విద్యాకారకుడైన
బుధుడు జాతకచక్రంలో అస్తంగత్వం లేదా మీన రాశిలో నీచలో ఉన్నప్పుడు లేదా 6,8,12 స్ధానాలలో ఉండి శత్రుస్ధానంలో ఉండి
ఎటువంటి శుభదృష్టి లేనప్పుడు పాదరస మాలతో విష్ణు సహస్త్ర నామం పఠించిన ఉన్నత
విద్యలను అభ్యసిస్తారు.
వాక్శుద్ధికి
కారకుడు బుధుడు. వాక్ ప్రాదాన్యత కలిగిన వ్యాపారంలో వ్యాపారాభివృద్ధి అవసరమైన
ఆలోచన,
అవతలి వ్యక్తులు ఏవిధంగా చేబితే వినగలరో ఆ విధంగా చెప్పగలిగే సామర్ధ్యం కలిగిస్తుంది
పాదరస మాల. పాదరస మాలను ధరించిన రాజకీయాలలో
ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడగలిగే సామర్ధ్యాన్ని కలిగిస్తుంది. పాదరస మాల
ధరించిన, జపం చేసిన పండితులకు, కవులకు, మేధావులకు, వేదాంతులకు అవసరమైన విజ్ఞానాన్ని, ఆలోచనా విధానాన్ని సూక్ష్మ పరిశీలన జ్ఞానాన్ని కలిగిస్తుంది.
రహస్య విధ్యలైన
జ్యోతిష్యం, తంత్ర శాస్త్రం, మంత్ర శాస్త్రం మరియు గణితశాస్త్రం, చిత్ర కళలు, క్రీడలు, అన్ని రకాల వ్యాపారాభివృద్ధి పనికి వచ్చే ఆలోచనా విధానం, అన్ని రకాల విద్యలు, మేధావులుగా, పండితులుగా మొదలైన శాస్త్రాలలో ఎదగటానికి
బుధగ్రహ ప్రాదాన్యత ఎంతో అవసరం. ఈ బుధుడు జాతక చక్రంలో అనుకూలంగా లేనప్పుడు పాదరస
మాలను ధరించటం గాని జపం చేయటం గాని చేసిన మంచి ఫలితాలు పొందవచ్చును.
పురాతన వేదాల
ప్రకారం స్వచ్చమైన పాదరస మాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతనే కాకుండా ఆయుర్వేద శాస్త్రంలో
వైద్యపరంగాను ప్రాముఖ్యత కలిగి ఉంది. రసరత్నాకరం, రస ఛందస్సు, పారద సంహిత, రసేంద్ర చూడామణి వంటి ఆయుర్వేద శాస్త్రం గ్రంధాల ఆధారంగా పాదరసమాలతో జపం చేసి మెడలో ధరించిన అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, మానసిక ఒత్తిడిని
నివారిస్తాయి. లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతాయి.
పాదరసమాలతో మహా
మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే దీర్ఘకాలిక వ్యాధులను, ఆకస్మిక మరణాలను దూరం చేస్తాయి. పాదరసమాలతో జపం చేసిన, ధరించిన నరదృష్టి, చెడుశక్తులు దరిచేరవు. పాదరసమాల స్పర్శ
చేతనే త్రిలోకాలను దర్శించినంత పుణ్యం లభిస్తుంది. పాదరసమాల ధరించి “ఓం నమశ్శివాయ” అను మంత్రం జపించినంత మాత్రము చేతనే వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాలు, ప్రమోషన్లు, విజయం, ఆరోగ్యం, సంపద, పేరు, కీర్తి, ఆస్తి, శాంతి మరియు సామరస్యాన్ని ఆరోగ్యం, కోరికలు నెరవేరటం మరియు మోక్షాన్ని
పొందగలరు. బ్రహ్మహత్యా మహా పాతుక దోషాలను సైతం హరిస్తుంది.
మంచి విషయం తెలియచేశారు.
రిప్లయితొలగించండి