19, జనవరి 2018, శుక్రవారం

సరస్వతి రుధ్రాక్ష కవచం

సరస్వతి రుధ్రాక్ష కవచం


        సరస్వతి రుద్రాక్ష కవచాన్ని సోమవారం రోజు గాని, బుధ వారం రోజు గాని, గురు వారం రోజు గాని, శుక్ర వారం రోజు గాని, వసంత పంచమి రోజు గాని మరియు విశిష్టమైన రోజులలో శివాలయంలో అభిషేకం చేయించటం గాని సరస్వతి ఆలయంలో పూజ చేపించటం గాని చేసి శివ పంచాక్షరి
మంత్రాన్ని లేదా సరస్వతి మంత్రాన్ని చదువుతూ మెడలో గాని చేతికి గాని ధరించటం వలన విద్యా సంబంధ విషయాలలోను, చదువులో ఆటంకాలను తొలగిస్తుంది. సిగ్గు, బిడియం లేకుండా అనర్గళంగా మాట్లాడే సామర్ధ్యాన్ని కలిగిస్తుంది. చదువులో అశ్రద్ధ లేకుండా బాధ్యతగా చదువుపై ఆసక్తిని కలిగిస్తుంది. సరస్వతి రుద్రాక్ష కవచం విధ్యాభివృధ్దికి, ఉన్నత విద్యను అభ్యసించటానికి చాలా మంచిది. సరస్వతి రుద్రాక్ష కవచంలో చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి (4, 5, 6) రుధ్రాక్షలు ఉంటాయి. శుభ గ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహ దోషాలను సరస్వతి రుద్రాక్ష ధరించటం వలన నివారించవచ్చును. 


      సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న చతుర్ముఖి రుధ్రాక్షకి బుధ గ్రహం అధిపతి. చతుర్ముఖి రుధ్రాక్ష ధరించటం వలన పిల్లలకి తనంతట తాను చదువుకోవాలనే బుధ్దిని కలిగిస్తుంది. మంచి ఙ్ఞాపక శక్తి కలిగిస్తుంది. వాక్శుధ్దిని కలిగిస్తుంది. రచన సామర్ధ్యాన్ని కలిగిస్తుంది. మానసిక స్వస్ధత కలుగుతుంది. బుధ్ది వికాసం కలుగుతుంది. మాటలు సరిగా రాని, మాటలు తడబడుతున్న వారిని సైతం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే సామర్ధ్యాన్ని చతుర్ముఖి రుద్రాక్ష కలిగి ఉండటం విశేషం. చతుర్ముఖి రుద్రాక్ష ధరించటం వలన బుధగ్రహ దోషాలను అరికడుతుంది.

      సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న పంచముఖి రుధ్రాక్షకి గురువు అధిపతి. పంచముఖి రుద్రాక్ష ధరించటం వలన గురు గ్రహ దోషం నుండి విముక్తి కలుగుతుంది. పంచముఖి రుధ్రాక్ష ధరించటం వలన ఆలోచనా విధానంలో మార్పులు కలుగుతాయి. ఊహాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు వ్రాసేవారికి, పండితులు, సైంటిస్టులకి, కవితలు వ్రాసేవారికి మంచి ఆలోచనా విధానాన్ని కలిగిస్తుంది. పంచముఖి అభ్యసించుటకు ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిలు లేకుండ ఒక ప్రత్యేకమైన సంతులనాన్ని నిర్వహిస్తుంది. విద్యకు సంబందించిన ప్రతి అంశం లోను ఊహాత్మకమైన ఆలోచనా విధానం ద్వారా కొత్త కొత్త అంశాలను వెలికి తీసే సామర్ధ్యాన్ని, తెలివితేటలను పంచముఖి రుద్రాక్ష కలిగి ఉండటం విశేషం.

      సరస్వతి రుద్రాక్ష కవచంలో ఉన్న షణ్ముఖి రుధ్రాక్షకి అధిపతి శుక్రుడు. షణ్ముఖి రుధ్రాక్ష ధరించటం వలన చదువులో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని కలిగిస్తుంది. శుక్రగ్రహ దోషాలను షణ్ముఖి రుద్రాక్ష ధరించటం ద్వారా ఉపశమనం కలిగించవచ్చును. బుధ్ది మాంద్యం నివారించబడుతుంది. చదువులో వెనకబాటుతనాన్ని నివారించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే సామర్ధ్యాన్ని కలిగిస్తుంది.  మేధాశక్తిని, బుద్ధి బలాన్ని కలిగిస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో లౌకిక ఙ్ఞానాన్ని కలిగిస్తుంది. స్ఫురణ శక్తిని కలిగిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...