12, అక్టోబర్ 2021, మంగళవారం

విద్యా బోధన – గ్రహాల పరిశీలన


విద్యా బోధన – గ్రహాల పరిశీలన

విద్యాబోధన అనేటటువంటిది పూర్వజన్మ సుకృతంగా చెప్పవచ్చు. బోర్డు స్కూలు ఉపాధ్యాయులు, కాలేజి లెక్చరర్సు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల స్థాయిలలో బోధించే వారి సామర్థ్యం ఈ క్రింది గ్రహస్థితులు చూపిస్తుంటాయి.

విద్యా భోదనకు సంబందించి రాశి చక్రము, నవాంశ చక్రము, దశాంశ చక్రములు పరిశీలనా పరిధిలో తీసికొనవచ్చును.

3, 5, 6, 7, 11 రాశులు అనగా మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులు జ్ఞానవంతమైన రాశులు కలవి. ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండే రాశులు.

వాయుతత్త్వరాశులు మేధాతనాన్ని చూపుతాయి.

27, సెప్టెంబర్ 2021, సోమవారం

గృహారంభ, గృహాప్రవేశ శుభ ముహూర్త నిర్ణయం


గృహారంభ, గృహాప్రవేశ శుభ ముహూర్త నిర్ణయం 

గృహారంభం

గృహారంభానికి చైత్ర వైశాఖాలు, శ్రావణ, కార్తీకాలు, మాఘ, పాల్గుణ మాసాలు శుభప్రదాలు. గురు శుక్రమౌఢ్యాలలో గృహారంభం పనికి రాదు. సూర్యుడు కృత్తికా నక్షత్రంలో నున్నప్పుడు కర్తరి గృహారంభం పనికిరాదు. భరణి 3,4 పాదాల్లోను రోహిణి మొదటి పాదంలోను సూర్యుడున్నప్పుడు గృహారంభం పనికిరాదు. మార్గశీర్ష మాసంలో గృహారంభం చేయవచ్చునని కాలామృతకారుని అభిప్రాయం.

తిథులు : విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి గృహారంభానికి శుభతిథులు. శుక్ల పక్షంలో ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమలు కూడ గృహారంభానికి యుక్తమయినవే అని కొందరిమతం.

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

పంచ మహా పురుష యోగాలు


 పంచ మహా పురుష యోగాలు

రుచక భద్రక హంసక మాలవాః సశశకాః పంచచ కీర్తితాః

స్వభావనోచ్చ గతేషు చతుష్టయే క్షితి సుతాదిషు తాన్ క్రమతా వాదేత్

రుచక మహా పురుష యోగం కుజగ్రహం ద్వారా, భద్రక మహా పురుష యోగం బుధ గ్రహం ద్వారా, హంస మహా పురుష యోగం గురుగ్రహం ద్వారా, మాలవ్య మహా పురుష యోగం శుక్రగ్రహం ద్వారా, శశక మహా పురుష యోగం శనిగ్రహం ద్వారా ఏర్పడతాయి.

రవి చంద్రులు కాక మిగిలిన గ్రహాలైన కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాల వల్ల పంచ మహా పురుష యోగాలు ఏర్పడతాయి. పంచ మహా పురుష యోగాలు ఏర్పడటానికి కొన్ని ముఖ్య సూత్రాలు అవసరమవుతాయి.

కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు లగ్నానికి గాని, చంద్రునికి గాని కేంద్రాలలో ఉండాలి. ఆ కేంద్ర స్ధానాలు స్వక్షేత్రం గాని, ఉచ్చ గాని అయి ఉండాలి.

19, మే 2021, బుధవారం

గ్రహమైత్రీ విశ్లేషణ - గ్రహరాజ్యం

 

గ్రహమైత్రీ విశ్లేషణ - గ్రహరాజ్యం

జ్యోతిష శాస్త్రంలో గ్రహానికి, గ్రహానికి మధ్య విరోధం, మైత్రి, ఉదాసీనత అనే సంజ్ఞలు ఉన్నాయి. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. అవి నైసర్గిక మైత్రి, తాత్కాలిక మైత్రి. నైసర్గిక మైత్రి అంటే స్వభావ సంబంధమైన మైత్రి. నైసర్గిక మైత్రిని పరిశీలించే ముందు గ్రహాల స్వభావాన్ని పరిశీలిద్దాం.

రవి: న్యాయ రక్షుడైన ప్రభువు. ఇతని స్వరాశి అయిన సింహ లగ్న జనితులు ధర్మం విషయంలో స్వపరబేధం లేకుండా ప్రవర్తిస్తారు.

10, మే 2021, సోమవారం

గోధూళికా ముహూర్తము

గోధూళికా ముహూర్తము

సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోదూలికా ముహూర్తమని అనబడును. విపులంగా చెప్పాలి అని అంటే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి. ఉదయాన్నే ఊరి బయటకు మేత కొరకు పశువులను తోలుకు పోయేవారు. తిరిగి సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు.

అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది.
అలాంటి సమయమును గోదూలికా ముహూర్తముగా వివరించితిరి. క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4.30 నిమషముల నుండి సుమారు 6 గంటల వరకు ఈ సమయము ఉండును. దీనినే గోదూలికా ముహూర్తము అని అంటారు. ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును. వర్జ్యము, దుర్మూహర్తములతో పనిలేదు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...