10, జూన్ 2016, శుక్రవారం

స్పటిక శంఖం


స్పటిక శంఖం
           స్పటిక శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. స్పటిక శంఖం పీఠభాగంలో వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలోను నివాసం ఉంటారు. క్షీర సాగర మధనంలో సముద్రం నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి. స్పటిక శంఖం పూజగదిలో వుండటం ఎంతో మంచిదని, సమస్త సంపదలను అందించే శక్తి ఈ శంఖానికి వుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

        స్పటిక శంఖ పూజ లక్ష్మీ ఆగమనానికి ప్రతీక వంటిది. స్పటిక శంఖంతో పాటు శివలింగం, నంది కి పూజ చేసిన మంచిది.ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి స్వాహా అనే మంత్రంతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన లక్ష్మీ కటాక్షంతో పాటు సర్వాకాల సర్వావస్ధల యందు రక్షణగా నిలుచును. 
       శుక్రగ్రహ కారకత్వాలైన ఇహలోక సౌఖ్యములు కలుగజేయుచు, దంపతుల మద్య అనుకూలత, సకల భోగ భాగ్యాలు, ధనాభివృద్ధి, సుఖ సౌఖ్యాలు కలగాలన్న, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కలగాలన్న స్పటిక శంఖాన్ని శుక్రవారం రోజు పూజా మందిరంలో ప్రతిష్ఠించి గంధం, పూలు, అక్షితలతో అలంకరించి పూజ చేసి బీరువాలో గాని, వ్యాపార సంస్ధలలో గాని ప్రతిష్ఠించాలి. శుక్రగ్రహ దోష నివారణ కలుగును. స్త్రీలకు అఖండ సౌభాగ్య యోగమును కలుగ జేయును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...