చంద్రగ్రహ దోష నివారణకు "ముత్యం"
ముత్యమును క్షీరాబ్ధి, హురూముంజ, కాకిపాడి, ఇక్షుజము, అంబుపూస, నీరాజము, మంజరి, గొగ్గి, చిప్ప ముత్యం ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ముత్యం చంద్రగ్రహానికి ప్రతీకగా ధరిస్తారు. ముత్యం స్వచ్ఛంగా, తెల్లగా, గుండ్రంగా, బియ్యపు గింజలవలె వంకరగాను, గుండ్రంగాను ఉంటాయి. ప్రకృతిలో ఎక్కువగా ముత్యాలు ముత్యపు చిప్పల ద్వారా లభ్యమవుతాయి. ఈ ముత్యాలు “షెల్ ఫిష్” అనే నత్త జాతికి చెందిన డిప్పలు గల చేప ద్వారా లభ్యమగును. సముద్రపు అడుగు భాగంలో తిరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఈ డిప్పలోకి చేరి ఇబ్బంది కలిగినప్పుడు రక్షణ కవచంగా ఒక ద్రవాన్ని స్రవిస్తాయి. ఆ ద్రవం గట్టి పడి ముత్యాలుగా రూపొందుతాయి.
బృహస్సంహిత గ్రంధం ఆధారంగా ప్రకృతిలో ముత్యాలు ఏనుగు కుంభ స్ధలాలలోను, సర్పాల శిరస్సు పైన ముత్యపు చిప్పల ద్వారా, శంఖాలలోను, మేఘాలలో, వెదురుబొంగులలో ఒక రకమైన చేపలలోను, అడవిపంది కోరల్లోను మంచి ముత్యాలు మాత్రం ముత్యపు చిప్పలలో మాత్రమే లభించునని పేర్కొనటం జరిగింది.
ఐరావతం జాతికి చెందిన ఏనుగు కుంభ స్ధలంలో కింద దంతాలు పుట్టే స్ధలంలో ఏర్పడే ముత్యాలు పుష్యమి, శ్రావణా నక్షత్రాలలోను, ఆది, సోమ వారాలలోను మాత్రమే లభిస్తాయి. భద్ర జాతికి చెందిన ఏనుగులలో ముత్యాలు ఉత్తరాయణంలోను, సూర్య, చంద్రగ్రహణాల సమయంలోను లభిస్తాయి. దీనినే‘గజముక్తా’అంటారు. ఇది అత్యంత కాంతి వంతంగా ఉండి ఇది ఉన్న గదిలో దీపం అవసరం ఉండదని, సకల భోగ భాగ్యాలను, సర్వవిధాల విజయాన్ని కలుగజేస్తుంది.
అడవిపందుల కోరల్లో నుండి వచ్చే ముత్యాలను‘శూకరముక్తా’ అంటారు. ఇది ధరించిన వారికి అమోఘమైన వాక్శుద్ధి లభిస్తుంది. చేపలు, తిమింగలాల పొట్టలో లభించే ముత్యాలు చేప కన్ను ఆకారంలో ఉండి చీకటిలో సైతం చూడగలిగే శక్తి కలగి ఉంటాయి.
పుష్యమి, శ్రావణా నక్షత్రంలో కురిసే వడగండ్లవర్షంలో లభించే ముత్యాలను‘మేఘముక్తా’అంటారు. ఇవి భూమి మీద పడే లోపల అంతరిక్షచారులైన దేవ గంధర్వ, యక్ష కిన్నెరాదులు సంగ్రహిస్తారని ప్రతీతి. ఇవి అత్యంత కాంతివంతంగా ఉండి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
తక్ష, వాసుకి జాతికి చెందిన సర్పముల శిరస్సులలో లభించే ముత్యాలు ‘సర్పముక్తా’అంటారు. వీటిని సానపట్టకుండా ఉంగరంలో పొదగాలి. ఈ సర్పాలు 100 సంవత్సరములు బతుకుతాయట. ఈ ముత్యాలు దరించిన వారికి మృత్యు బాధలు ఉండవని, విష సర్పబాధల నుండి విముక్తి లభిస్తుందని ప్రతీతి.
దట్టమైన అడవులలో ఉండే వెదురు బొంగులలో మరియు వెఱ్ఱి చెరకు గడల కణుపుల వద్ద లభించే ముత్యాలు పుష్యమి, స్వాతి, శ్రావణా నక్షత్రాలకాలంలో వేణుగాన ధ్వని ఏర్పడి లభిస్తాయి. వీటిని ‘వంశీముక్తా’అంటారు. వీటికి స్త్రీ వశీకరణ శక్తి ఉంటుందని ప్రతీతి.
లక్ష్మీదేవి ఆవిర్భవించిన పాంచజన్య శంఖాలలో లభించే ముత్యాలు ‘శంఖముక్తా’ అంటారు. ఇవి నీలం రంగులో ఉంటాయి. స్వాతి కార్తెలో సూర్యుడు స్వాతి నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సముద్ర ప్రాంతమందు తెరుచుకొని ఉన్న ముత్యపు చిప్పలలోకి వర్షపు నీరు పోయినప్పుడు అవి ముడుచుకొని ఘనీభవించి ముత్యాలుగా మారుతాయి. సముద్రపు అలల తాకిడికి అదిరి రెండు ముత్యాలుగా పెక్కు ముత్యాలుగా ఏర్పడతాయి. వీటినే‘స్వాతి ముత్యాలు’అంటారు. వీటిని చంద్రకిరణం లాగా చల్లగా, ప్రకాశిస్తూ అనర్ఘరత్న అనదగిన “మహా మౌక్తికం” అని అంటారు. వీటిని మంత్ర సాధకులు వశీకరణ విద్యాలకు ఉపయోగిస్తారు.
త్రికోణంగా ఉన్న ముత్యాలు, గుంటలుగా ఉన్నవి, పొరలగా ఉన్నవి, నల్లగా ఉన్నవి, ఎక్కువ బుడిపెలు ఉన్నవి, ఎర్రగా, కాంతిహీనంగా, చేప కన్ను వలె ఉన్నవి, ఇసుక రేణువులు అంటుకొని ఉన్న ముత్యాలు దోషము కల ముత్యాలు ధరించరాదు.
ముత్యాలు ఎక్కువగా చైనా, జపాన్, ఆస్ట్రేలియాలలో లభించును. భారతదేశంలో బొంబాయి, తిరునల్వేలి జిల్లాలలోని తుత్తుకుడి దగ్గర కొన్ని వేల సంవత్సరాలుగా లభించే ముత్యాలు ఆభరణాలలోను, ఔషదాలలోను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గోమూత్రంలో కొద్దిగా ఉప్పువేసి దానిలో ముత్యం నానబెట్టి దాన్యపు ఊకతో రుద్దినప్పుడు పగలక ముందు కంటే కాంతి వంతంగా మెరిసినప్పుడు అది జాతిముత్యమని, పగిలినచో కృత్రిమ ముత్యాలుగా గుర్తించాలి. కృత్రిమముత్యాలు నీటిలో నానబెట్టిన పొరలు పొరలుగా విడిపోవును. జాతిముత్యాలను రంధ్రం గుండా భూతద్దంలో చూసినప్పుడు ఉల్లి పొరల వల్లే నరుకులు నరుకులుగా కనిపించును.
మార్చి, ఏప్రియల్ మాసములలో లభించే సముద్రపు ముత్యాలు ప్రభుత్వం ఆదీనంలో ఉండి గజఈతగాళ్ళ ద్వారా తెప్పించుకుందురు. ఇవి ధరించుటకు ప్రశస్తమైనవి. కృత్రిమ ముత్యాలు జపాన్ ఇతర దేశాలలో
తయారు చేయబడుతున్న వాటిని ధరించిన ఫలితం ఉండదు.
ఆయుర్వేదశాస్త్రం ప్రకారం గోమూత్రం, ఆవుపాలతో శుద్ధి చేసిన ముత్యాన్ని చింతపండు రసం నందు మూడు రోజులు ఉంచి భస్మం చేసిన ముత్యభస్మం సేవించటం వలన మతిభ్రమణం, నేత్రదోషాలు, క్షయ, ఉబ్బసం, స్ఫోటకం, చర్మవ్యాధులు, వీర్యస్ఖలనం, శుక్ల నష్టం, పైత్యం, గుండెనొప్పి, బహిష్టు రోగాలు, బొల్లి, అజీర్ణం, జ్ఞాపకశక్తి లేకపోవటం, వ్రణాలు, అతిఉష్ణం, ఉదరసంబంధ వ్యాధులు త్వరగా తగ్గును.
ముత్యం ధరించుట వలన ప్రయోజనాలు:- ముత్యమునకు అధిపతి చంద్రుడు. వ్యాపారకారకుడైన చంద్రుడి యొక్క ముత్యం ధరించిన వారికి వ్యాపారాభివృద్ధి, క్రయ, విక్రయములయందు నేర్పరితనం కలిగి సకల సంపదలు కలుగును. సంఘంలో సామాజికసంబంధాలు పెంచి గౌరవ ప్రతిష్ఠలు గడించే విధంగా చేస్తాయి. మానసిక ప్రశాంతత, ఆలోచనావిధానంలో మార్పులు కలుగును.
ముత్యాన్ని భస్మం చేసి ధనవంతులు సున్నం బదులుగా వాడేవారు. దాంపత్య జీవితంలో అన్యోన్నతకు, సౌఖ్యమునకు, వివాహం ఆలస్యమగు వారికి ముత్యం ధరించిన అనుకూలమైన సత్వర ఫలితాలు వస్తాయి. స్త్రీల పాలిట కల్పతరువు ముత్యం. తల్లి కారకత్వం వహించే ముత్యం దరించిన వారికి తల్లిచే కలహాలు, అభిప్రాయభేదాలు ఉండవు. హోటల్స్, వస్త్రవ్యాపారులు, నీటి సంబంద వృత్తులు చేసేవారు, పాలవ్యాపారం, స్త్రీల సంఘాల వాళ్ళు ముత్యం ధరించిన ప్రజలలో మంచి సామాజిక సంబంధాలు ఏర్పడి వ్యాపారాభివృద్ది కలుగును.
జాతకచక్రంలో చంద్రుడు వృశ్చికరాశిలో నీచలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, శత్రుక్షేత్రాలలో ఉన్న, అమావాస్య రోజు జన్మించిన వారు, చంద్ర దశ అంతర్ధశలలో, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో లగ్నాన్ని ఆదారంగా చేసుకొని ముత్యం ధరించిన జీవితంలో కష్టనష్టాలు తొలగి మంచి అభివృద్ధిలోకి రాగలరు. మొదటి సారి ముత్యం దరించేటప్పుడు “పద్మ ద్వాజాయ విద్మహే హేమ రూపాయ ధీమహీ తన్నో సోమ ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ నుండి 6 క్యారెట్స్ వరకు బరువు కలిగిన ముత్యాన్ని చూపుడువ్రేలుకి గాని, ఉంగరపు వేలుకి గాని సోమవారం చంద్రహోరాలో పొంగలిని ప్రసాదంగా ఇస్తూ ధరించాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి