7, ఏప్రిల్ 2017, శుక్రవారం

సంఖ్యాసూచిక నవాంశలు



సంఖ్యాసూచిక నవాంశలు 


64 వ నవాంశ 

చంద్ర స్పుటాన్ని చంద్రుడు ఉన్న స్ధానం నుండి అష్టమంలో పెట్టగా అది ఎన్నో నవాంశ అయినదో ఆ నవాంశాధిపతిని 64 వ నవాంశాధిపతి అంటారు. అదే విధంగా లగ్న స్ఫుటాన్ని లగ్నం నుండి అష్టమంలో పెట్టగా అది ఎన్నో నవాంశ అయినదో ఆ నవాంశాధిపతిని కూడా లగ్నం నుండి నవాంశ అధిపతి అంటారు. ఈ అధిపతిని మారకం ఇచ్చే గ్రహం అంటారు. ఈ గ్రహం యొక్క దశ, అంతర్ధశలలో వ్యక్తికి మృత్యుతుల్య కష్టాలు ఉంటాయి. ఒక గ్రహము యొక్క 64 వ నవాంశ గ్రహ స్ధితి నుండి 8 వ రాశిలో ఉంటుంది. 

జాతకపారిజాతములో 64 నవాంను చంద్రుడి నుండి, బృహత్ పరాశర హోరాశాస్త్రములో చంద్రుడు మరియు లగ్నం నుండి, ప్రశ్న మార్గ్ లో చంద్రుడి నుండి, మరియు లగ్నం, రవి నుండి కూడా పరిశీలించవలెనని తెలుపబడినది. 

22 వ ద్రేక్కాణాధిపతి, 64 వ నవాంశాధిపతి ఒక్కరే అయిన లేక వేర్వేరు గ్రహాలు అయిన అవి బిందురహిత రాశిలో సంచరిస్తున్నప్పుడు మరియు అవి సంచరించు కక్ష్య ఖర గ్రహము యొక్క స్వకక్ష్య అయిన మరణం తధ్యం. ఛిద్ర గ్రహాల దశలలో గోచారం సంభవించిన ఎక్కువ ప్రమాదకరం. 

లగ్న నవాంశ నుండి లేక చంద్ర నవాంశ నుండి 64 వ నవాంశపై గోచార చంద్రుడు సంచరించు సమయంలో లేక 64 వ నవాంశ రాశి, నవాంశ లగ్నం అయిన ఈ లగ్నంపై గోచార చంద్రుడు సంచరించు సమయంలో మరణం సంభవించగలదని జాతకదేశ మార్గం అను గ్రంధంలో ఉన్నది. 


బృహత్ పరాశర హోరాశాస్త్రం ప్రకారం లగ్న లేక చంద్ర నవాంశ నుండి 64 వ నవాంశ రాశి, లగ్నం అయినప్పుడు లేదా లగ్నము నుండి ద్వితీయ భావ రాశికాని, 7 వ భావరాశి కాని లగ్నం అయినప్పుడు ఆ లగ్నాధిపతి భిన్నాష్టక వర్గులో అత్యల్ప బిందువులతో ఉండి పైన చెప్పిన మారక దశ జరుగుతున్నప్పుడు మరణం సంభవించునని తెలియజేయటమైనది. 

ప్రశ్నామార్గ్ ప్రకారం చంద్ర స్ధితి నవాంశ రాశ్యాధిపతి మరియు చంద్ర నవాంశ నుండి 64 వ నవాంశ అధిపతులు శత్రు, సమ, మిత్రులు అయిన వరుసగా అల్ప, మధ్య, పూర్ణాయుర్ధాయములను సూచించును. ఇదే విధంగా లగ్నం నుండి సూర్యుని నుండి కూడా పరిశీలించవలెనని తెలియజేయబడింది. 

హోరారత్నం ప్రకారం లగ్న నవాంశ లేదా చంద్ర నవాంశ నుండి 64 వ నవాంశపై రాహువు గోచరిస్తున్నప్పుడు దగ్గరి బందువు యొక్క మరణం సంభవించును. లగ్న నవాంశ నుండి 64 వ నవాంశ అధిపతి షష్ట, అష్టమ, వ్యయ భావములలో ఉన్న మరియు నితో కలసి ఉన్న వీటిపై రాహువు గోచరిస్తున్నప్పుడు వ్యక్తి విష ప్రయోగం వలన మరణించును. రాహువు లేదా కేతువు లతో ఉన్న వీటిపై రాహువు గోచరిస్తున్నప్పుడు వ్యక్తి ఊరి తీసుకొని మరణించును. 

64 వ నవాంశ రాశిపై మందగతి కలిగిన గ్రహాలైన గురు, శని, రాహు, కేతువులు గోచరిస్తున్నప్పుడు బంధువులకు అరిష్టం లేదా మరణం కలుగవచ్చును. దశమ భావ మధ్యమును ఒక గ్రహంగా పరిగణించి అక్కడి నుండి 64 వ నవాంశ రాశి పై గోచారంలో మందగతి గ్రహాలు సంచరించు కాలములో వృత్తి విషయములో ముఖ్యమైన సంఘటనలు జరుగవచ్చును.   

88 వ మరియు 108 వ నవాం ప్రాముఖ్యం 

ఈ నవాంశల ప్రాముఖ్యం వివాహా పొంతన విషయంలో చాలా ఉంటుంది. వధువు జాతకంలో చంద్ర నవాంశ నుండి వరుని జాతకంలోని చంద్ర నవాంశ 88 వ లేక 108 వ నవాంశ అయితే వారి వైవాహిక జీవితంలో కష్టాలు, అరిష్టాలు, కలుగుతాయి. 88 వ నవాంశ 22 వ నక్షత్రంలో ఉంటుంది. జన్మ నక్షత్ర పాదం నుండి 88 వ నవాంశ, జన్మ నక్షత్రం నుండి 22వ నక్షత్రంలోకి వస్తుంది. దీనిని ఖర నక్షత్రం అని, ఖర నవాంశ అని అంటారు. ఇది ప్రమాదకరం అని సూచించబడుతుంది. ఇది 22 వ ద్రేక్కాణంలో ఉంటుంది కావున దీనిని ఖర ద్రేక్కాణం అంటారు. లగ్నం నుండి 22 ద్రేక్కాణమును ఖర ద్రేక్కాణం అని, చంద్రుని నుండి 64 నవాంను ఖర నవాంశ అని పేర్కొనబడింది. 

55 వ నవాంశ 

55 నవాంలో ఉన్న గ్రహం మారకాన్ని ఇస్తుంది. లగ్నం నుండి 55 వ నవాంశ సప్తమ భావంలో మొదటి నవాంశ యందు ఉండును. 55 వ నవాంశలో ఉన్న గ్రహం మారకత్వం కలిగి మారకాన్ని ఇవ్వగలరు. అందుచేతనే మూహూర్త లగ్నంలో సప్తమంలో గ్రహం ఉండరాదు అంటారు. అందుకే వివాహా ముహూర్తంలో సప్తమ శుద్ధి ఉండాలంటారు. 

5 వ నవాంశ 

5 వ నవాంశ నే శుభ నవాంశ అంటారు. జాతాకాభరణం అనే గ్రంధం ఆధారంగా జాతకచక్రంలో రాశిలోనైనా 5 వ నవాంలో ఏ ఒక్క గ్రహం ఉన్న  ఆ గ్రహం యొక్క దశ, అంతర్ధశల్లో వ్యక్తికి మంచి స్ధితి, స్ధాయి కలుగుతాయి. ఏ గ్రహమైతే 13° 20' నుండి 16° 40' లోపులో ఉంటూందో ఆ గ్రహం వ్యక్తికి మంచి స్ధితిని, హోదాను ఇస్తుంది. 

36,64,72,96 నవాంశలు

జాతకచక్రంలో జన్మ చంద్ర నవాంశ నుండి 36 వ నవాంశను కర్మభ నవాంశ అంటారు. 64 నవాంను సంఘాతిక నవాంశ అంటారు. 72 వ నవాంశను వైనాశిక నవాంశ అంటారు. 96 వ నవాంను  మానస నవాంశ అంటారు. గోచారంలో నైసర్గిక పాపగ్రహాలు పైన చెప్పిన నవాంశలలో సంచరిస్తున్న కాలంలో వ్యక్తికి సంపద నష్టం, అనారోగ్యాలు, మానసిక ఆందోళనలు కలుగుతాయి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...