29, జూన్ 2016, బుధవారం

గ్రహాలకు మూర్తి నిర్ణయం

గ్రహాలకు మూర్తి నిర్ణయం


శ్లోకం:- జన్మ రక్ష రాజేశ్చ గ్రహ ప్రవేశకాలొడు రాశౌ

యది చార జంచ రుద్రేరసే జన్మని హేమమూర్తి

శ్శుభంక రాజేషు రాజితశ్చ సచాద్రి దిగ్విహ్నిషు

తామ్రమూర్తిః కష్టం గజార్కాబ్ధిషు కౌహితస్య


రవి మొదలైన గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతున్నప్పుడు ఆ రాశిని ప్రవేశించే కాలంలో ఉన్న నక్షత్రం ఏది అవుతుందో పంచాంగాన్ని బట్టి తెలుసుకొని జన్మరాశి లగాయితు నిత్య నక్షత్ర రాశి వరకు లెక్కించగా 1,6,11 రాశుల్లో ఒకటైన సువర్ణమూర్తి అని, 2,5,9 రాశుల్లో ఒకటైతే రజిత మూర్తి అని 3,7,10 రాశుల్లో ఒకటైతే తామ్రమూర్తి అని, 4,8,12 రాశుల్లో ఒకటైతే లోహమూర్తి అని అంటారు.

24, జూన్ 2016, శుక్రవారం

జాతక పరిశీలనలో కొన్ని ముఖ్యమైన అంశాలు




జాతక పరిశీలనలో కొన్ని ముఖ్యమైన అంశాలు  



నిష్పల రాశులైన కన్య, మిధునం, సింహం సంతానస్ధానం అయినప్పుడు సంతానానికి ఇబ్బందులు ఉంటాయి. అంతే కాకుండా నిష్పల రాశులు సంతానస్ధానమై, పంచమాధిపతి నిష్పల రాశులలో ఉండి, సంతాన కారకుడైన గురువు నిష్పల రాసులలో ఉంటే సంతాన అవకాశాలు తక్కువ. మరియు ప్రశ్నలో నిష్పల రాశులు లగ్నమైనప్పుడు ఆ పని నెరవేరుట కష్టం అని తెలుసుకోవాలి.   

22, జూన్ 2016, బుధవారం

జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు



జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు 

సూర్యుడు లగ్నంలో ఉంటే దీర్ఘకాలంగా కోపాలను మనస్సులో ఉంచుకుంటారు. కోపాలను, భయాలను మనస్సులో దాచుకోవటం వలనే హృదయ సంబంద వ్యాధులు వస్తాయి. కుజుడు లగ్నంలో ఉంటే కోపాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించి చూపిస్తారు. 

ఒక భావం బాగు లేదు అనుకుంటే భావాత్ భావం పరిశీలించాలి. ఉదా:-సంతానం గురించి పంచమ స్ధానం చూసినప్పుడు ఆ భావం బాగులేనప్పుడు సంతానం లేదు అని చెప్పకూడదు. పంచమం నుండి పంచమం నవమం (బావాట్ భావం) చూడాలి. పంచమం బాగులేకున్న నవమం బాగున్న సంతానం ఉంటుంది. పంచమం సంతానం, నవమం సత్ సంతానం. 

21, జూన్ 2016, మంగళవారం

స్పటిక గణపతి (Crystal Ganesh)


స్పటిక గణపతి

               ఏ పూజకు అయినా, ఏ కార్యక్రమము అయినా తొలుత  ఆరాదించేది  గణ నాధుడునే. గణనాధుడుకు పూజ చేసి ప్రారంభము చేస్తే ఎటువంటి విఘ్నాలు  లేకుండా విజయము లభిస్తుంది అని నమ్మకం. వినాయకుడు నర ముఖముతోనే  జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి, ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని  చేతి లోనే  మరణించాలని  వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము  తొలగించి గజముఖముతో ప్రాణ ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట.

          లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక  సుముఖము అన్నారు. ఏ ముఖము  ప్రసన్నముగా,  సంతోషముగా, లోక హితము  కోరుతుందో,  ప్రేమగా  ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే స్పటిక వినాయకుని ముఖమును చూసి  “ఓం శ్రీ స్పటిక మహా గణాధిపతి యై నమః” అని నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.

20, జూన్ 2016, సోమవారం

జ్యోతిష శాస్త్ర ఆణిముత్యాలు (చిట్కాలు)



జ్యోతిష శాస్త్ర ఆణిముత్యాలు (చిట్కాలు) 

జ్యోతిష్యుడు జాతకాన్ని పరిశీలించి జాతకుడికి చెప్పేటప్పుడు మంచిని ఎక్కువగా చెడుని తక్కువగా చెప్పాలి. జాతకంలో గ్రహాలు చెడు చేస్తాయి అని అనుకున్నప్పుడు మంచిని కూడా చేస్తాయి. మంచి వాటి గురించి ఆలోచింపజేయాలి. చెడ్డవాటిని వర్ణించకూడదు. ఎదుటి వ్యక్తిని మెప్పించటం కోసం లేనివి చెప్పటం తగదు. అది మంచి ఐన చెడు ఐన సరే. 

15, జూన్ 2016, బుధవారం

జాతకచక్ర పరిశీలన

జాతకచక్ర పరిశీలన


ఒక వ్యక్తిపైన పలురకాల ప్రభావాలు ఉంటాయి. జాతక ప్రభావం వాస్తు ప్రభావం, వ్యక్తి ఈ జన్మలో చేసిన పాప పుణ్యముల ప్రభావం, ఇతన్ని గురించి ఇతరులు ఆలోచించే ప్రభావం, దేశాకాలమాన పరిస్ధితుల ప్రభావం మొదలగు అంశాలను పరిశీలించాలి.

జ్యోతిషానుభవసారంలో బెంగుళూరుకి చెందిన శివశంకర సిద్ధాంతి గారు గురువుకి సంబంధించిన ఒక యోగాన్ని చెప్పి ఈ యోగం కలవారు భారతీయులైతే 12 వ ఏట విదేశీయులైతే 24 వ ఏట వివాహం అవుతుందని పేర్కొన్నారు. ఆనాటి పరిస్ధితులను అనుసరించి బాల్య వివాహాలు ఉన్న దృష్ట్యా ఆ యోగం ఫలాన్ని ఇచ్చింది. ఇదే యోగాన్ని వర్తమానకాలంలో వర్తింపజేస్తే భారతీయులకు 24 వ ఏట, విదేశీయులకు 36 వ ఏట వర్తింపజేయాల్సి వస్తుంది. కాబట్టి జాతక పరిశీలన చేసేటప్పుడు జాతకుడు పెరిగిన పరిసరాల పరిస్ధితులను కూడా పరిశీలించి ఫలాన్ని తెలియజేయాలి. దీనినే బృహత్సంహితలో వరాహమిహరుడు దైవజ్ఞ లక్షణాలను చెబుతూ “లోకజ్ఞః” అని పేర్కొన్నాడు. దేశాకాలమాన పరిస్ధితులను అవగాహన చేసుకోవాలంటే లోకజ్ఞత ఆవశ్యకం అన్నారు.

14, జూన్ 2016, మంగళవారం

జాతకచక్రంలో “విదేశీయానం” సమగ్ర పరిశీలన


జాతకచక్రంలో “విదేశీయానం” సమగ్ర పరిశీలన  

సాప్ట్ వేర్  రంగం పుణ్యమా అని భారతదేశంలో నేటి యువతరం ఆకాశం అంచులను తాకుతుంది. ఒక తరం క్రిందటి వరకు ఎవరూ ఊహించని, ఊహించలేని ఉద్యోగ అవకాశాలు, ఉపాది అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను ఉంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ  విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్యా కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు ప్రతి ఇద్దరులోను ఒకరు ఖచ్చితంగా ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది ఆయా జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు మనల్ని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం. 

స్పటిక నంది

స్పటిక నంది              

           నందీశ్వరుడు పరమేశ్వరుని వాహనంగానే కాక సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా ఉంటాడు. ఈశ్వరునికి వాహనము నంది. ఈశ్వర తత్త్వానికి లింగము ఎలా గుర్తో, జీవతత్వానికి  ‘నంది’  అలా గుర్తు. జీవతత్వములోని పశుతత్త్వం. పశుతత్త్వ ముతో కూడిన ఈ జీవతత్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పటం చేత  భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది.

శంఖువు


శంఖువు
     శంఖువులు పాల కర్రతోను, చండ్ర కర్రతోను నిర్మిస్తారు. ఈ శంఖువులు గృహ నిర్మాణ సమయంలో తప్పనిసరిగా భూమిలో గర్భస్ధానంలో ప్రతిష్ఠించాలి. ఆ శంఖువు భూమిలో ఉన్న శల్య దోషాలను, వాస్తు దోషాలను తొలగించి ఆగృహంలో నివసించే వారికి అన్ని విధాల రక్షణ కవచంలా సహాయ పడుతుంది. శంఖువు సూచీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా గుండ్రని వస్తువును సూర్యునికి అభిముఖంగా ఉంచినట్లయితే దాని ఛాయ ఒక నియమిత ప్రదేశం వరకు శంఖు ఆకారంలో ప్రయాణం చేస్తుంది. ఈ శంఖువునకు శక్తిని ఆకర్షించే లక్షణం ఉంది. అందు చేతనే శ్రీచక్రం  కూడా శంఖు ఆకారంలోనే ఉంటుంది. మన దేవాలయాలపై ఉంచే పసిడి కలశాలు చివరలు కూడా శంఖు ఆకారంలోనే ఉంటాయి.

కనుదృష్టి గణపతి


కనుదృష్టి గణపతి
         కనుదృష్టి గణపతి పోటోని సింహాద్వారానికి బయటవైపు ఉంచాలి. వ్యాపార సంస్ధలలో గాని, ఇంటికి గాని బయట నుండి వచ్చేవాళ్ళకు కనపడే విధంగా బయట వైపు ఉంచి ఓం నమో కనుదృష్టి గణపతయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉన్న  నుదృష్టి, నరదృష్టి ఉండవు. అన్ని విధాల చెడు శక్తులు, వీదిపోటుల  బారి నుండి,  చెడు శక్తుల నుండి రక్షణ కవచంలా రక్షిస్తుంది కనుదృష్టి గణపతి.

శుభదృష్టి గణపతి


శుభదృష్టి గణపతి
           శుభదృష్టి గణపతి పోటో సింహద్వారానికి లోపల వైపు బయట నుండి వచ్చే వాళ్ళకు కనపడే విధంగా ఉంచాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ! నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా !! అనే శ్లోకాన్ని ఉదయం పూజా సమయంలో పఠిస్తూ పూజ చేసిన వారికి ఎటువంటి చెడు ప్రభావాలు లేకుండా చేసి తన  శుభదృష్టి ప్రభావం చేత ఎల్లవేళల రక్షిస్తాడు. పనుల్లోఆటంకాలు ఉండవు. సర్వకార్యసిద్ధి జరుగుతుంది

13, జూన్ 2016, సోమవారం

పంచధాతు ఓం స్వస్తిక్ త్రిశూల్


పంచధాతు ఓం స్వస్తిక్ త్రిశూల్
                ఓం స్వస్తిక్ త్రిశూల్ త్రిక్తి స్వరూపం. హిందూ సాంప్రదాయంలో ఈ మూడు చిహ్నాలు పవిత్ర చిహ్నాలుగా ఆరాదించబడుతున్నాయి. ఓం చిహ్నం గణపతికి ప్రతి రూపంగా, స్వస్తిక్ లక్ష్మీదేవి స్వరూపంగా, త్రిశూల్ పరమేశ్వరుని స్వరూపంగా ఆరాదిస్తారు. ఓం స్వస్తిక్ త్రిశూల్ దేవాలయాల యందు, పూజా మందిరం లోను, ఇంటి సింహ ద్వారానికి గాని, వ్యాపార సంస్ధల యందు గాని, బీరువా, గల్లా పెట్టె లయందు గాని, చదువు కునే పుస్తకాల యందు గాని, వ్యాపార సంస్ధలకు సంబందించిన పుస్తకాల యందు గాని ఉంచాలి. 

11, జూన్ 2016, శనివారం

మల్టియర్ పిరమిడ్ (Multier Pyramid)


మల్టియర్ పిరమిడ్ (Multier Pyramid)
        బ్రహ్మస్థానంలో  గోడ గాని, మెట్లు, లిప్ట్, మరుగుదొడ్డి, స్తంభాలు వచ్చినప్పుడు 91 పిరమిడ్స్ కలిగిన మల్టీ పిరమిడ్ ను భూమి యొక్క గర్భస్ధానంలోను, నాలుగు మూలల యందు, గోడలకు, సీలింగ్ కు, స్తంబాలకు స్ధాపించిన చిన్న, పెద్ద వాస్తు దోషాలు నివారించటానికి ఉపయోగి స్తారు. 91 పిరమిడ్స్ కలిగిన పిరమిడ్స్ 9 భూమి యొక్క గర్భ స్ధానంలో స్ధాపించిన ఇంటి మొత్తానికి ఎనర్జీ విడుదలయ్యి ఎటువంటి వాస్తు దోషాలను అయిన తొలగిస్తుంది.

10, జూన్ 2016, శుక్రవారం

స్పటిక శంఖం


స్పటిక శంఖం
           స్పటిక శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. స్పటిక శంఖం పీఠభాగంలో వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలోను నివాసం ఉంటారు. క్షీర సాగర మధనంలో సముద్రం నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి. స్పటిక శంఖం పూజగదిలో వుండటం ఎంతో మంచిదని, సమస్త సంపదలను అందించే శక్తి ఈ శంఖానికి వుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

నవధాన్య విగ్రహాలు


నవధాన్య విగ్రహాలు
           నవధాన్యాలతో చేయబడిన దేవతామూర్తి విగ్రహాలను పూజ చేసిన వారికి నవగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. నవధాన్య విగ్రహాలకు ధూపదీప నైవేద్యాలు ఎవరైతే సమర్పిస్తారో వారిని నవగ్రహాలు పీడించవు. ఎటువంటి దుష్ట  ప్రభావాలు ఉండవు. నవగ్రహల అనుగ్రహం కలుగుతుంది. నవదాన్య విగ్రహాలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేసిన నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ భుధాయచ, గురు శుక్ర శనిభ్యశ్చరాహువే కేతవే నమఃఅనే నవగ్రహ మంత్రాన్ని పఠిస్తూ నవదాన్య విగ్రహాలను పూజించే వారికి నవగ్రహల అనుకూలత కలుగుతుంది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...