ధనుర్ లగ్నము యొక్క అధిపతి గురువు. ఈ లగ్నములో ఎవరి జనమైతే కలుగునో వారు మానవీయ గుణములతో పరిపూర్ణతను కలిగి వుండెదరు. ఇతరుల పట్ల దయాబావము కలిగి వుండెదరు. సాదారణతను ఇష్టపడతారు. ఈశ్వరుని పట్ల నమ్మకము కలిగి బాగ్యశాలిగా వుండెదరు.
ధనుర్ లగ్నములో లగ్నస్థ సూర్యుడు
ధనుర్ లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు బాగ్యాదిపతి కాగలడు. లగ్నములో విరాజితమైన ఎడల వ్యక్తికి అరోగ్యమైన మరియు అందమైన శరీరము కలుగగలదు. ఙ్ఞానము, బుద్ది మరియు ఆత్మబలమును ప్రదానించును. వీరి మాటలు ప్రభావముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వ్యాపారము లేదా ఉద్యోగము రెండూ వీరికి లాభదాయకముగా వుండును. అయిననూ వీరికి ఉద్యోగములో వీరికి విశేష సఫలత లభించగలదు. లేఖనము, చదువుట మరియు బౌతిక కార్యములలో లోపప్రియతను పొందగలరు. చిత్రకళ లేదా శిల్పకళలలో వీరికి అభిరుచి వుండగలదు. లగ్నస్థ సూర్యుని సప్తమ బావములో బుధుని యొక్క రాశి మిధునమును చూస్తున్నాడు. సూర్యుని దృష్టి ఫలితము కారణముగా ధనము, ప్రఖ్యాతి మరియు మిత్రుల నుండి సహకారం ప్రాప్తించగలదు. ఆర్ధిక స్థితి బాగుండును. భాగ్యాదిపతి సూర్యుడు ప్రభుత్వ రంగము నుండి లాభమును కలిగించును. జీవిత బాగస్వామి మరియు సంతాన సుఖము లభించగలదు.
ధనుర్ లగ్నములో లగ్నస్థ చంద్రుడు చంద్రుడు ధనుర్ లగ్నము గల కుండలిలో అష్టమాదిపతిగా వుండుట సఫల ఫలితములను ఇచ్చును. చంద్రుడు లగ్నములో స్థితిలో వున్న ఎడల వ్యక్తి యొక్క మనస్సు స్ధిరత్వము లేకుండా వుండును. అనుసందానాత్మక పనులలో వీరి అభిరుచి వుండగలదు. లగ్నస్థ చంద్రుని కారణముగా వ్యక్తి ఆరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. వ్యక్తి ప్రయాణముల పట్ల ఆసక్తి కలవాడై వుండును. వీరికి ప్రకృతిలో దృశ్యములు మరియు జలక్షేత్రములు ప్రియమైనవిగా వుండును. కళలతో కూడిన విభిన్న రంగములలో మరియు లేఖనములో వీరికి అభిరుచి అధికముగా వుండును. ఈ విషయములలో వీరికి సఫలత చాలా తొందరగా లభించగలదు. చంద్రుని దృష్టి సప్తమ బావములోని మిధునరాశిపై ఉండును కావున అందమైన మరియు సమ్యోగముగల జీవిత బాగస్వామి లభించును. సంతాన సుఖము ఆలస్యముగా కలుగును.
ధనుర్ లగ్నములో లగ్నస్థ కుజుడు కుజుడు ధనుర్ లగ్నము యొక్క కుండలిలో పంచమాదిపతి మరియు దశమాదిపతిగా వుండి శుభ యోగకారక గ్రహముగా వుండును. వ్యక్తి తన స్వయం క్రుషి మరియు శ్రద్ద వలన ధనమును ఆర్జించెదరు. కుజుడు గురువు యొక్క ధనుర్ రాశిలో వుండుట వలన శిక్షామార్గములో అవరోధములను కలిగించును. ప్రదమస్థ కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావమును చూస్తున్నాడు. ఈ దృష్టి కారణముగా గృహస్థ జీవితములో బార్యా భర్తల మద్య వొడిదుడుకులు కలుగవచ్చును. చిన్న చిన్న వివాదములు కూడా ఉత్పన్నము కాగలవు.
ధనుర్ లగ్నములో లగ్నస్థ బుధుడు బుధుడు ధనుర్ లగ్నము గల కుండలిలో సప్తమ మరియు దశమ రెండు కేంద్రములకు అధిపతి కాగలడు. రెండు కేంద్రములకు అధిపతిగా వుండుట వలన ఈ గ్రహము అవయోగ కారక గ్రహము కాగలడు. కాని బుధుడు లగ్నస్థుడుగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు నిరోగములతో కూడిన శరీరమును ప్రదానించును. తల్లి దండ్రుల నుండి స్నేహమును మరియు సమ్యోగమును ప్రదానించును. ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగము నుండి లాభము మరియు గౌరవమును ప్రదానించును. మెట్టింటి నుండి వీరికి సమయానుకూలముగా లాభమును ప్రదానించును. బుదుడు సప్తమ బావములో స్థితిలో వున్న స్వరాశిని చూస్తున్నాడు దానికారణముగా అందమైన మరియు సమ్యోగము గల జీవిత బాగస్వామి లభించును. మిత్రుల నుండి భాగస్వామ్యుల నుండి లాభములను ప్రదానించును. వ్యాపారములో లాభములు కలుగును. ఆర్ధిక స్థితి బలముగా వుండును.
ధనుర్ లగ్నములో లగ్నస్థ గురువు
గురువు ధనుర్ లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు చతుర్ధాదిపతి కాగలడు. గురువు స్వరాశి ధనురాశిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తికి అందమైన మరియు అరోగ్యముకరమైన శరీరమును ప్రదానించును. వ్యక్తి బుద్ది మరియు ఙ్ఞానము కలిగి వుండును. సమాజములో గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్టలను పొందగలరు. భూమి, భవనము మరియు వాహన సుఖమును పొందగలరు. ప్రధమ బావములో వున్న గురువు యొక్క పూర్ణ దృష్టి పంచమ బావములో మేష రాశిలో సప్తమలో మిధునముపై మరియు నవమ బావములో సింహరాశిపై వుండును. గురువు యొక్క దృష్టి ఫలితము కారణముగా వ్యక్తి సాహసము మరియు దయాస్వబావము కలిగి వుండును. జీవిత బాగస్వామి నుండి మరియు సంతానము నుండి సుఖము ప్రాప్తించగలదు. జీవితము ఐశ్వర్యము మరియు సుఖముతో పరిపూర్ణముగా వుండును. ఉద్యోగము మరియు వ్యాపారములో సఫలత లభించగలదు. శత్రుభయము వుండగలదు కాని వారు మీకు హాని కలిగించలేరు.
ధనుర్ లగ్నములో లగ్నస్థ శుక్రుడు ధనుర్ లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు అవయోగకారక మరియు అశుభ గ్రహము కాగలదు. ఇది ఈ లగ్నము యొక్క కుండలిలో ఆరవ మరియు పదకొండవ బావములకు అధిపతిగా వుండును. శుక్రుడు ధనుర్ లగ్నములో లగ్నస్థముగా వుండుట కారణముగా వ్యక్తి చూడడానికి అందముగా వుంటాడు. కాని శుక్రుడు షష్టమాదిపతిగా వుండుట కారణముగా వ్యక్తికి అరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. శుక్రుడు ఏకాదశాదిపతిగా ఆర్ధిక స్థితి బాగుపడును. రాజకీయ క్షేత్రముల నుండి లాభమును ప్రదానించును. శుక్రుని ప్రభావము కారణముగా వీరికి ప్రభుత్వ ఉద్యోగము లభించుటకు అవకాశములు ప్రభలముగా వున్నవి. సంగీతము మరియు కళల యందు ఆసక్తి అధికముగా వుండును. శుక్రుడు సప్తమ బావము మిత్ర గ్రహమైన మిధునముపై పూర్ణ దృష్టి కలిగి వుండును. ఫలితముగా వీరి జీవిత బాగస్వామి అందముగాను మరియు సమ్యోగము గలవారుగాను వుండును. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.
ధనుర్ లగ్నములో లగ్నస్థ శని
శని ధనుర్ లగ్నము యొక్క కుండలిలో ద్వితీయ మరియు తృతీయ బావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నములో శని లగ్నస్థములో వుండుట కారణముగా వ్యక్తి సన్నగా వుంటాడు. శని ప్రభావము కారణముగా వ్యక్తి నేత్ర రోగము వలన పీడించబడగలడు. వీరికి స్వతంత్రముగా ఏ నిర్ణయము తీసుకొనవలనన్నా కష్టముగా వుండును. జీవితములో ప్రగతి కొరకు ఇతరుల సహాకారం వీరు అదికముగా కోరుకుంటారు. ధనము బద్రపరచుట వీరి ప్రవృత్తి కలిగి వుండెదరు. షేర్, పందెములు మరియు లాటరీలలో వీరికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా లాభములు కలుగవచ్చును. లగ్నస్థ శని తృతీయ బావములో కుంబరాశిని, సప్తమ బావములో మిధున రాశిని మరియు దశమ బావములో బుధుని రాశి కన్యను చూస్తుండును. ఈ బావములలో శని యొక్క దృష్టి వున్న ఎడల మిత్రుల నుండి అపేక్షిత లాభము మరియు సమ్యోగము లభించదు. బాగస్వాముల నుండి హాని కలుగును. దాంపత్య జీవితములో కష్టము యొక్క అనుభూతి కలుగగలదు.
ధనుర్ లగ్నములో లగ్నస్థ రాహువు
ధనుర్ లగ్నము యొక్క కుండలిలో రాహువు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి పొడుగుగా మరియు అరోగ్యముగా వుండును. వీరి బుద్ధి కుటిలనీతి కలదై వుండును. వారి పనిని ఏవిదముగానైనా చేపట్టు నేర్పు కలిగినవారై వుండెదరు. స్వహితము వీరి సిద్దాంతము. రాహువు యొక్క దృష్టి కారణముగా సంతాన సుఖములో బాధలు మరియు జీవిత బాగస్వామి నుండి సమ్యోగము లభించుటకు అవకాశములు తక్కువగా వుండును. జీవిత బాగస్వామి ఆరోగ్యము కారణముగా సమస్యలు కలుగును.
ధనుర్ లగ్నములో లగ్నస్థ కేతువు
కేతువు యొక్క ఉపస్థితి ధనుర్ లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో వుండుట కారణముగా వ్యక్తి యొక్క అరోగ్యములో వొడుదుడుకులు వుండగలవు. నడుము మరియు శరీర చేర్పులలో నొప్పి వుండగలదు. ఆత్మ బలము లోపము కారణముగా ఏ విధమైన మహత్వపూరితమైన విషయములలోనూ నిర్ణయములు తీసుకొనుట కఠినముగా వుండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి