14, జూన్ 2016, మంగళవారం

స్పటిక నంది

స్పటిక నంది              

           నందీశ్వరుడు పరమేశ్వరుని వాహనంగానే కాక సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా ఉంటాడు. ఈశ్వరునికి వాహనము నంది. ఈశ్వర తత్త్వానికి లింగము ఎలా గుర్తో, జీవతత్వానికి  ‘నంది’  అలా గుర్తు. జీవతత్వములోని పశుతత్త్వం. పశుతత్త్వ ముతో కూడిన ఈ జీవతత్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పటం చేత  భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది.

           నందికి ఈశ్వరునికి ఎవరూ అడ్డు తగలకూడదు. అంటే జీవునికి, పరమాత్మకు అడ్డం ఉండకూడదు. నంది ధర్మానికి ప్రతీక. జీవుడు నంది శృంగముల మధ్య నుంచి లోపలున్న పరమాత్మను దర్శిస్తాడు. తనలో ఉన్న పశుతత్త్వాన్ని అణచివేసుకొని, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే జీవాత్మ పరమాత్మఐక్యాన్ని పొందుతాడు. స్పటిక నందిని శివలింగంతో సమానంగా పూజించాలి. స్పటిక నందిని ధూప దీప నైవేద్యాలతో పూజించిన వారికి కోరిన కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకం.
        నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి తన మీదే తిరగాలనే కోరుకుంటాడు. ఆలయాలలో శివుడుకి నేరుగా నంది ఉంటుంది. ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలన్నది సంప్రదాయం. అలా చూడటం వల్ల శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్టు కనిపిస్తాడు భక్తుల కనులకు, అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడిని దర్శించినందుకు సంతోష పడి శివుడికి భక్తుడి విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగ చేస్తాడని పెద్దల మాట.                                 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...