలోకి ఆహ్వానిస్తుంది. దాని
ద్వారా ఆ ఇల్లు శక్తి వంతమైన ప్రాణ శక్తిని ఆ ఇంట్లో ఉండే వాళ్లందరికి
పంచుతుంది. తద్వారా గృహంలో ఉన్నవారు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో
వర్ధిల్లుతారు. శంఖువును వాస్తు పురుషుని నాభి స్ధానంలో ఉంచటం వలన మానవ శరీరానికి
పరిపూరకంగా కావలసిన శక్తిని నాభి ద్వారా అందిస్తుంది. శరీరానికి నాభి ద్వారా మాతృ
గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ఆహారాన్ని ఎలా అందిస్తుందో అదే విధంగా ప్రకృతి మాట
వాస్తు పురుషుని నాబి నుండి ఆ స్ధలానికంతటికి శంఖు అనే యంత్రం ద్వారా
అందిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి