29, మే 2016, ఆదివారం

అష్టకవర్గు పద్ధతి


అష్టకవర్గు పద్ధతి 

హోరా మకరందం అను గ్రంధంలో జాతకుని జన్మ సమయమునకు ఆయా గ్రహములు ఉండు స్ధానముల నుండి, మరియు లగ్నం నుండి  సప్త గ్రహముల గోచార గమనముల యొక్క ఫలముల వలన ఒక ఉమ్మడి లబ్ధమూలమైన అష్టకవర్గు అను ఫలితం ఏర్పడుతుంది.  ప్రతిగ్రహం జాతకచక్రంలో లగ్నం నుండి తను ఉన్న ప్రదేశం నుండి ఆయా గ్రహాలు ఉన్న స్ధానం నుండి శుభత్వాన్ని ఇస్తుంది. 

ఉదా:- జన్మ సమయమున రాశి చక్రములో రవి నిర్దేశిత రాశిలో ఉండగా అట్టి రాశి ఉన్న స్ధానం నుండి, ఇతర గ్రహములు ఉన్న స్ధానం నుండి కూడా పరిగణించగా కొన్ని స్ధానములు మాత్రమే రవి యొక్క కిరణ ప్రభావమునకు లోనై అనుకూలముగా పరిగణించబడతాయి. 


అష్టకవర్గును ఈ క్రింది విధంగా ఉపయోగించవచ్చును.
1.     గ్రహముల యొక్క భావముల యొక్క సాధారణ బలము.
2.    కొన్ని నిర్ధిష్టమైన, ముఖ్యమైన జీవిత సంఘటనలను ముందుగా అంచనా వేయగలగటం.
3.    గోచార ఫలితాలను ముందుగా అంచనా వేయుట.                                                               
4.    ఆయుర్ధాయమును నిర్ణయించుట. 

సప్తగ్రహాలు మరియు లగ్నం కలిపి అష్టకవర్గు అంటారు. రాహు కేతువులను లెక్కవేయరు. రాహు కేతువులు అవి ఉన్న రాశ్యాధిపతి యొక్క, ఆ నక్షత్రాధిపతి యొక్క అష్టకవర్గు బిందువులను తీసుకొనవచ్చును.

ప్రతి గ్రహం ఏ రాశిలో అయిన 8 బిందువుల కంటే ఎక్కువ రావు. రాశి మొత్తం 56 బిందువుల కంటే ఎక్కువ రావు. ప్రతి రాశిలోను 56 బిందువులకు కనీసం 28 బిందువుల కంటే ఎక్కువ వస్తే మంచిది. 28 కంటే తక్కువ వచ్చిన రాశి బలహీనంగా ఉంటుంది. సప్తగ్రహాల ద్వారా సర్వాష్టక వర్గుల బిందువుల మొత్తం =337. శుభ స్ధానాలను బిందువు లేక సున్నా అశుభ స్ధానాలను రేఖ లేదా అడ్డుగీత రూపంలో గుర్తిస్తారు.  

ఎవరి జాతకచక్రంలో అయిన ఏ గ్రహం అయిన తనంత తానుగా అనుకూలించే శుభ బిందువులు పైవిధమైన శుభ బిందువులనే కలుగజేస్తుంది. రవి అష్టకవర్గు బిందువుల మొత్తం =48, చంద్ర అష్టకవర్గు బిందువుల మొత్తం =49, కుజ చంద్ర అష్టకవర్గు బిందువుల మొత్తం =39, బుధ చంద్ర అష్టకవర్గు బిందువుల మొత్తం =54, గురు చంద్ర అష్టకవర్గు బిందువుల మొత్తం = 56, శుక్ర చంద్ర అష్టకవర్గు బిందువుల మొత్తం =52, శని చంద్ర అష్టకవర్గు బిందువుల మొత్తం = 39. 

ఉదా:- రవి కన్యా రాశిలో ఉన్నాడు అనుకుంటే 1,2,4,7,8,9,10,11 రాశులలో  శుభ బిందువులు ఇస్తాడు. కన్య, తుల, ధనస్సు, మీనం, మేషం, వృషభం, మిధునం, కర్కాటక రాశులలో శుభ బిందువులు ఇస్తాడు. ఈ విధంగా అన్ని గ్రహాలకు, లగ్నానికి  బిందువులు వ్రాసుకొని సర్వాష్టకవర్గును పరిశీలించి ఫలితాలను చెప్పవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...