జాతకచక్రంలో చతుర్ధ భావ విశ్లేషణ
చతుర్ధ భావాన్నే మాతృభావం అంటారు. మమకారం చూపించేవారిని (తల్లి లేదా తండ్రి), పితృ ధనం, ఆయుర్ధాయం, జలోపద్రవాలు, సముద్రయానం, శయనం, స్ధాన చలనం, ఆరోగ్యం, సాదారణ విద్య, గృహం, సుఖం, వాహనం, స్ధిరాస్ధులు, భార్య చేసే వృత్తి ద్వారా వచ్చే ధనం, వ్యవసాయం, ఉద్యోగంలో కష్టాలు, విదేశాలలో బహిష్కరణకు గురి కావటం, గుండెజబ్బులు, మనస్సుపై ప్రభావం, మనిషి ప్రవర్తన, వ్యక్తికి స్ధిరత్వం, ఆస్తులు, వాహనాల స్ధిరత్వం, స్ధిరమైన విద్య, సేవకుల యొక్క స్ధిరత్వం, అన్నీ విషయాలకు స్ధిరత్వాన్ని ఈ భావంలో చూడచ్చు. సేవకులపై అజమాయిషీ, వాహన ప్రమాదాలు, గౌరవం, హోదా, విద్య ద్వారా అభివృద్ధి, ఆదాయ నష్టాలు, పూర్వజన్మలో చేసిన పాప కర్మలు, సంతాన అరిష్టాలు, మానసిక ప్రశాంతత, ఎదుగుదల, విశేషమైన చరాస్ధులు కలిగి మనో చింతనలు ఎక్కువగా ఉండచ్చును. ఈ స్ధానం పాడైతే మానసిక ఆందోళనలు, తల్లికి దురదృష్టం, ఆస్తుల విషయంలో చిక్కులు, చిన్నతనంలోనే తల్లిని కోల్పోవుట జరుగును.
చతుర్ధాధిపతి 6, 8, 12 స్ధానాలలో ఉండి శుభ దృష్టి లేకుంటే మాతృ వియోగం కలుగుతుంది. చతుర్ధాధిపతి, చతుర్ధ స్ధానం పాప కర్తరిలో ఉన్న చెడు స్నేహితులు ఉంటారు. గృహమునకు గురు, శుక్రులు, భూములు, స్ధలాలు, వ్యవసాయ క్షేత్రాలకు కుజుడు కారక గ్రహాలు. శుక్రుడు చతుర్ధ స్ధానంలో బలంగా ఉంటే వాహన సౌఖ్యం ఉంటుంది. చతుర్ధ భావానికి చంద్ర, శుక్రుల సంబంధం ఉంటే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఉంటుంది.
చతుర్ధ స్ధానంలో రవి ఉంటే:- దిగ్బలాన్ని కోల్పోతాడు. తండ్రితో వ్యతిరేఖత ఉంటుంది. పిత్రార్జితం హరించుట. ప్రభుత్వం నుండి గౌరవాలు, హోదాలు, చర, స్ధిరాస్ధులు లాభిస్తాయి. మానసిక ఒత్తిడి, గుండెజబ్బులు, సదా సంచారం చేయుదురు. వారసత్వ ఆస్తులు ఉంటాయి. వేదాంతం, అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఉంటుంది. రాజకీయంగా స్ధిరత్వం ఉంటుంది. కుజ, శని దృష్టుల వలన అడ్డంకులు. చతుర్ధాధిపతి రవితో కలసి నీచలో ఉన్న అధికారులు, ప్రభుత్వం కారణంగా ఆస్తులు నష్టపోతారు.
చతుర్ధ స్ధానంలో చంద్రుడు ఉంటే :- కారకోభావనాశాయ సూత్రం ప్రకారం తల్లికి దూరంగా ఉంటాడు. తల్లికి ఇతనిపై ప్రేమ లేకపోవటం, కుటుంబం నుండి సహకారం లేకపోవటం, చక్కటి విద్య వస్తుంది. అధిక సంతానం కలిగి ఉంటారు. మానసిక స్ధైర్యం, మంచి ఆలోచనలు, సుఖాలు, భూములు, వాహనాలు, సముద్రయానం చేస్తాడు. స్విమ్మింగ్ లో రాణిస్తాడు. ఇంటిలో వాటర్ సమస్య ఉండదు. గృహం, బందువుల వలన సహకారం, ముఖ్యమైన నాయకులుగా సంఘంలో పరపతి కలిగి ఉండటం, వివాదాలలో తలదూరుస్తారు. చంద్రుడు ఈ స్ధానంలో పాడైతే జీవితంలో ఒడిదుడుకులు, చిన్నతనంలో మాతృ వియోగం కలుగుతుంది.
చతుర్ధంలో స్ధానంలో కుజుడు ఉంటే :- దిగ్బలాన్ని కోల్పోతాడు. స్వరాశి, ఉచ్ఛలో ఉంటే భూమి పుత్రుడు కాబట్టి వ్యవసాయం, రియల్ ఎస్టేట్, హెరిటేజ్ ఫుడ్స్ మొదలగు వాటిలో రాణిస్తారు. కుజుడితో గురు, చంద్రులు కలసి ఉంటే కుజుడిలో ఉన్న క్రూర చెడ్డ స్వభావాలను తగ్గిస్తారు. శుక్రుడితో కలయిక వలన సౌఖ్యాలు, శనితో కలసిన ఉన్నత స్ధాయి మరియు అధోగతి రెండు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం, ఆపరేషన్స్, వాహన ప్రమాదాలు, కళత్రదోషం, ష్యూరిటీ ఉండటం ద్వారా నష్టపోవటం, ఇతరులకు వాహనం ఇస్తే వచ్చేదాకా అనుమానం, ఇంటికి సంబందించి ష్యూరిటీ ఉంటే నష్టపోతారు. మాతృ, మిత్ర, బందు సుఖం లేకపోవటం, రాజకీయాలలో విజయం, కుజుడు, రాహువు కలసి ఉన్న ఆత్మహత్యలకు పాల్పడతారు. స్వగృహం తరువాత ఏర్పడే సుఖాలు ఉండవు. చతుర్ధాధిపతి దుస్ధానం నందు గాని, చతుర్ధమందు కుజుడు లేదా శని ఉన్న ఆజాతకులు సంపదలు, ఆస్తులు నాశనం చేసుకుంటారు. చతుర్ధమందు రవి, కుజులు ఉన్న రాళ్ళ వల్ల గాయాలు కలుగును. చతుర్దమందు కుజ, శని, రాహువులు కలసి ఉన్నప్పుడు ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్నా ఎప్పుడు ఇతరులతో ఎడమొహం పెడమొహంగా ఉంటారు.
చతుర్ధ స్ధానంలో బుధుడు ఉంటే :- మంచి బుద్ధి, తెలివితేటలు, ఆటంకం లేని విద్య, జ్యోతిష్య విద్యలో ఆసక్తి, చతుర్ధ స్ధానంలో బుధుడితో పాటు గురువు కలసి ఉంటే జ్యోతిష్యం నేర్చుకొని ప్రాక్టీస్ పెట్టవచ్చు. భవిష్యత్ విషయాలు ముందుగా తెలుసుకొనుట, తల్లిపై ప్రేమ, మంచి వాక్శుద్ధి, తల్లి వైపు బంధువుల సహకారం, అనుకూలవతియైన భార్య, వాహనసౌఖ్యం, బాలారిష్టదోషం వలన చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలు వస్తాయి. విద్యావేత్త, గొప్పవారుగా పేరు ప్రఖ్యాతలు కలగి ఉండుట, జాతకుని తండ్రి స్వయంకృషితో పైకి వచ్చిన వారై ఉంటారు. సంగీతం, వివిధ కళలపై ఆసక్తి, సరదాగా మాట్లాడటం, తరచుగా ప్రయాణాలు చేయటం చేస్తారు.
చతుర్ధ స్ధానంలో గురువు ఉంటే :- మంచి సుఖాలు పొందుతారు. దృష్టి బలం ఎక్కువ. మంచి సేవకులు కలగి ఉండుట. భార్య ద్వారా ప్రేమాభిమానాలు పొందుతారు. మంచి ఆహారపు అలవాట్లు, వాహన సౌఖ్యత, స్త్రీ స్నేహితులు ఎక్కువగా ఉండుట. వ్యవసాయం, వ్యాపారం ద్వారా లాభాలు ఆర్జిస్తారు. సంతాన ఆలస్యం, పంచమం, పంచమాదిపతి బలంగా ఉంటే మగ సంతానం కలగి ఉంటారు. వేదాంతపరులు, మేధావులు, శత్రువులపై విజయం సాధించేవారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. గౌరవం, అదృష్టం కలిగినవారు. ప్రశాంతమైన కుటుంబ జీవితం కలిగి ఉంటారు. చతుర్ధంలో గురువు ఉండి చతుర్ధాధిపతి శుభ గ్రహాలతో చేరిన అనేక మంది స్నేహితులు ఉంటారు. 4, 9 అధిపతులు బలం కలిగి గురువుచే చూడబడినను లేక కేంద్ర కోణాలలో ఉన్న అధికార లాభం కలుగును.
చతుర్ధ స్ధానంలో శుక్రుడు ఉంటే :- వాహనాలకు, భోగాలకు కారకుడు కావటం వలన వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కలుగుతాయి. చరాస్ధులపైన, వస్త్రాలపైన, బంగారం, ఆభరణాలపైన మక్కువ. పోషక ఆహారం తినటం, ఇతరులను ఆకట్టుకొనే నేర్పరితనం, కుంభ, కర్కాటక లగ్నాలకు చతుర్ధంలో శుక్రుడు ఉన్న బ్యాంక్ కు సంబందించిన ఏదో ఒక ఉద్యోగం కలిగి ఉంటారు. సంగీతంలో నేర్పు, తల్లితో అనుభందం, కోరికలను చక్కగా సాదించుకోగలరు. కుటుంబ సౌఖ్యత, సంతోషం కలిగి ఉంటారు.
చతుర్ధ స్ధానంలో శని ఉంటే :- సేవకులు కలిగి ఉంటారు. చిన్న స్ధాయి నుండి పెద్ద స్ధాయి వరకు అన్ని ఒడిదుడుకులను తట్టుకొని వస్తాడు కాబట్టి సౌఖ్యం, సంపద వస్తే పోదు. రాజకీయ స్ధిరత్వం. శని ఈ స్ధానంలో బలంగా లేకపోతే పబ్లిక్ సపోర్ట్ ఉండదు. చతుర్ధంలో శని ఉండి బుధునితో గాని, ద్వితీయాధిపతితో గాని కలసి ఉంటే ప్రజలను మాటలతో ఆకర్షిస్తాడు. శని బలహీనుడైతే మానసిక ప్రశాంతత ఉండదు. తల్లికి కూడ ఇబ్బంది. ధనాన్ని కూడా కోల్పోతాడు. చిన్నతనంలో అనారోగ్యం, వంశపారంపర్య ఆస్తులు కోల్పోవుట, గృహ, వాహనాల కారణంగా ఇబ్బందులు. బందువుల దృష్టిలో విరోధిగా ఉంటాడు. నియమ బద్ధమైన జీవితంపై ఆసక్తి కలిగి ఉంటారు.
చతుర్ధ స్ధానంలో రాహువు ఉంటే :- ఇంట్లో, కుటుంబంలో అసంతృప్తి, సదుపాయాలు ఉన్న వినియోగించుకోలేరు. తల్లికి, తండ్రికి, భార్యకు ఇబ్బందులు.మూర్ఖంగా ప్రవర్తించటం. ఎక్కువమంది స్నేహితులను కలిగి ఉండటం. మోసకారులుగా ఉండటం. మోసం చేసామనే ఆవేదనను కలిగి ఉంటారు. రాహువు చతుర్ధమందు ఉండి పాపగ్రహాలతో కలసి ఉన్న లేదా చూడబడుచున్న మోసబుద్ధి కలిగి పైకి తియ్యగా మాట్లాడినను అంతర్గతంగా దుష్ట బుద్ధితో ఉందురు.
చతుర్ధ స్ధానంలో కేతువు ఉంటే :- చెడు మిత్రులు కలిగి ఉంటారు. ఆస్ధి నష్టం కలిగి ఉంటారు. పాప గ్రహాల సంబంధం ఉంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. మాతృ సౌఖ్యత ఉండదు. స్ధిరాస్ధులను అనుభవించలేడు. దూర ప్రాంతాలలో నివశిస్తాడు. ఆకస్మికమైన అపవాదులు, మార్పులు సంబవిస్తాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి