9, జూన్ 2017, శుక్రవారం

మకర లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ నవగ్రహముల ఫలితాలు

మకర లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ నవగ్రహముల ఫలితాలు








మకర లగ్నములో ఏ వ్యక్తి యొక్క జననము జరుగునో వారు సన్నగా వుంటారు. సాదారణముగా వీరి వివాహము ఆటంకాలతో జరుగును. వీరికి నియమానుసారముగా నడుచుకొనుట ఇష్టపడును.  వీరు మొరటు స్వభావము మరియు క్రూర స్వబావము కలిగి వుండెదరు. వీరు వారి పనులలో ఎవరు జోక్యము చేసుకొనుట ఇష్టపడరు.

మకర లగ్నములో లగ్నస్థ సూర్యుడు

మకర లగ్నము గల కుండలిలో సూర్యుడు అష్టమ బావము యొక్క అధిపతి కాగలడు. లగ్న బావములో సూర్యుని స్థితి కలిగి వుండుట కారణముగా వ్యక్తి అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. ఎముకలలో నొప్పి మరియు ఉదర సంబంద రోగములు కలిగే అవకాశములు ప్రబలముగా వున్నవి. దృష్టి దోషము కలిగే అవకాశములు వున్నవి. పేరాశ మరియు స్వార్ధము వుండగలదు. శత్రురాశిలో సూర్యుని ఉపస్థితి కారణముగా జీవితములో కఠిన పరిస్థితులను మరియు బాధలను ఎదుర్కొనవలసి వచ్చును. పరిశ్రమ మరియు ఆత్మబలముతో కఠినమైన పరిస్థితులపై విజయమును ప్రాప్తి చెందగలరు. తండ్రితో వొడిదుడుకులు వుండగలవు. బందుమిత్రులతో కూడా విరోదములను ఎదుర్కొన వలసివచ్చును. వ్యాపారము చేయాలనే కోరిక మరియు ఉద్యోగము చేయుట వీరికి ఇష్టము. గృహస్థ జీవితములో వొడిదుడుకులు వుండగలవు.

మకర లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు మకర లగ్నము యొక్క కుండలిలో సప్తమ బావము యొక్క అధిపతి కాగలడు. శత్రురాశిలో లగ్నస్థముగా వుండి చంద్రుడు వ్యక్తికి అందమైన శరీరమును ప్రదానించును. చంద్రుని ప్రభావము కారణముగా వ్యక్తి వినోద మనస్తత్వము కలిగిన వారై వుండెదరు. సౌందర్యము పట్ల ఆకర్షితులు కాగలరు. చంద్రుని శత్రు రాశిలో వుండుట వలన కళ్ళు మరియు చెవులలో బాదలను ఎదుర్కొన వలసి వచ్చును. లగ్నములో కూర్చొని వున్న చంద్రుడు సప్తమ బావములో తన రాశి అయిన కటకము చూస్తుండును. దానివలన జీవిత బాగస్వామి అందముగాను మరియు మంచి గుణము కలిగి వుండును. జీవిత బాగస్వామితో సమ్యోగము మరియు సమయాను కూలముగా లాభము ప్రాప్తి చెందగలదు.

మకర లగ్నములో లగ్నస్థ కుజుడు

మకర లగ్నము యొక్క కుండలిలో కుజుడు సుఖాదిపతి మరియు లాభాదిపతి కాగలడు. కుజుడు ఈ రాశిలో లగ్నస్థముగా వున్న ఎడల ఆ వ్యక్తి క్రోద స్వబావము కలిగి వుండును.  తండ్రి మరియు తండ్రి పక్షము నుండి సమ్యోగము లభించగలదు. తండ్రి పేరు వలన వీరికి సమాజములో పేరు ప్రఖ్యాతులు లభించగలవు. శని యొక్క ప్రభావము కారణముగా జీవితములో వీరి పితృ సంపత్తి త్యాగము చేయవలసిన అవసరము వుండగలదు. ప్రధమ బావములో వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను చూస్తున్నాడు. ఈ బావములలో కుజుని యొక్క దృష్టి కారణముగా వ్యక్తి దార్మిక ప్రవృత్తి కలవాడై వుండును. కుజని దోషము కారణముగా గృహస్థ జీవితములోని సుఖము బాదించబడును.

మకర లగ్నములో లగ్నస్థ బుధుడు

బుధుడు మకర లగ్నము యొక్క కుండలిలో షష్టమాదిపతి మరియు నవమాదిపతిగా వుండును. బుధుడు లగ్నస్థుడుగా వుండిన ఎడల వ్యక్తి బుద్దివంతుడు మరియు జ్ఞాని కాగలడు. వీరిలో ఈశ్వరుని పట్ల విశ్వాసము మరియు దయాస్వభావము కలిగి వుండును. కళలపై అభిరుచి వుండును. గౌరవ మర్యాదలు మరియు ధనము ప్రాప్తించగలదు. కర్కాటక రాశిపై బుధుని దృష్టి వలన జీవిత బాగస్వామి అందముగా ఉన్నా షష్టాదిపతి కావటం వలన ఎడబాటు, జీవిత బాగస్వామి ఉగ్రస్వబావము కలిగిన వారై వుండును. సంతానము కలుగుటలో కొంత సమయము పట్టవచ్చును.

 మకర లగ్నములో లగ్నస్థ గురువు

మకర లగ్నము యొక్క కుండలిలో గురువు వ్యయాదిపతి మరియు తృతీయాదిపతిగా నీచ స్ధితి కలిగి వుండి అవయోగ కారక గ్రహము యొక్క భూమికత్వమును పాటించును. లగ్నములో గురువు యొక్క ఉపస్థితి కారణముగా వ్యక్తి జ్ఞాని మరియు గుణవంతుడు కాగలడు. వీరిలో బౌధిక క్షమత అధికముగా వుండును. కాని వీరు వీరి గుణమును మరియు యోగ్యతను సముచితముగా ఉపయోగించలేరు. ఇతరుల విచారములలో ఎల్లప్పుడూ ప్రబావితము కాగలరు. అందువలన సమస్యలను కూడా ఎదుర్కొన వలసి వచ్చును. లగ్నస్థ గురువు యొక్క దృష్టి, పంచమ, సప్తమ మరియు నవమ బావములపై వుండును. గురువు యొక్క దృష్టి కారణముగా వివాహమునకు తరువాత వీరి భాగ్యోదయము జరుగును. స్త్రీ సంతానం కలుగును. తండ్రితో విభేదాలు ఉండవచ్చును.

మకర లగ్నములో లగ్నస్థ శుక్రుడు

శుక్రుడు మకర లగ్నము యొక్క కుండలిలో పంచమాదిపతి మరియు సప్తమాదిపతి కాగలడు. ఈ లగ్నములో శుక్రుడు శుభ కారక గ్రహము కాగలడు. లగ్న స్థితి కారణముగా వ్యక్తి అందముగాను మరియు బుద్దివంతుడుగాను వుండును. శుక్రుడు వీరిని విలాశవంతుడిగాను మరియు స్వార్ధస్వభావము కలవాడుగాను చేయును. వీరిలో అవసర వాదిత్వము కూడా వుండును. వీరు సాదారణముగా వారి అవసరముల కొరకు మిత్రత్వము చేపట్టెదరు.  విపరీత లింగపు వ్యక్తిపై ఆకర్షితులు కాగలరు. సప్తమ బావములో స్థితిలో వున్న కటక రాశిలో శుక్రుని దృష్టి వలన జీవిత బాగస్వామి ప్రేమతో వ్యవహరించే వాడుగా ఉన్ననూ చంచల స్వభావం కలిగి ఉంటారు. సుఖ దు:ఖములలో సమ్యోగము మరియు సహాయమును అందించును.

మకర లగ్నములో లగ్నస్థ శని

శని మకర లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు ద్వితీయాదిపతిగా వుండును. లగ్నాదిపతిగా వుండుట వలన ఇది శుభ మరియు యోగ కారక గ్రహము కాగలదు. లగ్నములో శని యొక్క స్థితి కారణముగా వ్యక్తి బాగ్యశాలికాగలడు. శారీరకముగా కండలు తిరిగి శక్తిశాలిగా వుండెదరు. కాని మాట్లాడే రీతిలో దోషము కలిగే అవకాశములు వుండును. ఉద్యోగము మరియు వ్యాపారము రెండింటిలోనూ వీరికి మంచి సఫలత లభించగలదు. ప్రభుత్వ సేవలకు వీరికి అవకాశములు ప్రాప్తించగలదు. తల్లి నుండి స్నేహము ప్రాప్తించగలదు. సప్తమ బావములో శని యొక్క దృష్టి వుండుట వలన జీవిత బాగస్వామికి కష్టములు కలుగును. వైవాహిక సుఖము ప్రభావితము కాగలదు.

మకర లగ్నములో లగ్నస్థ రాహువు

రాహువు మకర లగ్నము గల కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వుండుట కారణముగా అనవసరముగా బ్రమణము చేయవలసి వచ్చును. పనులలో సమస్యలు ఏర్పడవచ్చును. దానివలన జరుగుననుకున్న పనికూడా జరుగకుండా వుండిపోవును. వ్యాపారములో అపేక్ష వున్నప్పటికీ ఉద్యోగము లాభదాయకముగా వుండును. వ్యవసాయములో కష్టములు మరియు హాని కలిగే అవకాశములు వున్నవి. సప్తమ బావముపై రాహువు యొక్క దృష్టి బాగస్వాముల నుండి, మిత్రుల నుండి అపేక్షిత లాభములను కలిగించదు. గృహస్థ జీవితములోను, సంసార  సుఖములు బలహీన పడగలవు.

 మకర లగ్నములో లగ్నస్థ కేతువు

మకర లగ్నము గల కుండలిలో కేతువు ప్రధమ బావములో వుండుట వలన వ్యక్తి అరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. అన్ని సమయములలో విభిన్న విధములైన కష్టములను మరియు సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. విపరీత లింగపు వ్యక్తిపై విశేష ఆకర్షణ కలిగి వుండెదరు. శత్రువుల కారణముగా వీరికి కష్టములు వుండగలవు. సమాజములో గౌరవ మర్యాదల కొరకు అనుచిత పనులను చేపట్టి దానివలన అపజయమును పొందగలరు. సప్తమ బావములో కేతువు యొక్క దృష్టి జీవిత బాగస్వామికి కష్టములను కలిగించును. జీవిత బాగస్వామి నుండి సుఖము మరియు సమ్యోగములలో లోపము రాగలదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...