30, డిసెంబర్ 2017, శనివారం

కేతుగ్రహ దోష నివారణకు గణేష్ శంఖం

కేతుగ్రహ దోష నివారణకు గణేష్ శంఖం

గణేష్ శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది. గణేష్ శంఖం గణపతి ఆకారాన్ని కలిగి ఉంటుంది. కేతుగ్రహానికి అధిపతి గణపతి. అందుకే జాతకంలో కేతువు అనుకూలంగా లేకపోతే గణపతిని పూజించాలి. 

29, డిసెంబర్ 2017, శుక్రవారం

జాతకచక్రంలో చతుర్ధ భావ విశ్లేషణ

జాతకచక్రంలో చతుర్ధ భావ విశ్లేషణ


చతుర్ధ భావాన్నే మాతృభావం అంటారు. మమకారం చూపించేవారిని (తల్లి లేదా తండ్రి), పితృ ధనం, ఆయుర్ధాయం, జలోపద్రవాలు, సముద్రయానం, శయనం, స్ధాన చలనం, ఆరోగ్యం, సాదారణ విద్య, గృహం, సుఖం, వాహనం, స్ధిరాస్ధులు, భార్య చేసే వృత్తి ద్వారా వచ్చే ధనం, వ్యవసాయం, ఉద్యోగంలో కష్టాలు, విదేశాలలో బహిష్కరణకు గురి కావటం, గుండెజబ్బులు, మనస్సుపై ప్రభావం, మనిషి ప్రవర్తన, వ్యక్తికి స్ధిరత్వం, ఆస్తులు, వాహనాల స్ధిరత్వం, స్ధిరమైన విద్య, సేవకుల యొక్క స్ధిరత్వం, అన్నీ విషయాలకు స్ధిరత్వాన్ని ఈ భావంలో చూడచ్చు. సేవకులపై అజమాయిషీ, వాహన ప్రమాదాలు, గౌరవం, హోదా, విద్య ద్వారా అభివృద్ధి, ఆదాయ నష్టాలు, పూర్వజన్మలో చేసిన పాప కర్మలు, సంతాన అరిష్టాలు, మానసిక ప్రశాంతత, ఎదుగుదల, విశేషమైన చరాస్ధులు కలిగి మనో చింతనలు ఎక్కువగా ఉండచ్చును. ఈ స్ధానం పాడైతే మానసిక ఆందోళనలు, తల్లికి దురదృష్టం, ఆస్తుల విషయంలో చిక్కులు, చిన్నతనంలోనే తల్లిని కోల్పోవుట జరుగును. 

28, డిసెంబర్ 2017, గురువారం

గ్రహాలు కలుగజేయు వాత, పిత్త, కఫ, సన్నిపాత లక్షణాలు

గ్రహాలు కలుగజేయు వాత, పిత్త, కఫ, సన్నిపాత లక్షణాలు 

రవి గ్రహం:- గ్రీష్మ ఋతువులో  పిత్తం ఎక్కువగా వాతం అల్పంగా ఉంటుంది.
చంద్ర గ్రహం:- వర్ష ఋతువులో వాతం అధికంగా కఫం అల్పంగా ఉంటుంది.
కుజ గ్రహం :- గ్రీష్మ ఋతువులో  పిత్తం ఎక్కువగా ఉంటుంది.
బుధుడు :- శరత్ ఋతువులో వాత, పిత్త, కఫ లక్షణాలు కలిగి ఉంటాయి.
గురువు :- హేమంత ఋతువులో కఫం అధికంగా వాతం అల్పంగా ఉంటుంది.
శుక్రుడు :- వసంత ఋతువులో వాతం అధికంగా కఫం అల్పంగా ఉంటుంది.
శని గ్రహం :- శిశిర ఋతువులో వాతం అధికంగా పిత్తం అల్పంగా ఉంటుంది. 

మహామృత్యుంజయ యంత్రం, యంత్ర లాకెట్

మహామృత్యుంజయ యంత్రం, యంత్ర లాకెట్

మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రం. దీనినే త్రయంబక మంత్రము, రుద్ర మంత్రము, మృత సంజీవని మంత్రము అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కోసం జపిస్తారు.

20, డిసెంబర్ 2017, బుధవారం

మూడమిలో పెళ్ళిచూపులు

మూడమిలో పెళ్ళిచూపులు

పూర్వకాలామృతం ప్రకారం ‘అదౌస్వేప్సిత దేవతాం గ్రహగణం సంపూజ్యకర్తుస్తదా - తారాచంద్ర బలాన్వితే శుభదినే లగ్నే శుభేవాసరే’ అని చెప్పారు.

18, డిసెంబర్ 2017, సోమవారం

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు

ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు.

శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే. ఇక విద్యల గురించి వేరే చెప్పనక్కర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.

అభిజిత్ ముహూర్తం

అభిజిత్ ముహూర్తం

మనకు తెలియని మరో నక్షత్రం!  బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణజన్మ ఖండం తొంభై ఆరో అధ్యాయంలో ఉన్న విషయం.

13, డిసెంబర్ 2017, బుధవారం

వారశూల ఏవిధంగా గ్రహించాలి

వారశూల  

ప్రయాణం నిమిత్తంగా వెళ్లేవారికి వారశూల అనేది ఒక నియమం ఏర్పరిచారు. రోజూ ప్రయాణం చేయువారు కూడా ఈ నియమం పాటిస్తే సుఖపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంగా తిరిగే వారికి పట్టింపులేదు. ఒకవేళ ఉద్యోగరీత్యా తిరిగే వారికి వారశూల నియమం పాటిస్తే విశేష కార్యలాభం వుంటుంది.

12, డిసెంబర్ 2017, మంగళవారం

వివాహ ముహూర్తాల విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలు

వివాహ ముహూర్తాల విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలు

వివాహ విషయమై ఆడపిల్లకు మూడు నవకములలోని జన్మతార గ్రాహ్యమే. అలాగే మగ పిల్లవాని విషయమై ప్రథమ నవకంలోని జన్మతార నిషేధం. కానీ, రెండు మూడు నవకములలోని జన్మతారలు గ్రాహ్యమే. ఇదే రీతిగా పెండ్లి చూపులు, నిశ్చితార్థము విషయములలో కూడా ప్రవర్తించాలి.

11, డిసెంబర్ 2017, సోమవారం

షోడశ వర్గ చక్రాల విశ్లేషణ

షోడశ వర్గ చక్రాల విశ్లేషణ 

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా బావచక్రాన్ని,నవాంశ చక్రాన్ని, షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలోని పరిశీలించాలి.ఈ షోడషవర్గుల పరిశిలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.

ఈ షోడశవర్గులే కాక జైమిని పద్దతిలోనూ, తాజక పద్దతి యందు పంచమాంశ, షష్ఠాంశ, అష్ఠమాంశ, లాభాంశ లేక రుద్రాంశ అను నాలుగు వర్గులను సూచించినారు.

జాతకచక్రంలో తృతీయ భావ విశ్లేషణ

జాతకచక్రంలో తృతీయ భావ విశ్లేషణ 

తృతీయ భావంలో సోదరులు, తోబుట్టువులు, ధైర్యం, సాహసం, దగ్గరి ప్రయాణాలు, ఆయుర్ధాయం, చిత్ర లేఖనం, గొంతు, చెవులు, బంధువులు, జన సహకారం, మిత్రులు, కమ్యూనికేషన్, కవిత్వం, మ్యూజిక్, నృత్యాలు, డ్రామా, క్రీడలలో రాణింపు (స్పోర్ట్స్), వృత్తి సేవకులు, సంతానాభివృద్ధి (పంచమానికి లాభ స్ధానం), స్వయం కృషి, స్వయం ఉపాది, స్వయం వృత్తి, శరీర పుష్టి, భుజాలు, కుడిచేయి, సవతి తల్లి, తల్లి అనారోగ్యం (చతుర్ధానికి వ్యయం), వ్యామోహాలు, కోరికలు (కామ త్రికోణం) ఉపచయ స్ధానం వంటి విషయాలను పరిశీలించవచ్చును. 

8, డిసెంబర్ 2017, శుక్రవారం

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ యంత్రం - కాలభైరవ రూపు

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ యంత్రం - కాలభైరవ రూపు

స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రాన్ని శని దోషం ఉన్నవారు, శని దశ, ఏల్నాటి శని ఉన్నవారు, పనులు ఆటంకాలు కలుగుతున్నవారు, శని సంబంధ వృత్తి, ఉద్యోగాలలో రాణించాలనుకునేవారు, ధనాభివృద్ధి కొరకు యంత్రాన్ని పూజా మందిరంలో ప్రతిష్టించుకొని పూజించు వారికి ధనాభివృద్ధితో పటు, శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. పిల్లలకు చదువులో శ్రద్ధ తగ్గుతున్న, దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు కాలభైరవ రూపు ధరించటం మంచిది.

7, డిసెంబర్ 2017, గురువారం

నవగ్రహ యంత్రాలు

నవగ్రహ యంత్రాలు

        నవగ్రహ యంత్రాలు నవగ్రహ దోషాలు ఉన్నవారు, వాస్తు దోషాలు ఉన్నవారు, వ్యాపారాబివృద్ధి కొరకు, కుటుంభాభివృద్ధి కొరకు, ధనాభివృద్ధి కొరకు పూజా మందిరంలో గాని, తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల యందు ప్రతిష్టించుకొని ధూప దీప నైవేద్యాలతో పూజించు వారికి నవగ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది.  

జాతకకర్మ సంస్కారం

జాతకకర్మ సంస్కారం

గర్బాంబు పానజోదోషః జాతాత్సర్వోపినశ్యతి''

ఈ జాతకర్మ సంస్కారముచే శిశువు గర్బమునందు, గర్భ జలపానాది దోషము నివర్తించును.

కుమారే జాతేసతి జన్మదినసమారభ్య దశదిస పర్యన్తం, దశదిన మధ్యె యస్మిన్‌ కస్మి& దిససే తజ్జాతకర్మ పుత్రవిషయే కుర్యాత్‌''

పుత్రోత్పత్తి కాలమునగాని, పదిదినములలోనే నాడేనియు లేదా పదియవ దినమందైననూ జాతకర్మ యనబడు సంస్కారము చేయదగినది, జన్మించిన శిశువునకీ కార్యముచే ఆయుర్వృద్ధి గల్గును.

5, డిసెంబర్ 2017, మంగళవారం

హస్తరేఖలలో జీవితరేఖ ప్రాముఖ్యత

హస్తరేఖలలో జీవితరేఖ ప్రాముఖ్యత
          జీవితరేఖ సాధారణముగా గురుని యొక్క గృహమునకు, ద్వితీయ కుజుని యొక్క గృహమునకు మద్యగా అంగుష్ఠం వైపు అరచేయి అంచు నుంచి (బ్రొటన వేలు, చూపుడు వేలు మద్య నుండి ప్రారంభమయ్యి ద్వితీయ కుజ, శుక్ర గృహములను ఆవరించుచూ అరచేయి అడుగు భాగమున మణి బంధనము వద్ద అంతమగు రేఖను జీవిత రేఖ, ఆయురేఖ, శక్తిరేఖ అని పిలువబడుతుంది. అన్ని రేఖలకంటే ఉత్తమమైనది. నాయకుని వంటిది. 

        ఆరోగ్య విషయములు,ఆకస్మిక ప్రమాదాలు,గండాలు, కష్టనష్టాలు, ధైర్యం, శారీరక బలం, అభివృద్ధి, అధోగతి, కీర్తి ప్రతిష్ఠలు, ఆయుర్ధాయము, ఆశ్యాలు, కోరికలు, మంచి యోగాలు జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలు జీవితరేఖ ద్వారా తెలుసుకోవచ్చును. జీవితరేఖ బలహీనమైతే మిగతా రేఖల యొక్క శక్తి సన్నగిల్లుతుంది. ఈ జీవితరేఖ సన్నగా ఉన్న, చిన్నగా ఉన్న ఆయుర్ధాయం తక్కువని అంచనా వేయరాదు. మిగతా రేఖల బలాబలాలను కూడా సమన్వయపరచి జీవితరేఖపై ఆయుర్ధాయం నిర్ణయం చేయాలి. 

      జీవితరేఖ గురు, కుజ, శుక్ర, శని, శిరోరేఖతో విడిగా ఇలా పలు విధాలుగా బయలుదేరవచ్చును. జీవితరేఖపై అడ్డు రేఖలుంటే ప్రమాదాలు జరగవచ్చును. జీవితరేఖ సంపూర్ణంగా, స్పష్టంగా, లోతుగా కాంతివంతంగా, అందంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉంటాడు. ఆదాయం, సుఖ సంతోషాలు, మంచి అబివృద్ధి ఉంటుంది. 

         జీవితరేఖపై మచ్చలు, డాగులు, అడ్డురేఖలు, గుంటలు, లంకలు, చెడు గుర్తులు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వేదిస్తుంటాయి. అనేక రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధిక నష్టాలు, నిలకడలేని జీవితం, నిలకడలేని ఆదాయంతో కష్టాలు పడుతూ ఉంటారు. 

         కుజ స్ధానమును, శుక్ర స్ధానమును పూర్తిగా చుట్టి, స్పష్టంగా, లోతుగా, కాంతివంతంగా జీవితరేఖ ఉన్నట్లయితే ఆ వ్యక్తి మంచి చురుకుదనం కలిగి మంచి ఆరోగ్యవంతుడుగా మంచి సంపాదనతో సుఖ శాంతులు అనుభవిస్తాడు. 

         జీవితరేఖ చాలా వెడల్పుగా, మోటుగా, పాలిపోయినట్లయితే అనారోగ్యాలు తొందరగా రావు. వస్తే తొందరగా వదలవు. మనిషిని పట్టి పీడిస్తాయి. పశుసంపద బాగుంటుంది. ఆదాయం ఉండదు. కూలిపని చేసి జీవిస్తారు. తరచుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితరేఖ సన్నగా ఉంటే అనారోగ్యాలు తొందరగా వస్తాయి. తొందరగా పోతాయి.   

27, నవంబర్ 2017, సోమవారం

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం, షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది.వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నవ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.

24, నవంబర్ 2017, శుక్రవారం

మార్గశిర సుబ్రహ్మణ్య షష్టి

మార్గశిర సుబ్రహ్మణ్య షష్టి
మార్గశిర సుబ్రహ్మణ్య షష్టి

ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.

20, నవంబర్ 2017, సోమవారం

గ్రహాలు - హోరఫలాలు

గ్రహాలు - హోరఫలాలు

శ్లో|| మందమారేజ్య భూపుత్ర సూర్య శుక్రేందుజేందవ్:
మదాదధ: క్రమేణస్యు: చతుర్థా దివసాధిపా:||

అన్ని కక్ష్యలకంటే పైన నక్షత్ర కక్ష్య దాని తరువాత శని కక్ష్య.
ఆ శని కక్ష్య నుండి నాల్గవ కక్ష్య సుర్య కక్ష్య కాబట్టి మొదటి వారం సూర్య(ఆది)వారము, సూర్యునికి నాల్గవ కక్ష్య చంద్ర కక్ష్య కాబట్టి రెండవ వారం చంద్ర(సోమ)వారము, చంద్రునికి నాల్గవ కక్ష్య కుజ కక్ష్య కాబట్టి మూడవ వారం కుజ(మంగళ)వారము, కుజునికి నాల్గవ కక్ష్య బుధ కక్ష్య కాబట్టి నాల్గవ వారం బుధవారము, బుధునికి నాల్గవ కక్ష్య గురు కక్ష్య కాబట్టి ఐదవ వారం గురువారము, గురునికి నాల్గవ కక్ష్య శుక్ర కక్ష్య కాబట్టి ఆరవ వారం శుక్ర(భృగు)వారము, శుక్రనికి నాల్గవ కక్ష్య శని కక్ష్య కాబట్టి ఏడవ వారం శని(మంద)వారము.

16, నవంబర్ 2017, గురువారం

అన్నప్రాశన

అన్నప్రాశన


అన్నప్రాశన ఆరో నెల ఆరవ రోజున చేయటం ఆచారం. ఆ రోజు చేసేప్పుడు ముహూర్తం అన్వేషణతో పని లేదు అని ఒక పెద్ద వాదన సంఘంలో ఉంది. అది చాలా తప్పు. ఆరవ నెల ఆరవ రోజు, అమావాస్య కానీ, మంగళవారం కానీ గ్రహణం కానీ వస్తే అన్నప్రాశన చేస్తామా? కేవలం మూఢమి పట్టింపు లేదు అన్నారు కానీ ముహూర్త పట్టింపు లేదు అనే వాదన చాలా దోష వాదన.

అన్నప్రాశన ముహూర్త ప్రభావం పిల్లవాడి జీవిత ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి.

వాస్తు పూజ తప్పక ఆచరించవలసిన విధి

వాస్తు పూజ తప్పక ఆచరించవలసిన విధి

భూమి కొనేటప్పుడు, ఇల్లు కట్టించేటప్పుడు వాస్తు చూడటమనేది చాలామంది చేస్తుంటారు. అసలీ వాస్తు అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది.. అనే విషయాలను గురించి చెబుతుంది మత్స్య పురాణం రెండువందల యాభై ఒకటో అధ్యాయం పూర్వం సూతుడు రుషులకు భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలను వివరిస్తూ వాస్తు పురుష ఉత్పత్తి, వాస్తు శబ్ధ అర్ధం, భూమి పరీక్ష లాంటివి వివరించాడు.

పూర్వం అంధకాసుర వధ సమయంలో శివుడి నుదిటి భాగం నుంచి ఒక చెమట బిందువు రాలి పడింది. క్షణాల్లో ఆ బిందువు భయంకరమైన భూతంలా మారింది. పుట్టీ పుట్టగానే ఆ భూతం తన ఎదురుగా ఉన్న అంధకాసురుడికి చెందిన అంధకులు అందరినీ తినేసింది. అయినా ఆ భూతానికి ఆకలి తీరలేదు. వెంటనే అది తన ఆకలి తీర్చమని శివుడిని గురించి భీకరమైన తపస్సు చేసింది. చాలాకాలం పాటు ఆ తపస్సు సాగాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ భూతం తనకు మూడు లోకాలను మింగేసి ఆకలి తీర్చుకోవాలని ఉందని అంది. శివుడు అలాగే కానిమ్మన్నాడు.

11, నవంబర్ 2017, శనివారం

శని ప్రదోష వ్రతం

శని ప్రదోష వ్రత గ్రంధాన్ని ఈ క్రింద ఉన్న డౌన్‌లోడ్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు.

శని ప్రదోష వ్రత గ్రంధం

శని ప్రదోష వ్రతం

సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.

మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.

9, నవంబర్ 2017, గురువారం

ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?



ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?
కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.

ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...