సూర్యుడు
లగ్నంలో ఉంటే దీర్ఘకాలంగా కోపాలను మనస్సులో ఉంచుకుంటారు. కోపాలను, భయాలను మనస్సులో దాచుకోవటం
వలనే హృదయ సంబంద వ్యాధులు వస్తాయి. కుజుడు లగ్నంలో ఉంటే కోపాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించి
చూపిస్తారు.
ఒక భావం
బాగు లేదు అనుకుంటే భావాత్ భావం పరిశీలించాలి. ఉదా:-సంతానం గురించి పంచమ స్ధానం చూసినప్పుడు
ఆ భావం బాగులేనప్పుడు సంతానం లేదు అని చెప్పకూడదు. పంచమం నుండి పంచమం నవమం (బావాట్
భావం) చూడాలి. పంచమం బాగులేకున్న నవమం బాగున్న సంతానం ఉంటుంది. పంచమం సంతానం, నవమం సత్ సంతానం.
జన్మజాతకంలోని
చంద్ర, కుజుల
ప్రమేయంతోను, గోచారంలోని చంద్ర, కుజుల ప్రమేయంతోను
స్త్రీలలో ఋతుక్రమం ఏర్పడును. ఋతుక్రమం సంతానానికి కారణం. ఋతుక్రమం సరిగా
లేకున్నా సంతానం కలుగకపోవచ్చు. ఋతుక్రమం ఆగిపోతే సంతానం ఉండదు.
తులా
లగ్నం కంటే వృషభ లగ్నం బలమైనది. వృషభ లగ్నానికి నవమాధిపతి శని (ఆలోచన) ,దశమాధిపతి శని (ఆచరణ లేదా పని). తులా లగ్నానికి చతుర్ధాధిపతి (ఆచరణ లేదా పని), పంచమాధిపతి (ఆలోచన). 1,5,9 కోణ స్ధానాలు (వీటినే లక్ష్మీస్ధానాలు
అని, ఆలోచన స్ధానాలు అని అంటారు. 1,4,7,10 కేంద్ర స్ధానాలు ( విష్ణు స్ధానాలు అని, ఆచరణస్ధానాలు
అని, కృషి స్ధానాలని అంటారు. ఇక్కడ వృషభ లగ్నం వాళ్ళు ఆలోచన ముందు
ఉంది ఆచరణ తరువాత ఉంది కాబట్టి వీరు ఆలోచించి పనిచేస్తారు. తులా లగ్నం వాళ్ళు పని చేసాక
ఆలోచిస్తారు. అందుకే ఎటువంటి సుగుణాలు లేకపోయిన వృషభ లగ్నం మంచిదంటారు.
రామాయణం
108 సార్లు పారాయణం చేస్తే వచ్చే జన్మ జనకమహారాజు జన్మ అవుతుంది. భాగవతం 108 సార్లు
పారాయణం చేస్తే ఈ జన్మ చివరి జన్మ అవుతుంది.
జ్యోతిష్యం
9 గ్రహాల వలన వస్తుంది. రవి వలన మెడికల్ జ్యోతిష్యం, చంద్రుడి వలన మానసిక జ్యోతిష్యం, కుజుడు వలన భయపెట్టే జ్యోతిష్యం, బుధుడి వలన వ్యాపార
ప్రయోజనాలకు జ్యోతిష్యం, గురుడి వలన ధార్మిక జ్యోతిష్యం, శుక్రుడి వలన సంపాదించే జ్యోతిష్యం, శని వలన ఒక చోట
విన్నది వ్రాసింది మరొక చోట చెప్పటం( copy paste చేస్తారు) కృషి
లేకుండా చేస్తారు. రాహువు వలన భూత జ్యోతిష్యం, కేతువు వలన ఆధ్యాత్మిక
జ్యోతిష్యం.
మేష
లగ్నం వారు, తులా లగ్నం వారు స్వయంకృతాపరాధం వలన నష్టపోతారు. మేష లగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి ఒక్కరే కావటం, తులా లగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి ఒక్కరే కావటం వలన తమంతట తామే కష్టాలు, నష్టాలు
తెచ్చుకుంటారు.
జన్మ
లగ్నం నుండి శారీరక విషయాలను, చంద్ర లగ్నం నుండి మానసిక విషయాలను, సూర్య లగ్నం నుండి
తన ప్రమేయం లేని విషయాలను యాదృచ్చికంగా జరిగే వాటిని పరిశీలించవచ్చును. అతడు చేసే ప్రవర్తనను
బట్టి చంద్రుని గురించి చెప్పవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి