కేతుగ్రహ దోష నివారణకు గణేష్ శంఖం
గణేష్ శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది. గణేష్ శంఖం గణపతి ఆకారాన్ని కలిగి ఉంటుంది. కేతుగ్రహానికి అధిపతి గణపతి. అందుకే జాతకంలో కేతువు అనుకూలంగా లేకపోతే గణపతిని పూజించాలి.
కేతువు జాతకంలో బలీహనంగా ఉన్నట్లయితే మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితంపై విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం, తనలో తానే మాట్లాడుకోవడం, తనను తాను చాలా గొప్పవాడిగా లేదా దేవుడు, దేవతగా ఊహించుకోవడం, దేన్ని చూసినా భయపడడం, ఉద్యోగంలో స్ధిరత్వం లేక పోవటం, భార్యాపిల్లలను వదిలివేసి దేశసంచారం చేయడం, పిచ్చివానిలా ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవడం, గర్భం వచ్చి పోవడం, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, చదువులో ఆటంకాలు, అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని రోగాలు కేతుగ్రహ దోషం వల్ల కలుగును.
కేతువు ద్వాదశ భావంలో ఉంటే బాలారిష్టదోషం. పంచమంలో ఉంటే సంతాన సమస్యలు, చతుర్దంలో బలహీనంగా ఉంటే విద్యా సమస్యలు ఇలా కేతుగ్రహ సమస్యలు ఉన్నవారు గనేష్ శంఖాన్ని పూజిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.
గణేష్ శంఖాన్ని ఎవరైతే నిత్యం పూజాచేస్తే ఎటువంటి పనినైనా ఆటంకాలు లేకుండ కార్యాన్ని సాదించుకోవచ్చు. ప్రతి పనిలో విజయం సాదించవచ్చును. ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. నరదృష్టి ప్రభావాలు ఉండవు.
విద్యనభ్యసించే వారు, విద్యలో ఆటంకాలు ఉన్నవారు తప్పకుండ పూజించాలి. బుద్ది వికాసాన్ని కలిగిస్తుంది. వివేకాన్ని కలిగిస్తుంది. మెమరీ పవర్ పెంచుతుంది.జాతకచక్రంలో కేతుగ్రహా దోషాలు ఉన్నవారు తప్పక పూజించాలి. జాతకచక్రంలో కేతువు పంచమభావంలో గాని, సప్తమభావంలో గాని, చతుర్ధభావంలో గాని, లగ్నభావంలో గాని ఉన్నప్పుడు శంఖాన్ని తప్పక పూజించాలి.
గణేష్ శంఖంతో నీటిని త్రాగిన వ్యక్తులు చెడు వ్యసనాలకు(తాగుడు,జూదం) క్రమక్రమంగా దూరం అవుతారు. చెడుకలలు, వికృత చేష్టలు నివారించబడతాయి.జాతకచక్రంలో పదవ స్థానంలో కేతువు శత్రుక్షేత్రాలలో ఉంటే వృత్తిలో స్థిరత్వం ఉండదు. అలాంటి వారు గణేష్ శంఖాన్ని పూజిస్తే వృత్తిలో స్థిరత్వం ఉంటుంది.గృహ నిర్మాణానికి ముందు గాని, వ్యాపార, విద్యా ఆరంభానికి ముందు గణేష్ శంఖు పూజ చేసినట్టైతే గృహ నిర్మాణంలో, వ్యాపారంలో గాని, విద్యలో గాని ఎటువంటి ఆటంకాలు ఉండవు.జాతకంలో కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు గణేశ్ శంఖుని పూజిస్తే చాలా మంచిది. ఇంటిలో ఈశాన్య దిక్కు దోషం ఉన్నవారు గణేష్ శంఖుని పూజామందిరంలో ఉంచుకొని పూజిస్తే వాస్తుదోషాలు తొలగిపోతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి