8, జనవరి 2018, సోమవారం

వాస్తు ఐశ్వర్య కాళీ పాదం

వాస్తు ఐశ్వర్య కాళీ పాదం

వాస్తు ఐశ్వర్య కాళీ యంత్ర పోస్టర్ ను ఇళ్ళు లేదా షాపు లేదా ఆఫీసు ప్రదాన ద్వారానికి లోపలి వైపు పైభాగాన ఉంచి "ఓం ఇం క్లీం ఐశ్వర్య కాళేయ నమః" అనే మంత్రాన్ని నిత్యం పఠించటం వల్ల వాస్తు దోషాలు పోయి ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, విద్యలో రాణింపు, మంచి ఉద్యోగం లభించటమే కాకుండా
వాస్తు ఐశ్వర్య కాళీ పాదం ఉన్నచోట నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.


కాళికా దేవి తన బంగారు పాదాలతో మన ఇళ్ళు, షాపు, ఆపీసులలోకి అడుగు పెట్టటం వల్ల ధనాభివృధ్ధి, వ్యాపారాభివృధ్ధి, గౌరవాలు, మంచి కమ్యూనికేషన్ ఉంటాయి. ముఖ్యంగా జాతకచక్రం లో శని దోషాలు కలవారు తప్పని సరిగా ఇంటిలో ఉంచుకోవాలి. కుటుంబంలో అందరి మధ్య సఖ్యత ఉంటుంది. నరదిష్టి ప్రభావాలు తొలిగి పోతాయి.

అమ్మవారిని ఎర్రతామరలతో విశేషించి ఎర్రకలువలతో (కాళీ సాధనలో కలువ పూలకు ప్రాధాన్యం) పూజిస్తే ఆమె ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. తామరగింజల మాలతో కాళీ మంత్ర జపం చేసి సిరిసంపదలను పొందవచ్చు.

కాళీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ఐశ్వర్యం అంటే కేవలం సిరిసంపదలు మాత్రమే కాదు. ఐశ్వర్యం అంటే అధికారం (రాజ్యాధికారం), వైభవం కూడా. ‘‘ఐశ్వర్య కాళి’’గా అమ్మవారిని ఆరాధిస్తే ఆమె వీటన్నింటినీ అనుగ్రహిస్తుంది. అలా అమ్మవారిని అర్చించి, ఆమె కోసం తపస్సు చేసి విక్రమార్కుడు, భట్టి, నరకాసురుడు, తెనాలి రామకృష్ణ మొదలైనవారు ఐశ్వర్యాన్ని పొందారు. ఉజ్జయినీ మహా కాళి శక్తిస్వరూపిణి. ఆమె ఐశ్వర్యకాళిగా భట్టి విక్రమార్కులను అనుగ్రహించింది. విక్రమార్కుని జీవితకథలో అమ్మవారి అనుగ్రహానికి సంబంధించిన ఘట్టం కనిపిస్తున్నది.

మహావీరుడైన విక్రమార్కుడు బేతాళుడు ఆవహించిన శవాన్ని తీసుకొని వస్తూ ఉండగా, బేతాళుడు అనేక కథలు చెప్పి ప్రశ్నలు అడగడం విక్రమార్కుడు జవాబులు చెప్పడం, మళ్లీ బేతాళుడు శ్మశానానికి వెళ్లిపోవటం తెలిసిన కథే. చివరికి బేతాళుడు చెప్పిన ఒక కథకు విక్రమార్కుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. అతడి బుద్ధిబలానికి మెచ్చిన బేతాళుడు. ‘విక్రమార్కా ఆ మాంత్రికుడు నిన్ను బలి యివ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాడు’ అని చెబుతాడు. అప్పుడు విక్రమార్కుడు. 


ఉజ్జయిని మహాకాళిని ప్రార్థించి, ఆమె అనుగ్రహంతో, మాంత్రికుని తన ఖడ్గంతో సంహరించగా కాళీదేవి ఐశ్వర్యరూపిణిగా ప్రత్యక్షం అయి ‘‘నాయనా! దుష్టసంహారం చేశావు. ధర్మాన్ని రక్షించావు. ఏం కావాలో కోరుకో’’ అని అన్నది. 1000 సంవత్సరాలు రాజ్యపాలన, అష్టైశ్వర్యాలు కావాలని విక్రమార్కుడు వరం అడిగాడు. ఆ తరువాత భట్టి విక్రమార్కుడు 2000 సంవత్సరాల ఆయుర్దాయం, అష్టైశ్వర్యాలను వరంగా పొందాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...