కుజ, శుక్రుల సంయోగ దోష నివారణకు “తెల్ల పగడం”
జాతక చక్రంలో కుజ, శుక్రులు కలసి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు వారిద్దరి మధ్య సంయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుజ, శుక్రుల కలయిక జీవితంలో వైవాహిక జీవితంపైన, సంసార జీవితంపైన ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చెడు గ్రహ ప్రభావం వలన కామ కోరికలు అధికంగా కలగి ఉండటం, లైంగిక సమస్యలు కలిగి ఉండటం జరుగుతుంది.
కుజ, శుక్రుల సంయోగ దోషాన్ని నివారించటానికి, వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోవటానికి తెల్ల పగడం చేతికి ధరించటం గాని, లాకెట్ గా మెడకు ధరించటం గాని చేయటం మంచిది. తెల్ల పగడాన్ని కుడి చేతికి గాని, ఎడమ చేతికి గాని ధరించ వచ్చును. చూపుడు వ్రేలు లేదా ఉంగరపు వ్రేలు లేదా మద్య వ్రేలుకు ధరించవచ్చును. 5 క్యారేట్స్ నుండి 10 క్యారేట్స్ వరకు ధరించవచ్చును. తెల్ల పగడాన్ని ధరించటానికి ముందు కొబ్బరి పాలలో వారం రోజుల పాటు ఉంచి ధరించటం మంచిది.
ప్రధమ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే అనేక ప్రదేశాలు సందర్శిస్తారు. స్ధిరాస్తులు కలగి ఉంటారు. లైంగిక సమస్యలు ఎదుర్కొనవచ్చును. ఆకస్మిక కోపంతో ఇబ్బంది పడతారు. వివాహ బాగస్వామితో మనస్పర్దలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖానికి మొటిమలు ఉండటం గాని మచ్చ ఉండటం గాని జరగచ్చు.ద్వితీయ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే చేతిలో డబ్బు వృధాగా ఖర్చు పెడతారు. కుటుంబంలో ఆడవారి పెత్తనం ఉండటం. కుటుంబ పోషణ బారాన్ని మోయటం. కుటుంబంలో సభ్యులను మాటల ద్వారా అదుపు చేసిన బయట వ్యక్తుల దగ్గర తమ మాటల ద్వారా ఇబ్బంది కలగచ్చు. విద్యలో ఆటంకాలు ఉంటాయి. గొంతు సమస్యలు ఉంటాయి. చిన్న విషయాలకు అభద్దాలు చెబుతారు. పంటి సమస్యలు ఉంటాయి.
తృతీయ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. సోదరిపై ప్రేమ కలగి ఉంటారు. సోదరి సహకారం కలగి ఉంటారు. మహిళల సహకారం కలగి ఉంటారు. రచనలు చేయటం గాని పుస్తక రచనలు చేస్తారు. రాజకీయాలలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. శిల్ప కళలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆయుధాలను, యంత్రాలను సమర్ధవంతంగా ఉపయోగించగలరు.
చతుర్ధ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే చదువులో ఆటంకాలు కలుగుతాయి. తల్లితో విభేదాలు ఉంటాయి. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం కలుగుతాయి. వాహన రిపేర్లు ఉంటాయి. తల్లి ఒక సంపన్న కుటుంబం నుండి వస్తుంది. ఎప్పుడు స్ధాన మార్పిడి చేస్తారు.
పంచమ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే సంతానం ఇబ్బంది కలిగిన స్త్రీ సంతానం కలగి ఉంటారు. క్రూరంగా ఆలోచిస్తారు. సాంకేతిక అధ్యయనాలు చేస్తారు. దైవ సంబంధ కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రేమ వివాహాలు విఫలం కావచ్చు.
షష్టమ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే సులభంగా అప్పులు చేస్తారు. అనారోగ్య సమస్యను కలిగి ఉంటారు. జీర్ణ సంబందమైన సమస్యలు. స్త్రీ విషయంలో గొడవలు లేదా కోర్టు సమస్యలు. సుఖ వ్యాధులు. మహిళల తో ఇబ్బందులు ఉంటాయి.
సప్తమ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే జీవిత భాగస్వామితో మనస్పర్దలు, వ్యాపార బాగస్వామితో విభేదాలు, లైంగిక సమస్యలు ఉంటాయి. సామాజిక సంబంధాలు బాగుంటాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. ఇతరులను తొందరగా అపార్ధం చేసుకుంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
అష్టమ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే మంచి నడవడిక ఉండదు. రహస్య వ్యవహారాలు చేస్తుంటారు. ఆకర్షణకు లొంగిపోతారు. బయటకు చెప్పుకోలేని వ్యాధితో బాధ పడతారు. సుఖ వ్యాధులు ఇబ్బంది పెడతాయి. మాంగళ్య దోషం ఉంటుంది. మందుప్రియులుగా ఉంటారు. పందేలు, షేర్ మార్కెటింగ్ చేసే అవకాశాలు ఉంటాయి.
నవమ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే ఆలోచించేది ఒకటి చేసేది మరొకటి. జీవితంలో కష్టాలు, సుఖాలు రెండు చవిచూస్తారు. తండ్రితో అపార్ధాలు. సంతాన విషయంలో ఆందోళన ఉంటుంది. విదేశాలలో వివాదాస్పదంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దశమ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే కష్టపడి పనిచేస్తారు. మంచి గుర్తింపు కలిగి ఉంటారు. పిత్రార్జితం కలసి వస్తుంది. తనపై అధికారుల అజమాయిషీ ఉంటుంది. పోటితత్వంతో పనిచేస్తారు. న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.
ఏకాదశ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే ఆదాయ మార్గాలు కలిగి ఉంటారు. పలు విధాలుగా సంపాదిస్తారు. సాహసోపేతమైన విజయాన్ని పొందుతారు. అన్నాని గాని అక్కని గాని కలిగి ఉంటారు.
ద్వాదశ భావంలో కుజ, శుక్రులు కలసి ఉంటే ఋణాను బంధాలను కలిగి ఉంటారు. విలాసవంతంగా ఖర్చు పెడతారు. చెడు కలలు ఇబ్బంది పెడతాయి. నాట్యంలో రాణిస్తారు. ఇతరుల మహిళలకు ఖర్చు పెడతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి