27, నవంబర్ 2017, సోమవారం

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం, షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది.వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నవ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.


రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన,వాతావరణం,నీరు మార్చటం వలన, రత్నధారణ వలన,జప దాన హోమాదుల వలన,ఔషదాల వలన, మంత్రోచ్ఛారణ వలన,కాస్మిక్ కిరణాల ద్వారా,కలర్ ధెరపీ ద్వారా, అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును,ముఖ్యంగా ఆదిత్య హృదయం, విష్ణు సహస్త్ర పారాయణం, దుర్గాసప్తశ్లోకి,సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.

అగ్నితత్వ రాశులైన మేషం,సింహం,ధనస్సు లగ్నాలై 6 వ భావంతో సంభందం ఉన్న రోగం వచ్చిన తట్టుకోగలరు.రోగనిరోదక శక్తి కలిగి ఉంటారు.

భూతత్వ రాసులైన వృషభం,కన్య,మకరం లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు.వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది.

వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న కుంభ రాశి మినహా మిగతా రెండు రాశుల వారికి రోగం తొందరగా నయమవ్వదు.

జలతత్వ రాశులైన కర్కాటకం,వృశ్చికం,మీన లగ్నాలై 6 భావంతో సంబంధం ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది.సులభంగా రోగాలకు లొంగిపోతారు.

లగ్నం శరీరం, 6 వ భావం రోగ స్ధానం, 6 వ భావానికి వ్యయ స్ధానం పంచమం. పంచమం 6 వ భావానికి వ్యయం కాబట్టి రోగాన్ని నాశనం చేస్తుంది.4 వ భావం రోగాన్ని వృద్ది చేస్తుంది. 6 వ భావంతో ఏర్పడిన రోగం 5 వ భావంతో రోగాలను వదిలించుకోచ్చును. లగ్నభావం 5,6 భావాలతో సంబందం ఉంటే రోగం వచ్చిన తగ్గించుకోవచ్చు.

లగ్నం 6 వ భావం కంటే 5 వ భావంతో బలంగా ఉంటే రోగాలు దరిచేరవు. లగ్నం,5 వ భావం బలంగా ఉంటే రోగం వచ్చిన పరిహార క్రియల ద్వారా రోగ నివారణ చేసుకోవచ్చు.మేషాదిగా రవి 5 వ రాశియైన సింహా రాశికి అధిపతి కనుక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం ముందు “ఆదిత్య హృదయం”సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే రోగ నివారణ జరిగి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది.

లగ్నభావం 4 వ భావంతో సంబంధం ఉంటే రోగం నయమవటం కష్టం.ఎందుకంటే 6 వ భావానికి 4 వ భావం 11 వ భావం ఉపచయం కాబట్టి.ఉపచయం అంటే అబివృద్ధి.రోగాన్ని వృద్ధి చేస్తుంది.

శని,కుజ,రాహువులు రోగాన్ని పెంచితే ,రవి,గురువు లు రోగాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...