9, జూన్ 2016, గురువారం

కపాల మాల


కపాల మాల

మందార మాలా కవితాలకాయై కపాల మాలాంకిత కంథరాయ!!
               దివ్యాంబరాయై చ దిగంబరాయై నమశ్శివాయై చ నమశ్శివాయ!!

        అర్ధనారీశ్వర స్తోత్రంలో కపాల మాల ప్రస్తావన ఉంది. ఐశ్వర్య కారకుడైన ఈశ్వరుడు విభూతి రేఖలు ... రుద్రాక్ష మాలలతో పాటు 'కపాల మాల' ధరించి సంచరిస్తూ వుంటాడు. స్మశాన వాటికలో తిరుగాడే శివుడు, ఎవరి కపాలాలను ధరించి ఉంటాడనే విషయం చాలామందిలో సందేహాన్ని రేకెత్తిస్తూ వుంటుంది. ఇదే సందేహం ఒక రోజున పార్వతీదేవికి కూడా కలిగిందట. శివుడు ధరించిన కపాలమాల గురించి ఆమె ఆయన్ని అడిగింది. ఆ కపాల మాలలో వున్న కపాలాలు ఎవరివని పార్వతీదేవి అడగడంతో, ఆమె శరీరం నశించిన ప్రతిసారీ ఓ కపాలం ఆ మాలలో చేరుతుందని శివుడు సమాధానమిచ్చాడు. అంటే ఆ కపాలాలు అన్నీ కూడా గడిచిపోయిన పార్వతీదేవి అవతారాలకు సంబంధించినవిగా ఆయన స్పష్టం చేశాడు.


       శనిగ్రహ అధిదేవత హనుమంతుడు. హనుమంతుడి వాహనం ఒంటె. ఎడారులలో సైతం గమనం చేసి కాపాడే దైవమితడు అనే భావం చేత హనుమంతుడు ఒంటె వాహనాన్ని కలిగి ఉన్నాడు. ఒంటె ఎముకలతో చేయబడిన కపాల మాలతో జపం చేసిన శనిగ్రహ దోషాలు తొలగిపోవును. పరమశివుడే వీరభద్రునిగా, కాలభైరవునిగా అనేక రూపములతో ఆరాధింపబడతాడు. కాలభైరవుడు శివస్వరూపం. కపాల మాలతో కాళికా దేవి, బైరవ జపం చేసిన తాంత్రిక వశీకరణ శక్తులను కైవసం చేసుకోవచ్చును. కాళికా దేవిని ఉపాసించి శివుడు మున్నగు వారు బ్రహ్మ హత్యాది పాతకములను పోగొట్టుకొనిరి.

       కాళికాదేవిని ఓం క్రీం హూం హ్రీం మహాకాళికే క్రీం క్రీం హ్రూం హ్రూం హ్రీం హ్రీం హ్రీం కామదాత్ర్యే హ్రీం హూఫట్ స్వాహా అను మంత్రంతో జపం చేసిన బూత, ప్రేత, పిశాచ, గ్రహ భాలు, దారిద్రం నశించి శుభములు కలుగును. పరమశివుని అవతారమైన బైరవుడికి జపం చేసిన శని దోషాలు తొలగిపోవును.ఐం హ్రీం శ్రీం ఐం అపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలబద్దాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మాం దారిద్ర్య విద్వేషాణాయ మహాభైరవాయనమఃశ్రీం హ్రీం ఐం అను మంత్రంతో జపం చేయు వారు శని దోషాలు తొలగి మహాదైశ్వర్యవంతులై రససిద్ధి, స్వర్ణసిద్ధి, స్వర్ణాకర్షణ, సకల ఐశ్వర్యములు పొందుదురు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...