1, జూన్ 2017, గురువారం

యోగిని దశలు


యోగిని దశలు
పరాశర మహర్షి తెలియజేసిన నక్షత్ర దశలలో యోగినీ దశ విధానం అత్యంత ప్రాచుర్యం పొందింది. దక్షిణ భారతదేశమందు వింశోత్తరి దశా విధానం ఎంత ప్రాచుర్యం పొందిందో అదే విధంగా ఉత్తర భారత దేశ మందు యోగినీ దశా విధానం అంత ప్రాచుర్యం పొందింది. ఈ యోగినీ దశా విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించినట్లు పరాశర మహర్షి పేర్కొన్నాడు. ఈ యోగినీ దశా విధానాన్ని గురించి “మానసాగరి” యందు పేర్కొనటం జరిగింది. వీటి ఫలితాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటున్నాయి. వింశోత్తరి దశా విధానం ద్వారా వాస్తవ పరిస్ధితులకు ఫలితాలు సరిపోకుంటే యోగిని దశా విధానం ద్వారా పరిశీలించవచ్చును.

యోగిని దశలు మొత్తం 36 సంవత్సరాలు ఉంటాయి. మొత్తం ఎనిమిది యోగినులు ఉంటారు. వీటిలో చంద్ర గ్రహం  నుండి రాహువు వరకు యోగినులు ఉన్నాయి. కేతుగ్రహమునకు యోగిని పేర్కొనబడలేదు. 36 సంవత్సరాలు పూర్తికాగానే మరలా మొదటి యోగినీ దశా కాలం ప్రారంభమవుతుంది. 

యోగినీ దశ తెలుసుకునే పద్ధతి.
జన్మ నక్షత్రమును అశ్వనీ నుండి ఎన్నవదో లెక్కించి దానికి 3 కలిపి, 8 చేత భాగించిన శేషం 1 వచ్చిన మంగళ యోగినీ దశ, 2 వచ్చిన పింగళ యోగినీ దశ, 3 వచ్చిన ధాన్య యోగినీ దశ, 4 వచ్చిన భ్రామరి యోగినీ దశ, 5 వచ్చిన భద్రిక యోగినీ దశ, 6 వచ్చిన ఉల్క యోగినీ దశ, 7 వచ్చిన సిద్ధ యోగినీ దశ, 8 వచ్చిన సంకట యోగినీ దశ  అగును.

పట్టికలో చూపిన విధంగా యోగినీ దశలలో జన్మ నక్షత్రమునకు ఎదురుగా ఉన్న యోగినీ దశ, జాతకునికి ప్రారంభ యోగినీ దశ అవుతుంది.
ఉదాహరణ:- ఒక వ్యక్తి జననం 1978-10-06 ఉదయం 06.30 ని.లు
అనూరాధ నక్షత్రం-1 పాదం, వృశ్చిక రాశి, కన్యా లగ్నం .
 
అనూరాధా నక్షత్రం అశ్వనీ నక్షత్రం నుండి 17 వ నక్షత్రం 3 కలిపితే 20 వచ్చిన దానిని 8 చేత భాగించగా వచ్చిన శేషం 4 అవుతుంది. 4 వచ్చిన భ్రామరీ యోగ దశతోటి జాతకుని ప్రారంభ దశ ఉంటుంది.

చంద్రుడు 5° -14' ని. లలో ఉంటాడు. పట్టికలో చూపిన ప్రకారం అనూరాధ నక్షత్రం భ్రామరీ దశలో ఉండుట చేత జాతకునికి ప్రారంభ దశ భ్రామరీ దశ. ఈ దశా శేషం చంద్రుని  5° -14' డిగ్రీలను అనుసరించి పట్టిక ప్రకారం 5° - 00' లకు దశా శేషం 3 సం. ల 6 నెలలు. 14 ' లకు పట్టిక 2.2 ప్రకారం 25 రోజుల నాలుగు గంటల 48 నిమిషాలను తీసివెయ్యాలి. 3 సం. ల 6 నెలల నుండి 25 రోజులు తీసివేస్తే 3 సంవత్సరాల 5 నెలల 5 రోజులు దశా పరిమితి ఉంది. దీనిని జన్మ సంవత్సరానికి కలపాలి.

1978 – 10 -06 జననం.
    3 -  05 -05 జనన కాల భ్రామరీ దశా శేషం.
1982 – 03 – 11 వరకు భ్రామరీ దశా కాలం ఉంటుంది. దాని తరువాత భద్రిక దశ 5 సంవత్సరాలు కలిపితే 1987- 03 – 11 వరకు ఉంటుంది. దాని తరువాత ఉల్క దశ 6 సంవత్సరాలు కలిపితే 1993 – 03 -11 వరకు ఉంటుంది. దాని తరువాత సిద్ధ దశ 7 సంవత్సరాలు కలిపితే 2000 -03 – 11 వరకు ఉంటుంది. దాని తరువాత సంకట దశ 8 సంవత్సరాలు కలిపితే 2008 – 03 – 11 వరకు ఉంటుంది. దాని తరువాత మంగళ దశ 1 సంవత్సరం కలిపితే 2009 – 03 – 11 వరకు ఉంటుంది. దాని తరువాత పింగళ దశ 2 సంవత్సరాలు కలిపితే 2011 – 03 – 11 వరకు ఉంటుంది. దాని తరువాత ధాన్య దశ 3 సంవత్సరాలు కలిపితే 2014 – 03 -11 వరకు ఉంటుంది. దాని తరువాత దశ ఐన భామరీ దశ 4 సంవత్సరాలు కలిపితే 2018 03 -11  వరకు ఉంటుంది. దాని తరువాత దశ ఐన భద్రిక దశ 5 సంవత్సరాలు కలిపితే 2023 – 03 – 11 వరకు ఉంటుంది. ఈ  విధంగా ఎవరికి వారు తమ జాతక చక్రం ఆదారంగా యోగిని దశలను గుర్తించవచ్చును.

అదే విధంగా అంతర్ధశను గుర్తించవచ్చును. పట్టికను అనుసరించి భ్రామరీ దశలో భ్రామరీ అంతర్ధశ 5 నెలల 10 రోజులు. భ్రామరీ దశలో భద్రిక అంతర్ధశ 6 నెలల 20 రోజులు. భ్రామరీ దశలో ఉల్క అంతర్ధశ 8 నెలలు, భ్రామరీ దశలో సిద్ధ అంతర్ధశ 9 నెలల 10 రోజులు, భ్రామరీ దశలో సంకట అంతర్ధశ 10 నెలల 20 రోజులు, భ్రామరీ దశలో మంగళ  అంతర్ధశ 1 నెల 10 రోజులు,  భ్రామరీ దశలో పింగళ అంతర్ధశ 2 నెలల 10 రోజులు, భ్రామరీ దశలో ధాన్య అంతర్ధశ 4 నెలలు ఉంటుంది.

ఈ యోగినీ దశలలో కొన్ని శుభ ఫలితాలను, కొన్ని అశుభ ఫలితాలను ఇచ్చేవి ఉన్నాయి. ఈ వర్గీకరణ సాదారణమైనది మాత్రమే. ఆయా గ్రహాల అధిపతుల రీత్యా, స్ధితుల రీత్యా, లగ్నముననుసరించి శుభా శుభత్వాలు మారుతాయి. 



శుభ యోగినులు:- మంగళ (చంద్ర), ధాన్య (గురువు), భద్రిక (బుధుడు), సిద్ధ (శుక్రుడు).
అశుభ యోగినులు :- పింగళ (రవి), భ్రామరీ (కుజుడు), ఉల్క (శని), సంకట (రాహువు) .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...