28, మే 2016, శనివారం

వాస్తు పురుషుని దేవతా స్ధాన నిర్ణయం



వాస్తు పురుషుని దేవతా స్ధాన నిర్ణయం 

దేవతలు వాస్తు పురుషుని శరీరమును ఆశ్రయించి ఉన్నారు. వాస్తు పురుషుడు భూమిని ఆశ్రయించి ఉన్నాడు. కనుక భూమి యందు దేవతా స్ధానాన్ని తెలుసుకొనవలెను. స్దిర పురుషుని శరీరమందు ఆదిత్య సంబంధమైన 53 మంది దేవతలు గలరని, చర వాస్తు పురుషుడు సూర్యచార భేధమును బట్టి మారుచుండును. దీనిని బట్టి భూమిపైన పడు సూర్య కిరణాలకు గృహాది నిర్మాణాలకు సంబంధం ఉన్నదని తెలుస్తుంది. 


ఈశాన్యదిక్కుతో ప్రారంభమై 32 దేవతాస్ధానములు ఏర్పడినవి. వీరికి బాహ్యదేవతలని పేరు. 1. ఈశానుడు, 2. పర్జన్యుడు, 3. జయంతుడు, 4. మహేంద్రుడు, 5. ఆదిత్యుడు, 6. సత్యుడు, 7.భృశుడు, 8. అంతరిక్షుడు, 9. అగ్ని, 10. పూష, 11. వితధుడు, 12. రాక్షసుడు, 13. యముడు, 14. గంధర్వుడు, 15. బృంగరాజు, 16. మృష, 17. పితృదేవతలు, 18. దౌవారికుడు, 19. సుగ్రీవుడు, 20. పుష్పదంతుడు, 21. జలాధిపుడు, 22. అసురుడు, 23. శోషము, 24. రోగం 25. వాయువు, 26. నాగము, 27. ముఖ్యుడు, 28. భల్లాటము, 29. సోముడు, 30. మృగము, 31. అదితి, 32. ఉదితి  అను 32 మంది దేవతలు బాహ్య దేవతలుగా నిర్ణయింపబడినారు. 

మయమతం నందు ఈశాన్య దిక్కు లోపలి భాగము నందు ఆపస్సు, ఆపవత్స అను ఇద్దరు దేవతలు, ఆగ్నేయ దిక్కు లోపలి భాగం నందు సవింద్ర, సావింద్ర  అను ఇద్దరు దేవతలు, నైరుతి దిక్కు యొక్క లోపలి భాగం నందు ఇంద్ర, ఇంద్రజయ అను ఇద్దరు దేవతలు, వాయువ్య దిక్కు లోపలి భాగము నందు రుద్ర, రుద్రజయ అను ఇద్దరు దేవతలు, క్షేత్ర మధ్యమందు శంభు, శబ్ధ వాచకుడగు బ్రహ్మ కలడు. బ్రహ్మ యొక్క  చతుర్ముఖములలోను (నాలుగు దిక్కులలోనూ) ఆర్యముడు, వివస్వానుడు, మిత్రుడు, భూధరుడు అను నలుగురు దేవతలు కలరు. 

వాస్తు క్షేత్ర బహిర్భాగమునందు ఈశాన్యములో చరకి, ఆగ్నేయములో విదారి, నైరుతిలో పూతన, వాయువ్యమునందు పాప రాక్షసి అను నలుగురు స్త్రీ దేవతలు కలరు. వీరికి బలి కర్మ యందు మాత్రమే వినియోగం చెప్పబడినది.  తూర్పున సర్వస్కంధుడు, దక్షిణమున ఆర్యముడు, పశ్చిమమున జృంభకుడు, ఉత్తరాన పిలి ఫించకుడు అను నలుగురు దేవతలు కలరు. వీరికి క్షేత్రమునందు పద భోగములేదు. వీరితో మొత్తం 53 మంది దేవతలు. ఈ 53 మంది దేవతలలో చరకి, శర్వస్కంధుడు, విదారి, ఆర్యముడు, పూతన, జృంభకుడు, పాప రాక్షసి, పిలి ఫించకుడు అను ఎనిమిది మంది దేవతలకు గృహాది నిర్మాణాదులకు స్వీకరింపబడినను క్షేత్రమందు అధికారము లేదు. వీరు బాహ్య దేవతలుగానే చెప్పబడినారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...