15, జూన్ 2017, గురువారం

మీన లగ్నములో లగ్నస్థ నవగ్రహముల ప్రభావము

మీన లగ్నములో లగ్నస్థ నవగ్రహముల ప్రభావము

మీన లగ్నము యొక్క అధిపతి గురువు. ఈ లగ్నములో సూర్యుడు, చంద్రుడు, కుజుడు మరియు గురువు యోగకారక గ్రహములుగా వుండును. బుధుడు, శుక్రుడు మరియు శని ఈ లగ్నములో అవయోగ కారక గ్రహములుగా వుండి అశుభ ఫలితములను ఇచ్చును.

మీన లగ్నములో లగ్నస్థ సూర్యుని ప్రభావము 
సూర్యుడు మీన లగ్నము యొక్క కుండలిలో షష్టమాదిపతిగా వుండును. షష్టమ బావములో వుండుట వలన సూర్యుడు మీన లగ్నములో లగ్నస్థముగా వుండి సూర్యుడు వ్యక్తిని ఆరోగ్యముగాను మరియు నిరోగిగాను చేయును. ఎవరి కుండలిలో అయితే ఈ స్థితి వుండునో వారు ఆత్మవిశ్వాసము గల పరిశ్రమి కాగలరు. ఏ కార్యమునైనా పూర్తి మనోబావముతో చేయుదురు. శత్రువులు మరియు విరోదుల నుండి బయపడరు. సూర్యుని పూర్ణ దృష్టి సప్తమ బావములో కన్యా రాశిపై వుండును. వ్యాపారము చేయవలననే కోరిక, ఉద్యోగములో సఫలత లభించగలదు. వైవాహిక జీవితములో జీవిత బాగస్వామితో ఒడిదుడుకుల కారణముగా గృహస్థ జీవితము ప్రభావితము కాగలదు.

మీన లగ్నములో లగ్నస్థ చంద్రుని ప్రబావము 
మీన లగ్నము యొక్క కుండలిలో చంద్రుడు పంచమాదిపతి కాగలడు. ఈ లగ్నములో త్రికోణాదిపతిగా వుండుట వలన చంద్రుడు శుభ కారక గ్రహముగా వుండును  లగ్నములో దీని స్థితి వ్యక్తికి సుఖముగాను మరియు శుభకరముగాను వుండును. చంద్రుని ప్రభావము కారణముగా వ్యక్తి అందము మరియు ఆకర్షణీయమునకు అధిపతి కాగలడు. వీరి మాటలు మధురమైనవిగా మరియు ప్రభావశాలిగా వుండును. వీరిలో ఆత్మ విశ్వాసము వుండును. అందువలన వీరు ఏ పనిని చేయుటకు బయపడరు. మాతృ పక్షము నుండి మరియు తల్లి నుండి సుఖమును మరియు స్నేహమును పొందగలరు. చంద్రుడు పూర్ణ దృష్టి ద్వారా బుధుని రాశి కన్యను చూస్తున్నాడు. దీని ప్రబావము కారణముగా జీవిత బాగస్వామి మరియు సంతానము నుండి సుఖము మరియు సమ్యోగము లభించగలదు. అనవసర మనస్పర్ధలు కలుగును.

మీన లగ్నములో లగ్నస్థ కుజుని ప్రబావము 
కుజుడు మీన లగ్నము గల కుండలిలో ద్వితీయ మరియు నవమ బావము యొక్క అధిపతిగా వుండును. లగ్నములో దీని స్థితి కారణముగా వ్యక్తి శక్తిశాలి మరియు పరాక్రమిగా వుండును. ఇది వ్యక్తిని మొరటివాడిగా చేయును. అధ్యాత్మికములో వీరికి అభిరుచి అధికముగా వుండును. ఇతరులకు సహాయము చేయుతకు సిద్దముగా వుండెదరు. వీరి ఆర్ధిక స్థితి బాగుండును. ధనమును అనవసరముగా ఖర్చు చేయరు. వీరికి దృష్టి దోషము మరియు కర్ణ దోషము కలిగే అవకాశములు వున్నవి. ప్రధమ బావములో స్థితిలో వున్న కుజుడు చతుర్ధ, సప్తమ మరియు అష్టమ బావములను తన దృష్టితో ప్రభావితము చేయుచున్నాడు. ఈ ప్రభావము కారణముగా మిత్రులు మరియు బాగస్వాముల వలన లాభము కలుగును. తల్లి మరియు తల్లి సమానమైన మహిళతో స్నేహము మరియు సమ్యోగము లభించగలదు.

మీన లగ్నములో లగ్నస్థ బుధుని ప్రబావము
బుధుడు మీన లగ్నము యొక్క కుండలిలో చతుర్ధ మరియు సప్తమ బావము యొక్క అధిపతిగా వుండుట వలన కేంద్రాదాదిపతి దోషము కారణము వలన , నీచ స్ధానము వలన దూషించబడుదురు. లగ్నములో బుధుని స్థితి కారణముగా వ్యక్తి శ్రమకారకుడు కాగలడు.  వారి పరిశ్రమ, బుద్ధి బలముల వలన ధనార్జన చేయగలరు. పితృ సంపత్తి నుండి వీరికి విషేశ లాభములు కలుగవు. స్త్రీల వలన వీరికి విషేశ లాభములు మరియు సమ్యోగము లభించగలదు. లగ్నములో  వున్న బుధుడు సప్తమ బావములో స్వరాశిని చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా వర్తక వ్యాపారములలో మిత్రుల మరియు బాగస్వాముల నుండి సమ్యోగము లభించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును. అనుకూలమైన జీవిత బాగస్వామి లభించును. వారి సమ్యోగము లభించగలదు.

మీన లగ్నములో లగ్నస్థ గురుని ప్రబావము
గురువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు దశమాదిపతిగా వుండును. లగ్నాదిపతిగా వుండుట కారణముగా రెండు కేంద్ర బావములకు అధిపతిగా వున్నప్పటికి కూడా కేంద్రాదిపతి దోషము కలుగదు.  లగ్నములో దీని స్థితి కారణముగా వ్యక్తి అత్యంత బాగ్యశాలిగా వుండును. శారీరకముగ అరోగ్యముగా మరియు అందముగా వుండును. వీరు దయా స్వభావము మరియు వినమ్రత కలిగి వుండును. దర్మముపై నమ్మకము కలిగి ఆత్మ విశ్వాసముతో పరిపూర్ణముగా వుండును. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా తండ్రి మరియు సంతానము నుండి సుఖము ప్రాప్తించగలదు. గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.


మీన లగ్నములో లగ్నస్థ శుక్రుని ప్రబావము 
శుక్రుడు మీన లగ్నము యొక్క కుండలిలో తృతీయ మరియు అష్టమ బావము యొక్క అధిపత్ కాగలడు. ఈ లగ్నము యొక్క కుండలిలో ఇది అవయోగ కారకముగా వుండును. ఈ లగ్నములో శుక్రుడు ప్రధమ బావములో వుండుట కారణముగా వ్యక్తి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వీరికి పిత్తవాత రోగము కలుగు అవకాశములు వుండును. వీరి పనిలో వీరు నిపుణత కలిగి వుండెదరు. వీరు సాహసము మరియు పరాక్రమము కలిగిన వారై వుండును. వీరు ఏ విషయమునైనా చాలా లోతుగా తెలుసుకొనుటకు ఆసక్తి కలిగిన వారై వుండును. తల్లి నుండి సుఖము మరియు సమ్యోగమునకు అవకాశములు తక్కువగా వున్నవి. సంతానము యొక్క సందర్బములో కష్టములు కలుగును. సప్తమ బావములో శుక్రుని పూర్ణ దృష్టి వుండుట వలన గృహస్థ జీవితము సుఖమయముగా వుండును.

మీన లగ్నములో లగ్నస్థ శని యొక్క ప్రబావము 
శని మీన లగ్నము యొక్క కుండలిలో ఏకాదశాదిపతి మరియు ద్వాదశాదిపతిగా వుండును. లగ్న బావములో శని యొక్క ఉపస్థితి కారణముగా వ్యక్తి సన్నగా వుండును. శని యొక్క ప్రబావము కారణముగా వ్యక్తి నేత్ర రోగము వలన బాదించబడును. వీరికి స్వతంత్రముగా నిర్ణయములను తీసుకొనుట కష్టకరముగా వుండును. జీవితములో ప్రగతి కొరకు ఇతరుల సలహాలను పాటించవలసి వుండును. ధన సేకరణ యొక్క ప్రవృత్తి వుండును. షేర్, పందెములు మరియు లాటరీల వలన వీరికి అకస్మాత్తుగా లాభము కలుగును. లగ్నస్థ శని తృతీయ బావములో వృశ్చికరాశిని, సప్తమ బావములో కన్యా రాశిని మరియు దశమ బావములో గురుని రాశి ధనుస్సును చూస్తుండును. ఈ బావములలో శని యొక్క దృష్టి వలన మిత్రుల నుండి అపేక్షిత లాభము మరియు సమ్యోగము లభించదు. బాగస్వాముల నుండి హాని కలుగును. దాంపత్య జీవితములో కష్టములు ఉన్న సర్ధుకుపోతారు.

మీన లగ్నములో లగ్నస్థ రాహువు యొక్క ప్రభావము 
రాహువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి కండలు తిరిగిన ఆరోగ్యము కలిగి వుండును. రాహువు వీరికి చతురతను మరియు బుద్దిని ప్రదానించును. వీరిలో స్వార్ధ బావన వుండగలదు. వీరి పనులను చేపట్టుటకు వీరు ఎవరితోనైనా మితృత్వమును చేయగలరు. వారి పనిని ఎలా పూర్తిచేసుకొనవలనో వీరికి బాగా తెలుసును. వీరిలో సహాసము అధికముగా వుండును. లగ్నస్థ రాహువు సప్తమ బావములో స్థితిలో వున్న బుధుని కన్యా రాశిని చూస్తున్నాడు.  జీవిత బాగస్వామి అరోగ్య సంబందమైన సమస్యలతో బాదించబడును. గృహస్థ జీవితములో కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును.

మీన లగ్నములో లగ్నస్థ కేతువు యొక్క ప్రబావము
కేతువు మీన లగ్నము గల కుండలిలో లగ్నస్థముగా వుండిన ఎడల వ్యక్తి అరోగ్య సంబంద సమస్యలతో బాదించబడగలడు. నడుము నొప్పి, మరియు వాత రోగములు కలుగు అవకాశములు వున్నవి. ఆత్మ విశ్వాసము తక్కువగా వుండుట వలన స్వతంత్రముగా నిర్ణయములను తీసుకొనలేరు. వ్యాపారము చేయాలనే కోరిక, ఉద్యోగము చేయుట వీరికి ఇష్టముగా వుండును. స్వార్ధ సిద్ది కొరకు సామాజిక నియమములను ఉల్లంఘించుటకు కూడా వెనుకాడరు. సప్తమ బావములో కేతువు యొక్క దృష్టి జీవిత బాగస్వామికి కష్టకారిగా వుండును. కేతువు వీరిని వివాహేతర సంబందములకు ప్రేరితము చేయును. ఫలితముగా గృహస్థ జీవితములోని సుఖము బాదించబడును. ఆర్ధిక స్థితి సామాన్యముగా వుండును. మోక్షప్రాప్తి కలిగించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...