గృహార్వణం - సింహాద్వార నిర్ణయం
గృహ సింహాద్వారం ఏ దిశనున్నను స్ధలమునకు తూర్పున కట్టిన ఇల్లు తూర్పు ఇల్లు అనియు, పశ్చిమమున కట్టిన ఇల్లు పశ్చిమ ఇల్లు అనియు, ఉత్తరమున కట్టిన ఇల్లు ఉత్తర ఇళ్లనియు, దక్షిణమున కట్టిన ఇల్లు దక్షిణ ఇల్లు అనియు నిర్మించిన గృహములు వ్యతిరేక ఫలములను నిచ్చుచున్నవి.
మరికొంత మంది పండితులు తూర్పు సింహాద్వారం కల ఇల్లు తూర్పు గృహమని, దక్షిణ సింహాద్వారం కల ఇల్లు దక్షిణ ఇల్లు అని, పడమర సింహాద్వారం కల ఇల్లు పడమర ఇల్లు అని, ఉత్తర సింహాద్వారం కల ఇల్లు ఉత్తర ఇల్లు అని సింహాద్వారమును బట్టి గృహమును నిర్ణయించుచున్నారు. ఇట్లు కట్టించిన గృహములు వ్యతిరేక ఫలితాలనే ఇస్తాయి.
ఉదాహరణకు “య” వర్గు వారికి ఉత్తరం స్వవర్గు అవుతుంది. స్వవర్గు కనుక ఉత్తర సింహా ద్వారం పెట్టి కట్టించుచున్నారు. అలా కట్టించటం వలన ఆ గృహం శత్రు గృహం అగుచున్నది. అందు ఉన్న యజమానికి శత్రు, ప్రాణ, ధన భయాలు కలుగుచున్నవి.
సూత్రం:- నరస్యేదిక్ తదానుగమనే |
తద్దిశేత్ గృహ నామం భవేత్ |
గృహ యజమాని ఏ దిశగా తన గృహమునందు ప్రవేశించునో ఆ దిశ గృహనామమేర్పడుతున్నది. తూర్పు సింహద్వారమైనప్పుడు ఆ గృహ యజమాని పశ్చిమ ముఖంగా ప్రవేశించును గాన ఆ గృహం పశ్చిమ ఇల్లు అగుచున్నది. మరియు వాస్తు పురుషుని దృష్టి ప్రసరించువైపున ద్వారం పెట్టవలెను.
పశ్చిమముగా దృష్టి ఉన్న ద్వారం వల్ల తూర్పు ఇల్లు అయినది. దక్షిణముగా దృష్టి ప్రసరించుచున్నప్పుడు దక్షిణ సింహాద్వారం పెట్టిన ఉత్తర ఇల్లు అగును.
వర్గురీత్యా ద్వారా నిర్ణయం
గృహ యజమాని పేరు నందలి మొదటి అక్షరమును అనుసరించి అతడే వర్గునకు చెందినవాడో గ్రహించి ఆయా వర్గులవారికి శుభప్రదమని నిర్దేశించబడిన ఆయా ముఖ ద్వారం ఉంచవలెను.
అ, క, చ వర్గులకు పశ్చిమ ద్వారం
ట వర్గునకు పశ్చిమ, ఉత్తర ద్వారాలు
త, ప వర్గులకు ఉత్తర ద్వారం
య, శ వర్గులకు తూర్పు, దక్షిణ ద్వారాలు శ్రేష్ఠం.
రాశి రీత్యా ద్వార నిర్ణయం
కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి తూర్పు ద్వారం, పడమర ఇల్లు.
వృషభ తుల, కుంభ రాశుల వారికి దక్షిణ ద్వారం, ఉత్తరపు ఇల్లు.
మిధున, కన్య, మకర రాశుల వారికి పశ్చిమ ద్వారం, తూర్పు ఇల్లు.
మేష, సింహా, ధనస్సు రాసుల వారికి ఉత్తరద్వారం, దక్షిణ ఇల్లు
గృహ యజమాని వర్గునకు, నామరాశికి యోగ్యమగు ముఖ ద్వారమును నిర్ణయించుట సర్వశ్రేష్ఠం. అట్లు సాధ్యపడనిచో వర్గునకు గాని లేదా నామరాశికి గాని యోగ్యమగు ముఖద్వారమును నిర్ణయించవచ్చును.
ఉదాహరణకు :- తూర్పు ముఖ ద్వారం:- “అ” వర్గువారికి తూర్పు ముఖ ద్వారం పడమటి ఇల్లు నిషేదం. అయినను “ అ” అను అక్షరం మేష రాశికి చెందినది కాబట్టి “అ” అను పేరులోని ప్రదమాక్షరం కలిగిన వారు మాత్రమే తూర్పు ముఖ ద్వారమును మధ్యమ పక్షంగా గ్రహింపవలెను. “త” వర్గు వారికి తూర్పు ముఖ ద్వారం పనికి రాదు. కాని “త” వర్గు నందలి ద, న అక్షరములు పేరులోని ప్రదమాక్షరాలుగా గలవారికి రాశి రీత్యా తూర్పు ముఖ ద్వారం అర్వణమే అవుతుంది. “త ” అను అక్షరం పేరులో ప్రదమాక్షరంగా కల వ్యక్తికి వర్గు రీత్యా పడమర స్వవర్గు అవుతుంది. కాబట్టి పడమర ఇల్లు, తూర్పు ముఖ ద్వారం నిర్మించవచ్చును.
అయమును అనుసరించి ద్వారా నిర్ణయం
ద్వజాయం, ధూమాయం, సింహాయం, శ్వానాయం, వృషభాయం, ఖరాయం, గజాయం, కాకాయం. ఇందు ధ్వజాయం, సింహాయం, వృషభాయం, గజాయం అను నాలుగు ప్రశస్తమైనవి.
ధ్వజాయం:- ధ్వజాయం గల గృహమునకు నాలుగు దిక్కులయందు ముఖ ద్వారములు ఉంచవచ్చును.
సింహాయం:- సింహాయం గల గృహమునకు ఉత్తర ముఖ ద్వారం మాత్రమే శ్రేష్ఠమైనది.
వృషభాయం:- వృషభాయం గల ఇంటికి తూర్పు ముఖద్వారం మాత్రమే శ్రేష్ఠమైనది. మిగిలిన దిక్కుల యందు ముఖ ద్వారం నిషిద్ధం.
గజాయం:- గజాయం గల ఇంటికి తూర్పు సింహా ద్వారం గాని, దక్షిణ సింహా ద్వారం గాని నిర్మించుట శుభప్రదం.
ఉత్తరం ఇంటికి వృషభ, సింహాయములును, పడమటింటికి సింహాయమును, దక్షిణ ఇంటికి వృషభ, సింహాయములను ఎంతమాత్రం పనికి రాదు. అదే విధంగా పడమటింటికి రెండవ పక్షముగానైనా సింహాయమును గ్రహింపరాదు. వృషభాయం గల ఇంటికి తూర్పు ముఖ ద్వారం తప్ప మరే దిశ యందు ముఖ ద్వారం ఉంచరాదని అగస్త్య మహాముని తెలియజేసినాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి