17, జూన్ 2017, శనివారం

రాహుగ్రహ దోష నివారణకు "గోమేదికం"

గోమేధికం

ఆవు మొక్క మేదస్సును పోలి ఉండును కనుక దీనిని గోమేధికం అంటారు. గోమేధికాన్ని గోమేధ అని, పింగస్ పధిక్, త్రినాపర్, పిస్పి, హజార్ యామిని, రాహురత్నఅని పిలుస్తారు. గోమేధికం గోమూత్రపు రంగును కలగి ఉంటుంది. గోమేధికం గోమూత్రం రంగులోను, తేనె రంగులోను లభ్యమగును. కొన్ని తెలుపు రంగులో ఉండి మెరుస్తూ ఉండును. గోమేధికం కంకర రాళ్ళలో, నదీ ప్రవాహములలో కొట్టుకొని వస్తుంటాయి.

గోమేధికం, వైడూర్యం, పుష్యరాగం, పచ్చలు స్ఫటిక జాతికి చెందిన రత్నములు. గోమేధికం వజ్రము వలె కఠినముగా ఉంటుంది. బ్రాహ్మణ వర్ణం కలిగిన గోమేధికాలు తెల్లని కాంతితో, క్షత్రియ వర్ణం కలిగిన ఎరుపు రంగు మిశ్రమంతో, వైశ్య వర్ణం కలగిన ఆకుపచ్చ, పసుపు రంగుల్లో, శూద్ర వర్ణం కలిగిన నలుపు రంగులో మిశ్రమంగా కనిపించును.


మచ్చలు, చారలు, కాంతిహీనం గలవి ధరించరాదు. వాటిలో గల దోషములలో మలినముగా, కాంతిహీనంగా ఉన్న“మలదోషం” ఉన్న వాటిని, మచ్చలు గల బిందుదోషం ఉన్న వాటిని, చారలు, గీతలు ఉన్న “రేఖ దోషం” ఉన్న వాటిని, బీటలు, ముక్కలుగా విరిగిన దోషమున్న “త్రాళ” దోషమున్న వాటిని, కాకి పాదం వంటి “కాక పాదం”దోషం ఉన్న వాటిని ధరించిన జరగరాని అనుకోని దోషాలు సంభవించగలవు.

గోమేధికాలు హిమాలయ పర్వతాలలోను, శ్రీలంక ప్రాంతములలో లభ్యమగును. సూర్యకాంత గోమేధికం సూర్యునికి ఎదురుగా పెట్టినప్పుడు అగ్నిజ్వాల వలె కనిపిస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతములలో లభ్యమగు చంద్రకాంత గోమేధికం చంద్రకాంతిలో పరీక్షించిన పౌర్ణమి చంద్రుని వలె తెల్లగాను, మంచువలె చల్లగా, ప్రకాశవంతంగా  ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులలో ఉండి మెరుపు కలిగినవి, ఒకవైపు నుండి చూచిన రెండోవైపు కనపడేవి శ్రేష్ఠమైనవి.

ఆయుర్వేదశాస్త్రం ప్రకారం గోమేధికాన్ని గోమూత్రం లేదా గుర్రపు మూత్రంలో 72 గంటలు నానబెట్టి శుద్ధిచేసి, తదుపరి నల్ల ఉమ్మెత్త రసంలో ఒకరోజు అంతా ఉంచి కొలిమిలో భస్మం చేసిన దానిని స్వీకరించిన గుండె జబ్బులు, నరాల బలహీనత, నపుంసకత్వం మొదలగు వ్యాధుల నుండి విముక్తి కలుగును. రసాయనశాస్త్రం ప్రకారం బేరీలియమ్, జిర్కోనియం ఆక్సైడ్ ల రసాయన సమ్మేళనమే గోమేధికం.

         గోమేదికం ధరించటం వలన కలుగు ప్రయోజనాలు:- గోమేధికమునకు అధిపతి రాహువు. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో జన్మించిన వారు, రాహు మహాదశ, అంతర్దశ జరుగుతున్న వాళ్ళు గోమేదికం దరించటం మంచిది. భూత ప్రేత పిశాచముల భాదలు అనుభవించుచున్నప్పుడు ఉంగరంలో గోమేదికం ధరించిన భాదల నుండి విముక్తి కలుగుతుంది. గోమేదికం ధరించిన సర్వజన వశీకరణ కలుగును. శత్రువులు మిత్రులుగా మారుదురు. స్త్రీ మూలకంగా ధనప్రాప్తి కలుగును. రోగములు కలగకుండా కాపాడగలదు. విదేశీవిద్యలలో రాణించటానికి విదేశీ వ్యాపారాలు అనుకూలించటానికి, విదేశాలలో ధనార్జనకు ఉత్తమమైన రత్నం గోమేదికం.

రాహువు జాతకచక్రంలో లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, రాహువు జన్మజాతకంలో గాని గోచారంలో గాని  పంచమం, నవమంలో ఉన్న, రాహుదశలోను కలహాలు, ఆస్తి నష్టాలు, కోర్టులలో గొడవలు, విద్యాభంగం, రోగ భయం, రుణబాధలు, వ్యాపార ఉద్యోగాది వృత్తులలో ప్రతికూలం, స్త్రీ మూలకంగా ఆపదలు, ఆర్ధిక బాధలు కలుగును. అట్టి సమయం నందు గోమేధికం ధరించిన బాధల నుండి విముక్తి లభించును. మలినంగా దోషములతో కూడిన గోమేధికం ధరించిన దరిద్రం, కష్టనష్టాలు కలుగును. గోమేధికాన్ని “నాగ ధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహీ తన్నో రాహు ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపిస్తూ 3 నుండి 5 క్యారెట్స్ కలిగిన గోమేధికాన్నిమద్యవేలుకు శనివారం రోజు శనిహోరలో కిలోన్నర మినుములు దానం చేస్తూ ధరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...