28, ఏప్రిల్ 2017, శుక్రవారం

వృషభ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల యొక్క ఫలితములు

వృషభ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల యొక్క ఫలితములు

రాశి చక్రములో రెండవ రాశి వృషభము. మీ కుండలిలో లగ్న భావములో ఈ రాశి వుండిన ఎడల మీ లగ్నము వృషభముగా చెప్పబడును. మీ లగ్నముతో బాటు మొదటి స్థానములో ఏ గ్రహమైతే వున్నదో అది మీ లగ్నమును ప్రభావితము చేయును.
వృషభ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

ఈ లగ్నములో సూర్యుడు కారక గ్రహము మరియు చతుర్ధాధిపతి కాగలడు . లగ్న భావములో సూర్యుడు వారి శత్రువైన శుక్రుని రాశిలో స్థితిలో వుండి శుభ ఫలితములలో లోపములను కలిగించును. తల్లి దండ్రుల నుండి వీరికి సామాన్య సుఖము లభించును. ప్రభుత్వ రంగము నుండి కూడా వీరికి సామాన్యముగా వుండును. సప్తమ బావములో సూర్యుని దృష్టి వుండుట కారణముగా జీవిత బాగస్వామితో మతబేదములు దాంపత్య జీవితములో అశాంతి కష్టములు కలుగును. ద్విపత్నీ యోగమును కూడా కలిగించును. ఉద్యోగములో అస్థిరత్వము మరియు సహోద్యోగులతో సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. ఈ లగ్నములో ప్రధమ బావములో సూర్యుడు వుండుట కారణముగా చాలా తక్కువ వయస్సులోనే తలవెండ్రుకలు రాలిపోవును.

వృషభ లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు ఈ లగ్నములో ఉచ్చ స్ధితిలో వుండుట కారణముగా ఇది సాదారణముగా ఉత్తమ ఫలితములను ఇచ్చును. లగ్నస్థ చంద్రుని ప్రభావము కారణముగా మనోభలము మరియు ఆత్మ భలము ఎల్లప్పుడూ వుండును. బంధు మిత్రుల నుండి సమ్యోగము మరియు సుఖము ప్రాప్తించగలదు. మాట్లాడే పద్దతి మధురతతో కూడినదై వుండును. చంద్రుడు పూర్ణ దృష్టి నుండి సప్తమ బావమును చూస్తున్నాడు. చంద్రుని ఈ దృష్టి జీవిత బాగస్వామి విషయములో ఉత్తమ పరిణామ దాయకముగా వుండును. జీవిత భాగస్వామి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వైవాహిక జీవితము సామాన్య రూపముగా సుఖ మయముగా వుండును. ఆర్ధిక స్థితి బాగుండును.

27, ఏప్రిల్ 2017, గురువారం

మేష లగ్నములో లగ్నస్థ గ్రహముల యొక్క ఫలితములు

మేష లగ్నములో లగ్నస్థ గ్రహముల యొక్క ఫలితములు

మేష లగ్నము యొక్క అధిపతి కుజుడు. ఈ లగ్నములో కుజుడు లగ్నాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండును. గురువు, సూర్యుడు, చంద్రుడు ఈ లగ్నములో కారక గ్రహము యొక్క భూమికత్వమును నిర్వహించును. బుధుడు, శుక్రుడు మరియు శని మేష లగ్నములో అకారకమైన మరియు అశుభ గ్రహము యొక్క ఫలితములను ఇచ్చును. కుండలిలో లగ్న భావములో స్థితిలో వుండి గ్రహములు జీవితాంతము వ్యక్తిని ప్రభావితము చేయును.

మేష లగ్నములో లగ్నస్థ సూర్యుని యొక్క

మేష లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు పంచమ బావము యొక్క అధిపతి  కాగలడు. త్రికోణమునకుఅధిపతి  అగుట వలన సూర్యుడు వీటికి శుభ కారక గ్రహము కాగలడు. లగ్నములో సూర్యుని యొక్క ఉచ్చస్థితిలో వ్యక్తి అందముగాను, ఆకర్షణీయముగాను వుండును. వీరిలో స్వాభిమానము మరియు ఆత్మ విశ్వాసము వుండును. విధ్య యొక్క స్థితి బాగుండును. జీవిత సరళిలో తండ్రితో వివాదములు కలిగే అవకాశములు వున్నవి. ఆర్ధిక స్థితి బాగుండును. సూర్యుడు పాప గ్రహములతో పీడించబడని ఎడల ప్రభుత్వము మరియు ప్రభుత్వ పక్షము నుండి లాభము కలుగుటకు అవకాశములు వుండును. సూర్యుని ప్రభావము వలన సంతాన సుఖము ప్రాప్తించగలదు. సూర్యుడు తన యొక్క పూర్ణ దృష్టిని సప్తమ బావములో స్థితిలో వున్న శుక్రుని తులా రాశిని చూస్తున్నాడు. దీని ప్రభావము కారణముగా అందమైన జీవిత భాగస్వామి లభించగలడు. జీవిత భాగస్వామి నుండి సమ్యోగము లభించగలదు. కాని కొన్ని సమయములలో గృహస్థ జీవితము బాదించబడును.

22, ఏప్రిల్ 2017, శనివారం

గృహార్వణం - సింహాద్వార నిర్ణయం

గృహార్వణం - సింహాద్వార నిర్ణయం

గృహ సింహాద్వారం ఏ దిశనున్నను స్ధలమునకు తూర్పున కట్టిన ఇల్లు తూర్పు ఇల్లు అనియు, పశ్చిమమున కట్టిన ఇల్లు పశ్చిమ ఇల్లు అనియు, ఉత్తరమున కట్టిన ఇల్లు ఉత్తర ఇళ్లనియు, దక్షిణమున కట్టిన ఇల్లు దక్షిణ ఇల్లు అనియు నిర్మించిన గృహములు వ్యతిరేక ఫలములను నిచ్చుచున్నవి.   

మరికొంత మంది పండితులు తూర్పు సింహాద్వారం కల ఇల్లు తూర్పు గృహమని, దక్షిణ సింహాద్వారం కల ఇల్లు దక్షిణ ఇల్లు అని, పడమర సింహాద్వారం కల ఇల్లు పడమర ఇల్లు అని, ఉత్తర సింహాద్వారం కల ఇల్లు ఉత్తర ఇల్లు అని సింహాద్వారమును బట్టి గృహమును నిర్ణయించుచున్నారు. ఇట్లు కట్టించిన గృహములు వ్యతిరేక ఫలితాలనే ఇస్తాయి.

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

వాస్తు శాస్త్రరీత్యా క్షేత్రార్వాణ నిర్ణయం



క్షేత్రార్వాణం 

అర్వాణం అంటే యోగ్యమైనది, తగినది, లాభదాయకమైనది. అని అర్ధం చెప్పవచ్చు. క్షేత్రార్వాణం అంటే నిర్మాణాలకు అనుకూలమైన క్షేత్రాన్ని యజమాని యొక్క వర్గుణకు లేదా నామరాశికి అశుభ ఫలితాలను ఇచ్చే దిక్కులను ఎన్నుకోవాలి.   

శ్లో:- క్షేత్రస్యాకచటాః క్రమాతపయశా వర్గాస్స్యురష్టౌ స్ధితాః
ప్రాగాదౌఖగరాడ్బిడాల మృగరాట్చ్వహ్యాఖునాగశ్శశః
స్యాద్వర్గాద్యది పంచామోరి రధదిగ్వర్గేషు యోని స్త్రీయమ్
దౌదౌదిక్షు విదిక్షు చైక మఖిలం మేషాది పూర్వాదితః 

19, ఏప్రిల్ 2017, బుధవారం

వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత



వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత 

        భారతీయ సాంప్రదాయంలో వివాహం జీవితంలో ఒకే ఒకసారి జరిగే అతి ముఖ్యమైన అంశం. వివాహం అనంతరం భార్యా భర్తలు జీవితాంతం కలసి ఉండే విధంగా జాతకాదులు పరిశీలించాలి. వివాహ విషయంలో కేవలం వధూవరుల గుణమేళన పట్టికలోని గుణాలను మాత్రమే పరిశీలించటమే కాకుండా, మిగతా అంశాలైన సప్తమ స్ధానం, పంచమ స్ధానం, వివాహానంతర దశలు మొదలగు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలెను. 

17, ఏప్రిల్ 2017, సోమవారం

గ్రహాలు - వక్రత్వం

గ్రహాలు - వక్రత్వం

గ్రహాలు కొన్నాళ్ళు వేగంగాను, కొన్నాళ్ళు స్తంభనలోను, కొన్నాళ్ళు వక్రంగా సంచరించును. భూమితో పాటు గ్రహాలన్నీ సూర్యుని చుట్టు తిరుగుచున్నవి. గ్రహాలు సూర్యుని చుట్టు తిరుగుతున్నప్పుడు సూర్యుని అవతలకి వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్నవారికి గ్రహాలు కనిపించవు.  ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. భూమి కూడా తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి గాని, ఇతర గతులు గాని ఉండవు. కానీ భూమి మీద ఉన్న పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒకొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి వెనుకకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది.

15, ఏప్రిల్ 2017, శనివారం

గ్రహాలకు మిత్ర, శతృ, సమత్వాల పరిశీలన

గ్రహాలకు మిత్ర, శతృ, సమత్వాల పరిశీలన

శుభ్ర గ్రహములు : గురువు, శుక్రుడు , పూర్ణ చంద్రుడు, బుధుడు(శుభులతో
కలసిన శుభుడు)

పాప గ్రహములు: రవి, కుజ, శని, రాహు, కేతువు, క్షీణ చంద్రుడు,
బుధుడు(పాపులతో కలసిన పాపి).


13, ఏప్రిల్ 2017, గురువారం

వాస్తురీత్యా వంటశాల నిర్మాణం



వాస్తురీత్యా వంటశాల నిర్మాణం 

ఆహారం పుష్టికరంగా శుచిగా ఉండాలి. ఆహారాన్ని దోషరహితంగా తయారు చేయటంలో వంటశాలలకు అధికమైన ప్రాధాన్యత ఉంది. వంటశాల తగినంత వెలుతురు, గాలి ప్రసరించునట్లుగా నిర్మించవలెను. వండిన ఆహార పదార్ధాలకు దృష్టి దోషం తగలకుండా వంటశాల ఇంటికి వెనుకవైపు (పృష్ట భాగం)  పెరడులో నిర్మించాలి. ఇంటిలోని వారు, స్త్రీలు వంట పనులు నిర్వర్తించటానికి వంటశాల గృహం లోపలి భాగంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. 

ఏ దిక్కున సింహాద్వారం ఉన్న గృహానికైనా ఆగ్నేయంలో వంటశాల ఉండాలనే మాట శాస్త్ర విరుద్ధం. వాస్తు పురుషుని ఊపిరితిత్తులకు చెందిన భాగమైన సింహాద్వారము ముందు గల ఖాళీ స్ధలములో ఆగ్నేయ కోణంలో వంటశాలలు నిర్మించుట శాస్త్ర విరుద్ధాలు. 

శ్లో:- యమదిశి భోజన శాల సోమే ధన సంచాయా వాసమ్
ఆగ్నౌ ధాన్యాగారం ఖే వక్తీర్వ్యం జనాని తత్రైవ
ఆరాధన గృహ మిశేకూపం తత్రోదితం స్నానమ్
యాస్మిన్ యదుక్త ముచితం అన్యా విహి తత్ర సంప్ర యోజ్యాని   

దక్షిణంలో భోజన శాల, ఆగ్నేయంలో ధాన్యశాల, తూర్పు ఆగ్నేయాల మధ్యలో అంతరిక్ష పదంలో వంటశాల, ఈశాన్యంలో పూజాగృహం, స్నాన గృహం, నుయ్యి నిర్మించాలి.

గృహ నిర్మాణానికి పనికి వచ్చు భాగాలు



గృహ నిర్మాణానికి పనికి వచ్చు భాగాలు

గృహ నిర్మాణ స్ధలంలో దిక్కులను సాధించి చతురస్రంగా ఉండే విధంగా సరి చేసిన తరువాత పడమర మధ్య భాగం నుండి తూర్పునకు, దక్షిణ దిక్కు భాగం నుంచి ఉత్తరానికి ఒక సూత్రాన్ని కట్టగా నాలుగు భాగాలు వస్తాయి. తూర్పు వైపు సూత్రానికి బ్రాహ్మ్యమ మని, పడమర వైపు సూత్రానికి యామ్య మని పేర్లు. 

శ్లో:- మానుష్య మాధయామ్యంచ దైవ మాసుర మేవచ |
ఐశాన్యాది పదానాంచ నామాన్యేవం విధుర్భుధాః ||

నాలుగు భాగాలను ఈ  విధంగా పిలుస్తారు. ఈశాన్య భాగానికి మానుషమని, ఆగ్నేయానికి యామ్యమని, నైఋతి భాగానికి దైవమని, వాయువ్య భాగానికి అసురమని పేర్లు. 

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

సంఖ్యాసూచిక నవాంశలు



సంఖ్యాసూచిక నవాంశలు 


64 వ నవాంశ 

చంద్ర స్పుటాన్ని చంద్రుడు ఉన్న స్ధానం నుండి అష్టమంలో పెట్టగా అది ఎన్నో నవాంశ అయినదో ఆ నవాంశాధిపతిని 64 వ నవాంశాధిపతి అంటారు. అదే విధంగా లగ్న స్ఫుటాన్ని లగ్నం నుండి అష్టమంలో పెట్టగా అది ఎన్నో నవాంశ అయినదో ఆ నవాంశాధిపతిని కూడా లగ్నం నుండి నవాంశ అధిపతి అంటారు. ఈ అధిపతిని మారకం ఇచ్చే గ్రహం అంటారు. ఈ గ్రహం యొక్క దశ, అంతర్ధశలలో వ్యక్తికి మృత్యుతుల్య కష్టాలు ఉంటాయి. ఒక గ్రహము యొక్క 64 వ నవాంశ గ్రహ స్ధితి నుండి 8 వ రాశిలో ఉంటుంది. 

జాతకపారిజాతములో 64 నవాంను చంద్రుడి నుండి, బృహత్ పరాశర హోరాశాస్త్రములో చంద్రుడు మరియు లగ్నం నుండి, ప్రశ్న మార్గ్ లో చంద్రుడి నుండి, మరియు లగ్నం, రవి నుండి కూడా పరిశీలించవలెనని తెలుపబడినది. 

22 వ ద్రేక్కాణాధిపతి, 64 వ నవాంశాధిపతి ఒక్కరే అయిన లేక వేర్వేరు గ్రహాలు అయిన అవి బిందురహిత రాశిలో సంచరిస్తున్నప్పుడు మరియు అవి సంచరించు కక్ష్య ఖర గ్రహము యొక్క స్వకక్ష్య అయిన మరణం తధ్యం. ఛిద్ర గ్రహాల దశలలో గోచారం సంభవించిన ఎక్కువ ప్రమాదకరం. 

లగ్న నవాంశ నుండి లేక చంద్ర నవాంశ నుండి 64 వ నవాంశపై గోచార చంద్రుడు సంచరించు సమయంలో లేక 64 వ నవాంశ రాశి, నవాంశ లగ్నం అయిన ఈ లగ్నంపై గోచార చంద్రుడు సంచరించు సమయంలో మరణం సంభవించగలదని జాతకదేశ మార్గం అను గ్రంధంలో ఉన్నది. 

6, ఏప్రిల్ 2017, గురువారం

జాతక చక్రంలోని గ్రహ స్ఫుటాల ఆదారంగా నవాంశ చక్ర నిర్మాణం

జాతక చక్రంలోని గ్రహ స్ఫుటాల ఆదారంగా నవాంశ చక్ర నిర్మాణం

లగ్నం ధనస్సు అగ్నితత్వ రాశి, ద్విస్వభావ రాశి. లగ్నం ధనస్సులో 11° 21' నిమిషాలలో ఉంది. సూత్రం ప్రకారం అగ్నితత్వ రాశులకు మేష రాశి నుండి గణన చేయాలి కావున మేష రాశి నుండి 11° 21' నవాంశ పట్టిక ఆధారంగా చతుర్ధ నవాంశ కర్కాటకం అవుతుంది. ద్విస్వభావ రాశులకు 5 వస్ధానం నుండి లెక్కించాలి. ధనస్సుకి 5 వస్ధానం మేషం అవుతుంది. మేషం నుండి చతుర్ధ నవాంశ కర్కాటకం అవుతుంది. నవాంశ లగ్నం కర్కాటకం.

4, ఏప్రిల్ 2017, మంగళవారం

నవాంశవర్గ చక్ర నిర్మాణ పద్ధతి

నవాంశవర్గ చక్ర నిర్మాణ పద్ధతి 

రాశిలో 9 వ భాగమును నవాంశ అంటారు. రాశి పరిమాణం 30 డిగ్రీలు ఉంటుంది. దీనిని తొమ్మిది భాగాలు చేయగా 3డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. ఒక నవాంశ అంటే 3° 20' ఒక నక్షత్ర పాదం. ఒక రాశిలో 9 నవాంశలు ఉంటాయి. రాశి చక్రంలో మొత్తం 108 నవాంశలు ఉంటాయి. నవాంశ వర్గ చక్రాన్ని స్ధూల మరియు సూక్ష్మ పరిశీలనకు ఉపయోగిస్తారు. రాశి చక్రములో ఉన్న గ్రహాలు నవాంశ చక్రములో బాగుంటేనే ఆ గ్రహము యొక్క ఫలితాన్ని పొందుతారు. రాశి చక్రములో యోగం ఉన్నప్పుడు ఆ యోగ కారక గ్రహాలు నవాంశలో మంచి స్ధితిలో ఉంటేనే ఆ యోగాన్ని పొందుతారు. గ్రహాల యొక్క అంతర్గత శక్తిని ఈ నవాంశ వర్గ చక్రం ద్వారా పరిశీలించవచ్చును. నవాంశ చక్రములో గ్రహ దృష్టులు, యోగాలను చూడరాదు. గ్రహాలు స్వక్షేత్రం, మిత్ర క్షేత్రం, ఉచ్చలలో ఉన్నాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవలెను. రాశి చక్రంలోని లగ్నం నవాంశ లగ్నానికి షష్టాష్టకం అయిన అశుభ ఫలితాలను ఇస్తుంది.  గ్రహాలు కూడా నవాంశ లగ్నానికి షష్టాష్టకం అయిన అశుభ ఫలితాలను ఇస్తుంది. 

1, ఏప్రిల్ 2017, శనివారం

మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు



మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు

శ్వశ్రూవినాశ మహిజౌ సుతరాం విధత్తః
కన్యాసుతే నిరృతిజౌ శ్వశురం హతశ్చ
జ్యేష్ఠా భజాత తనయా స్వధవాగ్రజంచ
శక్రాగ్ని జా భ్వతి దేవర నాశకర్త్రీ  - ముహూర్త చింతామణి.

మూలలో జన్మించిన కన్య, సుతుడు మామగార్కి దోషాన్ని కలిగిస్తాడు. ఆశ్లేష జన్మించిన కన్య, సుతుడు అత్తగారికి దోషాన్ని కలిగిస్తాడు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...