13, ఏప్రిల్ 2017, గురువారం

గృహ నిర్మాణానికి పనికి వచ్చు భాగాలు



గృహ నిర్మాణానికి పనికి వచ్చు భాగాలు

గృహ నిర్మాణ స్ధలంలో దిక్కులను సాధించి చతురస్రంగా ఉండే విధంగా సరి చేసిన తరువాత పడమర మధ్య భాగం నుండి తూర్పునకు, దక్షిణ దిక్కు భాగం నుంచి ఉత్తరానికి ఒక సూత్రాన్ని కట్టగా నాలుగు భాగాలు వస్తాయి. తూర్పు వైపు సూత్రానికి బ్రాహ్మ్యమ మని, పడమర వైపు సూత్రానికి యామ్య మని పేర్లు. 

శ్లో:- మానుష్య మాధయామ్యంచ దైవ మాసుర మేవచ |
ఐశాన్యాది పదానాంచ నామాన్యేవం విధుర్భుధాః ||

నాలుగు భాగాలను ఈ  విధంగా పిలుస్తారు. ఈశాన్య భాగానికి మానుషమని, ఆగ్నేయానికి యామ్యమని, నైఋతి భాగానికి దైవమని, వాయువ్య భాగానికి అసురమని పేర్లు. 


మానుష భాగం, దైవభాగం గృహ నిర్మాణానికి ఉపకరిస్తాయి. యామ్య, అసుర భాగాలు గృహ నిర్మాణానికి అనుకూలం కాదు. 

షోడశ పద విభాగంలో దిక్సాధన చేసి చతురస్త్రంగా చేసిన భూమిని సూత్ర స్ఫాలన చేసినప్పుడు నాలుగు భాగాలు అవుతాయి. ఆ నాల్గింటిని తిరిగి ఒక్కొక్క దానిని నాలుగు భాగాలు చేస్తే 16 భాగాలు అవుతాయి. 

శ్లో:- అధవా సమ చతురశ్రం షోడశ పదమేవ కల్పయేతేత్రమ్ |
తత్రచ నైరుట నిరృతౌ మందిర ముదితంచ దైవీకే ఖండే |
నిరృతా వీశే కుర్యా దీశానాం తదుత్తమం స్ధానమ్ |
మానుష్యే పిచఖండే నిరృతి పదం వేశ్మ యోగ్య మేవ భవేత్ |

పదహారు భాగాలు చేయగా వచ్చిన భాగాలలో (1) అంకె గల భాగానికి మానుష మానుషం అని, (2) అంకె గల భాగానికి మానుష దైవం అని, (3) అంకె గల భాగానికి దైవ మానుషం అని, (4) వ అంకె గల భాగానికి దైవ దైవమని పేర్లు. 

స్ధలాన్ని విభజించినప్పుడు ఈశాన్య భాగంలో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్య దిక్కులకు భాగాలు ఏర్పడ్డాయి. నాలుగు ఖండాలుగా చేసినప్పుడు  ఈశాన్య ఖండాన్ని మానుష భాగం అని, మానుష భాగంలో మొదటిది మానుష మానుషం (ఈశాన్యంలో ఈశాన్యం), (2) ది మానుష దైవం ( ఈశాన్యంలో నైరుతి). ఈ రెండు భాగాలలోనూ గృహ నిర్మాణం చేయవచ్చును. ఈశాన్యంలోని ఆగ్నేయ వాయువ్య భాగాలలో గృహ నిర్మాణం చేయకూడదు. 

నాలుగు ఖండాలుగా చేసినప్పుడు  నైరుతి భాగాన్ని దైవ భాగంగా పిలుస్తారు. దైవంలో దైవం ( నైరుతిలో నైరుతి), దైవంలో మానుషం (నైరుతిలో ఈశాన్యం) లోనూ గృహ నిర్మాణం చేయవచ్చును. మిగిలిన నైరుతిలోని ఆగ్నేయ, వాయువ్య దిక్కుల్లో గృహ నిర్మాణం చేయకూడదు. 

పై విషయాలను బట్టి చతురస్త్రంగా చేయబడిన స్ధలంలో ఆగ్నేయ, వాయువ్య దిక్కులు పూర్తిగా గృహ నిర్మాణానికి పనికి రావు. ఈశాన్య, నైఋతి దిక్కులలోని భాగాలే పనికి వచ్చును.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...