6, ఏప్రిల్ 2017, గురువారం

జాతక చక్రంలోని గ్రహ స్ఫుటాల ఆదారంగా నవాంశ చక్ర నిర్మాణం

జాతక చక్రంలోని గ్రహ స్ఫుటాల ఆదారంగా నవాంశ చక్ర నిర్మాణం

లగ్నం ధనస్సు అగ్నితత్వ రాశి, ద్విస్వభావ రాశి. లగ్నం ధనస్సులో 11° 21' నిమిషాలలో ఉంది. సూత్రం ప్రకారం అగ్నితత్వ రాశులకు మేష రాశి నుండి గణన చేయాలి కావున మేష రాశి నుండి 11° 21' నవాంశ పట్టిక ఆధారంగా చతుర్ధ నవాంశ కర్కాటకం అవుతుంది. ద్విస్వభావ రాశులకు 5 వస్ధానం నుండి లెక్కించాలి. ధనస్సుకి 5 వస్ధానం మేషం అవుతుంది. మేషం నుండి చతుర్ధ నవాంశ కర్కాటకం అవుతుంది. నవాంశ లగ్నం కర్కాటకం.


రవి అగ్నితత్వ, ద్విస్వభావ రాశిలో ధనస్సు రాశిలో 27° 52' నిమిషాలలో ఉన్నాడు.  సూత్రం ప్రకారం అగ్నితత్వ రాశులకు మేష రాశి నుండి గణన చేయాలి కావున మేష రాశి నుండి 27° 52' నవాంశ పట్టిక ఆధారంగా నవమ నవాంశ ధనస్సు అవుతుంది. ద్విస్వభావ రాశులకు 5 వస్ధానం నుండి లెక్కించాలి. ధనస్సుకి 5 వస్ధానం మేషం అవుతుంది. మేషం నుండి నవమ స్ధానం ధనస్సు అవుతుంది. రవి నవాంశలో ధనస్సులో  ఉంటాడు.

చంద్రుడు వాయుతత్వ, స్ధిర రాశిలో కుంభ రాశిలో 07° 08' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం వాయుతత్వ రాశులకు తులా రాశి నుండి, స్ధిర రాశులకు 9 వస్ధానం నుండి గణన చేయాలి  కావున తులారాశి నుండి 07° 08' నవాంశ పట్టిక ఆధారంగా తృతీయ నవాంశ ధనస్సు అవుతుంది.. స్ధిర రాశులకు 9 వస్ధానం నుండి లెక్కించాలి కావున కుంభం నుండి 9 వస్ధానం తులరాశి అవుతుంది. తులారాశి నుండి తృతీయ నవాంశ ధనస్సు అవుతుంది. నవాంశ చక్రంలో చంద్రుడు ధనస్సులో ఉంటాడు.

కుజుడు కర్కాటక రాశిలో జలతత్వ, చర రాశిలో 11° 58' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం జలతత్వ రాశులకు కర్కాటక రాశి నుండి, చర రాశులకు అదే స్ధానం నుండి గణన చేయాలి. కావున కర్కాటక రాశి నుండి 11° 58' నవాంశ పట్టిక ఆధారంగా చతుర్ధ నవాంశ తులారాశి అవుతుంది. చరరాశులకు అదే స్ధానం నుండి లెక్కించాలి కావున కర్కాటకం నుండి చతుర్ధ నవాంశ తులా రాశి అవుతుంది. నవాంశ చక్రంలో కుజుడు తులారాశిలో ఉంటాడు. 

బుధుడు ధనస్సు రాశిలో అగ్నితత్వ, ద్విస్వభావ రాశిలో 04° 27' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం అగ్నితత్వ రాశులకు మేష రాశి నుండి గణన చేయాలి కావున మేషరాశి నుండి 04° 27' నవాంశ పట్టిక ఆధారంగా ద్వితీయ నవాంశ వృషభంఅవుతుంది. ద్విస్వభావ రాశులకు పంచమ స్ధానం నుండి లెక్కించాలి కావున మేషరాశి నుండి ద్వితీయ నవాంశ వృషభం అవుతుంది. నవాంశ చక్రంలో బుధుడు వృషభరాశిలో ఉంటాడు.

గురువు మిధునరాశిలో వాయుతత్వ, ద్విస్వభావ రాశిలో 04° 56' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం వాయుతత్వ రాశులకు తులారాశి నుండి గణన చేయాలి కావున తులారాశి నుండి 04° 56' నవాంశ పట్టిక ఆధారంగా ద్వితీయ నవాంశ వృశ్చికం అవుతుంది. ద్విస్వభావ రాశులకు పంచమ స్ధానం నుండి లెక్కించాలి కావున గురువు ఉన్న స్ధానం నుండి పంచమ స్ధానం తులారాశి. తులారాశి నుండి ద్వితీయ నవాంశ వృశ్చికం. నవాంశ చక్రంలో గురువు వృశ్చిక రాశిలో ఉంటాడు.

శుక్రుడు ధనస్సు రాశిలో అగ్నితత్వ, ద్విస్వభావ రాశిలో 25° 25' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం అగ్నితత్వ రాశులకు మేష రాశి నుండి గణన చేయాలి కావున మేషరాశి నుండి 25° 25' నవాంశ పట్టిక ఆధారంగా అష్టమ నవాంశ వృశ్చికం అవుతుంది. ద్విస్వభావ రాశులకు పంచమ స్ధానం నుండి లెక్కించాలి కావున శుక్రుడు ఉన్న స్ధానం నుండి పంచమం మేషం అవుతుంది. మేష రాశి నుండి అష్టమ నవాంశ వృశ్చికం. నవాంశ చక్రంలో శుక్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు.

శనిగ్రహం సింహారాశిలో భూతత్త్వ, స్ధిర రాశిలో 06° 06' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం భూతత్వ రాశులకు మకర రాశి నుండి గణన చేయాలి కావున మకరరాశి నుండి  06° 06' నవాంశ పట్టిక ఆధారంగా ద్వితీయ నవాంశ కుంభరాశి అవుతుంది. స్దిర రాశులకు నవమం నుండి లెక్కించాలి కావున శని ఉన్న స్ధానం నుండి నవమం మేషం అవుతుంది. మేష రాశి నుండి ద్వితీయ నవాంశ వృషభం అవుతుంది. నవాంశ చక్రంలో శనిగ్రహం వృషభరాశిలో ఉంటాడు.

రాహువు కన్యారాశిలో భూతత్త్వ, ద్విస్వభావ రాశిలో 15° 38' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం భూతత్వ రాశులకు మకర రాశి నుండి గణన చేయాలి కావున మకరరాశి నుండి  15° 38' నవాంశ పట్టిక ఆధారంగా పంచమ నవాంశ వృషభం అవుతుంది. ద్విస్వభావ రాశులకు పంచమ స్ధానం నుండి లెక్కించాలి కావున రాహువు ఉన్న స్ధానం నుండి పంచమం మకరం అవుతుంది. మకరరాశి నుండి పంచమ నవాంశ వృషభం అవుతుంది. నవాంశ చక్రంలో రాహువు వృషభరాశిలో ఉంటాడు.


కేతువు మీనరాశిలో జలతత్త్వ, ద్విస్వభావ రాశిలో 15° 38' నిమిషాలలో ఉన్నాడు. సూత్రం ప్రకారం జలతత్వ రాశులకు కర్కాటక రాశి నుండి గణన చేయాలి కావున కర్కాటక రాశి నుండి 15° 38' నవాంశ పట్టిక ఆధారంగా పంచమ నవాంశ వృశ్చికం అవుతుంది. ద్విస్వభావ రాశులకు పంచమ స్ధానం నుండి లెక్కించాలి కావున కేతువు ఉన్న స్ధానం నుండి పంచమం కర్కాటకం అవుతుంది. కర్కాటక స్ధానం నుండి పంచమ నవాంశ వృశ్చికం. నవాంశ చక్రంలో కేతువు వృశ్చికరాశిలో ఉంటాడు.

గ్రహాలు నవాంశ చక్రంలో వరుసగా
నవాంశ లగ్నం కర్కాటకరాశి
నవాంశలో రవి ధనస్సురాశి
నవాంశలో చంద్రుడు ధనస్సురాశి
నవాంశలో కుజుడు తులారాశి
నవాంశలో బుధుడు వృషభరాశి
నవాంశలో గురువు వృశ్చికరాశి
నవాంశలో శుక్రుడు వృశ్చికరాశి
నవాంశలో శనిగ్రహం వృషభరాశి
నవాంశలో రావువు వృషభరాశి
నవాంశలో కేతువు వృశ్చికరాశి 
లగ్న నవాంశ కర్కాటకం, చంద్ర నవాంశ ధనస్సు.

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...