1, ఏప్రిల్ 2017, శనివారం

మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు



మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు

శ్వశ్రూవినాశ మహిజౌ సుతరాం విధత్తః
కన్యాసుతే నిరృతిజౌ శ్వశురం హతశ్చ
జ్యేష్ఠా భజాత తనయా స్వధవాగ్రజంచ
శక్రాగ్ని జా భ్వతి దేవర నాశకర్త్రీ  - ముహూర్త చింతామణి.

మూలలో జన్మించిన కన్య, సుతుడు మామగార్కి దోషాన్ని కలిగిస్తాడు. ఆశ్లేష జన్మించిన కన్య, సుతుడు అత్తగారికి దోషాన్ని కలిగిస్తాడు.


జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క అన్న గారికి దోషకారి అవుతుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త  యొక్క తమ్మునికి దోషకారి అవుతుంది.   

అపవాదులు
ద్వీశాద్యపాద త్రయజా కన్యా దేవర సౌఖ్యదా
మూలాంత్య పాద సార్పాద్య పాద జాతో తయోః శుభౌ - ముహూర్త చింతామణి.

విశాఖ 1,2,3 పాదాలలో జన్మించిన స్త్రీ మరిదికి మేలు చేస్తుంది. మూల చివరి పాదంలోను, ఆశ్లేష 1 వ పాదంలోను జన్మించిన స్త్రీ మామ గారికి అత్త గారికి శుభం చేస్తుంది. 

సుతః సుతావానియతం శ్వశురం హంతిమూలజః
దంత్య పాదజోనైవ తధాశ్లేషాద్య పాదజః
వత్సరాత్పితరం హంతి మాతరం తు త్రివర్షతః
ద్యుమ్నం వర్షాద్వయేనైవ శ్వశురం నవ వర్షతః
జాతం బాలం వత్సరేణ ర్షైః పంచభిరగ్రజం
శ్యాలకం చాష్టభి ర్వర్షైః అనుక్తాన్ హంతి సప్తభిః
తస్మాచ్ఛాంతిం ప్రకుర్వీత ప్రయత్నా ద్విద్ధిపూర్వకం. – నారదుడు. 

వచనాలను అనుసరించి ఆయా గండ దోషాలకు పరిమితి ఉందని, శాంతి చేసుకుంటే ఆ దోషం ఉండదని స్పష్టమవుతుంది. 

తండ్రికి దోషం సంవత్సరం లోను, తల్లికి 3 సంవత్సరాలలోను, ధనానికి 2 సంవత్సరాలలోను, మామ గారికి 9 సంవత్సరాలలోను, బాలునికి 1 సంవత్సరాలలోను, అన్నకు 5 సంవత్సరాలలోను, బావమరిదికి 8 సంవత్సరాలలోను, ఇక్కడ వివరించని వ్యక్తులకు సంబందించిన దోషం 7 సంవత్సరాలలోను, కనిపిస్తుంది. అందువలన విధిని అనుసరించి శాంతి చేసుకోవాలి. 

నక్షత్ర శాంతి చేస్తే దోషముండదని దీని భావం. దీనిని బట్టి పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగే సమయంలో మూల, ఆశ్రేష నక్షత్ర దోషాలు ప్రధానంగా ఉండేవి అని జననాది 9 సంవత్సరాల కాల పరిమితి దాటిన తరువాత ఆ దోషం ఉండదని అర్ధం అవుతుంది. 

ఈ భయాల వల్ల భవిష్యత్తులో మీరు కూడ అంద విశ్వాసాలకు బలి కావచ్చును.ఎలాగంటే మీరు కోరి మంచిదని నమ్మిన నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకున్నా ఆమెకు కలిగే శిశువు మూల,అశ్లేష,జ్యేష్ట,విశాఖ,మఖ నక్షత్రాలలో జన్మిస్తే మీరు ఆ శిశువుకి వివాహం భవిష్యత్తులో చేయగలరా?అప్పుడు శాస్త్రాన్ని నిందించి ప్రయోజనం ఉండదు.

ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించవు.నక్షత్రాలవల్ల జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు.

నక్షత్రాలపై మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యా భర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లితండ్రులకు,అక్క చెల్లెల్లకు,లేక అన్నదమ్ములకు వర్తించదు.

కాబట్టి మీరు ఏమాత్రం సంకోచం లేకుండా మిగిలిన విషయాలన్నింటికి పొంతన కుదిరితే మూడ నమ్మకాలను వదిలి వివాహం చేయవచ్చు.

జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్యా,వినయం,వివేకం,గుణం,సాంప్రదాయం,సంస్కారం,రూపం గల వదువులను విసర్జింపక మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు.

జాతకం సంబంధం రాగానే మూలా నక్షత్రం,అశ్లేష నక్షత్రం అని సంబంధం వద్దు అని అప వాక్యములు పలకకుండా విచారణ చేయమని విజ్ఞప్తి. శాస్త్రంలో ప్రతి అంశానికీ దోషం గురించి ప్రస్తావించిన గ్రంథంలో దోష పరిహారములు ప్రస్తావించలేదు. గ్రంథాలు అనేకం పరిశీలించిన తరువాత చేయవలసిన నిర్ణయాలు ఏమీ చదవకుండా చేయవద్దు అని సూచన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...