గురువింద గింజలను “గౌడియ వైష్ణవులు” రాధా రాణి మొక్క పాద ముద్రలుగా పూజించేవారు. వీరు ఈ గింజలను “సాలగ్రామ” పూజలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలల్లో మరగబెట్టిన తరువాత అధిక ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు దానిలో ఉన్న విష లక్షణాలు కలిగించే ప్రోటీన్స్ గుణాన్ని కోల్పోయే విధంగా చేసి ఉపయోగించేవారు. గొప్పలు చెప్పుకొని ఎదుటి వాళ్ళను అవమానించే వాళ్ళను గురువింద గింజలతో పోలుస్తారు.
గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదని శాస్త్రం. పూర్వ కాలంలో గురువింద గింజలను బంగారం తూకం వేయటానికి ఉపయోగించేవారు. బంగారం తూచి ఇన్ని గురువింద గింజల ఎత్తు అనేవారు. గురువింద గింజ ఆకులను కొంత నోట్లో వేసుకొని నమిలిన తరువాత ఒకచిన్న రాయిని నోట్లో వేసుకొని నమిలితే ఆశ్చర్యంగా ఆ రాయి సునాయసంగా నలిగి పిండి అయిపోతుందని పెద్దల మాట. ఆయుర్వేదం లో ఈ గింజలలోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడుతున్నారు. గురువింద గింజలు ఆరావళి పర్వత ప్రాంతాల యందు, భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన అడవులలోను విరివిగా లభిస్తాయి.
గురువింద గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఈ గింజలను 8 లేక 11 దీపావళి మరియు అక్షయతృతీయ పర్వదినాలలో ప్రత్యేకంగా పూజించి ఎరుపు గుడ్డలో కుంకుమతో పాటు ఉంచి బీరువాలోగాని, గళ్ళాపెట్టెలో గాని ఉంచిన ధనాభివృద్ధి, లక్ష్మీ కటాక్షంతో పాటు సుఖసౌఖ్యాలు కలుగుతాయి. ఈ గింజలు చెడు నరదృష్టి, చెడు ప్రభావాలను తొలగిస్తుంది. ఈగింజలు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులలో లభ్యమవుతాయి. వీటిలో ఎరుపు, నలుపు తప్ప మిగతా రంగులు బహు అరుదుగా లభిస్తాయి.
తెలుపు రంగు గింజలు “శుక్రగ్రహ”దోష నివారణకు, ఎరుపు రంగు గింజలు “కుజగ్రహ” దోష నివారణకు, నలుపు రంగు గింజలు “శనిగ్రహ”దోష నివారణకు,పసుపు రంగు గింజలు “గురుగ్రహ దోష నివారణకు, ఆకుపచ్చ గింజలు బుధగ్రహ దోష నివారణకు ఉపయోగ పడతాయి. ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు గింజలను చేతికి “కంకణాలు” గాను, కాళ్ళకు “కడియాలు” గాను చేపించుకొని వాడిన గ్రహ దోషాలు నివారణగును. ఇలా దరించటం వలన గ్రహదోషాలే కాకుండా నరదృష్టి కూడా తొలగిపోతుంది. గురువింద గింజలు గురుగ్రహ దోషాలను పోగొడతాయని కొంతమంది నమ్మకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి