జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా బావచక్రాన్ని,నవాంశ చక్రాన్ని, షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలోని పరిశీలించాలి.ఈ షోడషవర్గుల పరిశిలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.
ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ, తాజక పద్దతి యందు పంచమాంశ, షష్ఠాంశ, అష్ఠమాంశ, లాభాంశ లేక రుద్రాంశ అను నాలుగు వర్గులను సూచించినారు.
షష్టాంశ;- అనారోగ్యం అమంతర్గతంగా ఉందా లేదా బహిర్గతమంగా ఉందో తెలుపును.
అష్టమాంశ:-ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాదులు, యాక్సిండెంట్స్,వైద్యపరంగా యాక్సిడెంట్ ద్వారా అవయవాన్ని తొలిగించుట.యాసిడ్ దాడులు.
లాభాంశ(రుద్రాంశ):-ఆర్ధికపరమైన లాభాలు,వృషభరాశి ఏలగ్నంగాని, గ్రహంగాని రాదు. వృషభరాశి శివుడికి సంబందించిన రాశి కాబట్టి ఈ రాశిలో ఏగ్రహం ఉండదు.
లగ్న కుండలి
లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, జీవన విధానం మొదలైన అనేక విషయాలు లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.
నవాంశ కుండలి(D9)
రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును. రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం.నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది. తదితర విషయాలు వివాహానికి సంబంధించి వివాహ యోగం ఉన్నదా, లేదా, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.
హోరా(D2) కుండలి
హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది. రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది.సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.
ద్రేక్కాణ(D3) కుండలి
వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. ఇది లగ్న కుండలి లో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.
చతుర్థాంశ(D4) కుండలి
చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు, గృహ వాహనాది యోగాలు, మన జీవితం కష్టాలతో కూడినదా లేక సుఖాలతో కూడినదా, తదితర అంశాల గురించి చెపుతుంది.
సప్తాంశ(D7) కుండలి
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు
దశమాంశ(D10) కుండలి
దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది. కర్మలు,వాటి ఫలితాలు,ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు,వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.
ద్వాదశాంశ(D12) కుండలి
ద్వాదశాంశ మన అదృష్టం గురించి, పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా తెలియ జేస్తుంది.తల్లిదండ్రులతో అనుబందాలు,వారి నుండి వచ్చే అనారోగ్యాలు,ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.
షోడశాంశ(D16) కుండలి
షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలిసజేస్తుంది. అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.
వింశాంశ(D20) కుండలి
వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను తెలియ జేస్తుంది. మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది దీని ద్వారా కనుక్కోవచ్చు.మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది.అప్పుడే దైవచింతన చేయగలడు.
చతుర్వింశాంశ(D24) కుండలి
చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది. ఉన్నతవిద్య,విదేశి విద్య,విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.
సప్తవింశాంశ(D27) కుండలి
సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది. అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్న కుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.జాతకుడిలో ఉండే బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చును.
త్రింశాంశ కుండలి(D30)
త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి, అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.స్త్రీ పురుషుల శీలం,వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,అరిష్టాలు తెలుసుకోవచ్చును.
ఖవేదాంశ(D40) కుండలి
ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
అక్షవేదాంశ కుండలి(D45)
అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది.తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.
షష్ట్యంశ కుండలి (D60)
షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో ఇది ఉపయోగపడుతుంది.పూర్వజన్మ విషయాలు, కవలల విశ్లేషణకు,ముహూర్తమునకు,ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.
మరిన్త సమాచారం జోడిన్చిన బాగుంటుంది
రిప్లయితొలగించండి