17, డిసెంబర్ 2016, శనివారం

నీలము స్టోన్ (Blue Sapphire)

నీలము స్టోన్

నీలము రత్నానికి ఇండ్రం, అశ్మఫారం, తృణమణి, మాసారం, సుసారం, గల్వర్కం, భోదకం అనిపేర్లు గలవు. స్పటికామ్ల జనిత లోహ జాతికి చెందినవి. ఇది శనిగ్రహానికి ప్రతీక. శని పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవిల సంతానంగా చెబుతారు. ఒకసారి సూర్యుని మిగతా సంతానానికి శనిపై కోపం వచ్చి గొడవకు దిగటం. ఆ గొడవలో శనిని కొట్టటం, శని కాళ్ళకు దెబ్బ తగలటం జరుగుతుంది. దానితో శని శాశ్వతంగా కుంటుతు, నిధానంగా శ్రమపడుతూ నడుస్తూ ఉంటాడు. అందుకే శనిని మందడు, మందగమనుడు అంటారు.

1, డిసెంబర్ 2016, గురువారం

కనక పుష్యరాగం (Yellow Sapphire)

పుష్యరాగం

పుష్యమి నక్షత్రమువలె మెరుస్తూ ఉంటుంది కాబట్టి దీనికి “పుష్యరాగము” అనే పేరు వచ్చింది. పుష్యరాగంను పుష్పరాజ్, పుక్ రాజ్, గురురత్నం, గురువల్లభ, పీతమణి,  వాచస్పతి,  పుష్యమి,  శ్వేతమణి, జీవమణి అనే పేర్లతో పిలుస్తారు.

పుష్యరాగాలు ఎక్కువగా బ్రెజిల్, అమెరికా, శ్రీలంక, బర్మా, రష్యా, ఆస్ట్రేలియా, పాకిస్ధాన్, మెక్సికో, జపాన్, ఆఫ్రికా దేశాలలో లభిస్తాయి.గులాబీ రంగు పుష్యరాగాలు రష్యా, బ్రెజిల్, పాకిస్ధాన్ దేశాలలో అరుదుగా లభిస్తాయి. పుష్యరాగము అగ్నిపర్వత శిలలో, పెగ్మటెట్ పొరలలో లభ్యమవుతుంది. లేత గులాబీ రంగు గల పుష్యరాగాలు, బంగారు ఛాయతో మెరిసే పుష్య రాగాలు చాల తక్కువగా లభ్యమవుతాయి. ఇవి అత్యంత  విలువ కలవిగా ఉంటాయి. వర్ణరహితము గల పుష్యరాగములను పరానీలలోహిత కిరణాల ద్వారా గురి కాబడి నీలిరంగు పుష్యరాగాలుగా కూడా సృష్టించవచ్చును. సాన పెట్టుటకు వీలు కలిగినది పుష్యరాగం. క్రీ.శ 17 వ శతాబ్ధంలో పోర్చుగీసు రాజు కిరీటంలో పొదగబడిన పుష్యరాగం 1640 క్యారెట్లు ఇంతవరకు లభించిన వాటిలో పెద్దది. ఇది రంగులేని పుష్యరాగం. వాటికన్ సిటీలో 16×12 అంగుళాల పుష్యరాగపు శిల ఉంది.

25, నవంబర్ 2016, శుక్రవారం

వజ్రం (డైమండ్) -Diamond

వజ్రం (డైమండ్)

వజ్రానికి అధిపతి రాక్షస గురువు అయిన శుక్రుడు. దీనికి పూలకం, హారం, మగమాణిక్యం, వైక్రాంతం, కుంఠం, కులిసం, గిరి జ్వరం, గిరి కంఠు, వజ్రం, మూలరాయి, నిర్ఘాతము, చితకమ, రవ్వ, హీరా అనే పేర్లు గలవు. భూమిపై లభ్యం కాగల పదార్ధాలలో అత్యంత గట్టి పదార్ధం వజ్రం. భూగర్భంలో 80 కి.మీ లోతున అత్యధిక ఉష్ణోగ్రత పీడనంలో బొగ్గులాగే కార్బన్ అణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని వజ్రాలుగా రూపొందుతాయి. వజ్రం యొక్క విలువను క్వాలిటీ, కటింగ్, కలర్, క్యారెట్(4 సి) అనే నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయి.

8, నవంబర్ 2016, మంగళవారం

జ్యోతిష శాస్త్ర చిట్కాలు (Techniques In Astrology)



జ్యోతిష శాస్త్ర చిట్కాలు 

జన్మలగ్నం చరరాశియై లగ్న భాగ్యాధిపతులు చరరాశిలో ఉంటే జాతకుడు తండ్రిని విడిచి చాలా దూరప్రదేశాలకు పోవును. 

చతుర్ధమున శని, దశమమున చంద్రుడు సప్తమమున కుజుడు ఉంటే అంగవైకల్యం కలుగుతుంది.
లగ్న యమకంఠక స్ఫుటములను ఏకం చేయగా వచ్చు రాశి, నవాంశలు మిధున, సింహం, తుల, వృశ్చిక, కుంబ రాశులలో  పడి శుభగ్రహ సంబంధం ఉంటే సంతానం చిన్న వయస్సులోనే కలుగుతుంది. ఈ స్ఫుటమునకు శని సంబంధముంటే సంతానం ఆలస్యమవుతుంది. ఈ స్ఫుటమునకు శని, రాహువుల సంబంధముంటే సంతానం కొరకు చాలా ప్రయత్నములు చేసి చివరకు దత్తత గాని వేరే పిల్లలను పెంచుకోవటం గాని జరగచ్చు. 

5, నవంబర్ 2016, శనివారం

రుద్రాక్ష ధారణ వాటి ఫలితాలు

"రుద్రాక్ష" పరమేశ్వరుని కనుల నుండి జాలువారిన కన్నీళ్ళే భూమిపైన రుద్రాక్షలుగా ఉద్భవించాయి. రుద్రాక్ష పుట్టుక గురించి పురాణాలలో అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. పురాణ శాస్త్ర ప్రకారం శివుడు రాక్షసులతో పోరాడి మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారిస్తాడు. అలా శివుడు విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారతాయి. వాటి నుంచి పుట్టినవే “రుద్రాక్షలు”.

శివుని కుడికన్ను అయిన ‘సూర్యనేత్రం’ నుండి పన్నెండురకాల రుద్రాక్షలు, ఎడమకన్ను అయిన ‘చంద్రనేత్రం’ నుండి పదహారు రకాల రుద్రాక్షలు, మూడవ కన్ను అయిన ‘అగ్నినేత్రం’ నుండి పది రకాల రుద్రాక్షలు వచ్చాయని శాస్త్ర వచనం. సూర్యుని నుండి వచ్చినవి ‘ఎర్ర’గాను, చంద్రుని నుండి వచ్చినవి‘తెల్ల’గాను,అగ్ని నుండి వచ్చినవి ‘నల్ల’ గాను ఉంటాయని దేవీ భాగవతంలో తెలియజేయబడింది.

రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

4, నవంబర్ 2016, శుక్రవారం

జ్యోతిష శాస్త్ర చిట్కాలు



జ్యోతిష శాస్త్ర చిట్కాలు

జాతకచక్రంలో ఎక్కువ డిగ్రీలు నడచిన గ్రహం నవాంశలో చంద్రుడు ఉండే రాశిలో పడుతుందో వారు గొప్ప గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. లేదా చంద్రుడు ఆత్మకారకుడైన చాలు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

రాశిచక్రంలో చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి లగ్నాన్ని, చంద్రుడిని రెండిటినీ చూస్తూ ఉన్న గ్రహం 10, 11 భావాలకు సంబంధించిన లేదా ఆరుద్ర, పుష్యమి, మఖ, శ్రవణ, రేవతి నక్షత్రాలలో ఉన్న గ్రహం పాప గ్రహం ఐన మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ గ్రహ దశలో పేరు ప్రతిష్టలు, ప్రమోషన్స్, ఆర్ధిక లాభం, శుభకార్యాలు జరగటం కలుగుతాయి. 

3, నవంబర్ 2016, గురువారం

విపరీత రాజయోగాలు



విపరీత రాజయోగాలు




ఉత్తర కాలామృతం ప్రకారం 6-8-12 అధిపతులు నైసర్గికత్వంతో సంబంధం లేకుండానే అంటే శుభులైన, పాపులైన 6-8-12 భావాలలో ఉంటే రాజయోగాన్నిస్తారు. 6-8-12 భావాధిపతులు అందరు కలసి గాని, విడివిడిగాగాను 6-8-12 రాశులలో ఎక్కడ ఉన్న విపరీత రాజయోగం పడుతుంది. వీరి కలయిక కూడా శుభమే. ఆదిపత్య విషయంలోనూ, శత్రు, మిత్ర రాశులలో ఉన్నారా అనేది చూడనక్కరలేదు. జాతకచక్రంలో విపరీత రాజయోగాన్ని పొందిన జాతకుడు 6-8-12 భావాధిపతుల దశ, అంతర్ధశలలో ఉద్యోగంలో ఉన్నతి, గొప్ప పేరు ప్రతిష్ఠలు, ప్రభుత్వంలో మంచి పలుకుబడి, సౌఖ్యాలు పొందుతాడు. 

22, అక్టోబర్ 2016, శనివారం

పాదరస లక్ష్మీ గణపతి

పాదరస లక్ష్మీ గణపతి
                     వినాయకుడితో కలిపి లక్ష్మీదేవిని పూజించడం భారతీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. అంతే కాకుండా సంపదలిచ్చే స్వరూపంగా వినాయకుణ్ని లక్ష్మీగణపతిగా పూజిస్తారు. ఒక్క విష్ణుమూర్తి స్వరూపాలను తప్ప ఎవ్వరినీ లక్ష్మీదేవితో కలిపి పూజించరు. వినాయకుణ్ని పూజించడం వెనుక ఎన్నో విశేషాలు మనకు కనిపిస్తాయి.

17, అక్టోబర్ 2016, సోమవారం

నవగ్రహ స్టోన్ శివలింగాలు

నవగ్రహ స్టోన్ శివలింగాలు

నవగ్రహ స్టోన్ శివలింగాలు నిత్యం అభిషేకం చేసే వారికి అనారో గ్యాలు తొలగి దీర్ఘాయుర్ధాయం కలుగును. జ్యోతిష్యశాస్త్రంలో ఆయా గ్రహాలకు వేరు వేరుగా వచ్చు బాలారిష్ట దోషాలు సైతం తొలగిపోవును. నవగ్రహ శివలింగాలను పూజించి, అభిషేకం చేసిన వారికి సమస్త కార్యములందు విజయం పొందగలరు.
శివలింగానికి నిత్య అభిషేకం జరుగుతున్న ఇంటిలో ఎటువంటి బాధలు ఉండవు. “ఓం త్ర్యంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ !!” అంటూ ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ నవగ్రహ శివలింగాలకు అభిషేకం చేస్తూ వుండటం వలన ప్రాణహాని కలిగించే వివిధ రకాల ప్రమాదాల నుంచి, వ్యాదుల బారి నుంచి రక్షణ లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పూజ సమయంలో ఈ మంత్రాన్ని పఠించడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. అనునిత్యం ఈ మంత్రాన్ని పఠిస్తూ శివలింగ అభిషేక పూజచేస్తూ వుండటం వలన బాలారిష్ఠ దోషాలు తొలగి అది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుందని పురాణ వచనం.

7, అక్టోబర్ 2016, శుక్రవారం

నక్షత్ర గోచారం



నక్షత్ర గోచారం

సకల గ్రహాలు రాశులను చూసినట్లే నక్షత్రాలను కూడా చూస్తుంటాయి. రవి, చంద్రులు తామున్న నక్షత్రం నుండి 14, 15 నక్షత్రాలను చూస్తారు. శని తానున్న నక్షత్రం నుండి 3, 15, 19 నక్షత్రాలను చూస్తాడు. గురుడు తానున్న నక్షత్రం నుండి 10, 15, 19 నక్షత్రాలను చూస్తాడు. కుజుడు తానున్న నక్షత్రం నుండి 3, 7, 8, 15 నక్షత్రాలను, బుధ, సుకృలు తామున్న నక్షత్రం నుండి 1, 15 నక్షత్రాలను చూస్తారు. పూర్ణ చంద్రుని దృష్టి శుభాన్ని, క్షీణ చంద్రుని దృష్టి అశుభ ఫలితాన్ని ఇస్తుంది.

5, అక్టోబర్ 2016, బుధవారం

గర్భాధానం



గర్భాధానం

దంపతుల ప్రధమ సమాగమాన్ని గర్భాధానమని వ్యవహరిస్తారు. బాల్య వివాహాలు ఆచారంగా ఉన్న కాలంలో వివాహానంతరం కొంతకాలానికి స్త్రీలు ఋతుమతులవుతూ ఉంటారు. ఇప్పుడు బాల్య వివాహాలు చట్ట విరుద్ధం కనుక రజస్వల అనంతర వివాహాలే నేడు ఆచారంగా ఉన్నాయి. స్త్రీ రజో దర్శన దినం నుండి నాలుగు దినాలు వర్జ్యాలు. ఆ తరువాత పన్నెండు దినాలు ఋతుకాలం. ఈ కాలంలో సమదినాలందయిన పుత్ర సంతానం బేసి దినాలందయిన స్త్రీ సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. 

25, సెప్టెంబర్ 2016, ఆదివారం

మణి చక్రం



మణి చక్రం
        మణి చక్రం అంటే ప్రార్ధనా చక్రం. ఈ ప్రార్ధనా చక్రాన్ని ఇంటిలో తూర్పు దిక్కున పూజా మందిరంలో గాని, హాలులో గాని ఉంచిన అన్ని ప్రమాదాల నుండి రక్షించి అదృష్టం కలసి వస్తుంది. మణి చక్రం దగ్గర కూర్చొని ఓం మణి పద్మే హం అనే మాత్రాన్ని జపిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని, వాక్శుద్దిని కల్పించి, జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. దృష్టి దోషాలను తొలగిస్తుంది. మణి చక్రాన్ని వాహన ప్రమాదాల నుండి రక్షణ పొందటానికి వాహనాల వారు కూడా ఉపయోగించవచ్చు. తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నవారు, వాహనల రిపేర్ లు ఎక్కువగా ఉన్నవారు మణిచక్రాన్ని డాష్ బోర్డ్ పైన ఉంచిన వాహన ప్రమాదాలు, రిపేర్లు ఉండవు. 

ముంగీస



ముంగీస
     ముంగీస అతి తెలివితేటలకు, సూక్ష్మ పరిశీలనకు పెట్టింది పేరు. కుటుంబంలో కలహాలు లేకుండా చేస్తుంది. దారుణమైన ప్రత్యర్ధలు  పాము ముంగీసలు. కాబట్టి ముంగీసను ఇంట్లో ఉంచిన సర్పదోషాలు ఉన్నవారికి  సర్ప దోషాలను పోగొడుతుంది. నైరుతి దిక్కున ఉంచిన దోషాలు పోగొడుతుంది. జాతకచక్రంలో కాలసర్పదోషాలు, నాగదోషాలు, కుజ దోషాలు ఉన్నవారు ముంగీసను నైరుతి దిక్కున ఉంచిన దోష నివారణ కలుగును. పాము కలలు, చెడు కలలు ఎదుర్కొంటున్నవారు ముంగీసను బెడ్ రూంలో నైరుతి దిక్కున ఉంచిన చెడుకలల నుండి విముక్తి కలుగుతుంది.

కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం



కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం
         కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం అత్యంత శక్తి వంతమైన యంత్రాలలో ఒకటి. కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం పూజ చేసిన సామాన్యులను సైతం సౌభాగ్య వంతులను చేస్తుంది. ఈ భూమిని జలములలో మునిగి పోకుండా తన వీపుపై ధరించి, ఉద్దరించిన విష్ణుదేవుని అవతారమే కూర్మ స్వరూపము. దేవతలచేత అసురుల చేత అమృతానికై సాగరాన్ని చిలికిస్తూ వారందరి చేత కవ్వ రూపంలో ఉండే మందర పర్వతాన్ని ధరించడం కోసం తానే కూర్మ రూపాన్ని ధరించి తన పుష్టంపై ధరించాడు.
       కూర్మ పుష్టం పైన ఉన్న మందర పర్వతాన్ని అవిశ్రాంతంగా మదిస్తుంటే నాలుదిక్కుల వెలుగులను నింపుతూ పద్మంలో కూర్చొని, చేతిలో పద్మాన్ని ధరించి లక్ష్మీదేవి ఆవిర్బవించింది. ఈ లక్ష్మీ సంపదలన్నిటికి ప్రతీక. లక్ష్మీదేవి ఆవిర్భావం తరువాతనే దేవతలకు సకల ఐశ్వర్యాలు కలిగాయి. ఈ విధంగా కూర్మపుష్టం పైన ఆవిర్బవించిన లక్ష్మీదేవి ప్రతిరూపమైన కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రాన్ని పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు, భూసంపద, ధాన్య, వస్తు సంపద కలుగుతాయి.

కూర్మ పుష్ట పిరమిడ్



కూర్మ పుష్ట పిరమిడ్
కూర్మ పుష్ట పిరమిడ్ ఉత్తర దిక్కుకి ఆదిపతి అయిన కుబేర స్ధానంలో
ప్రతిష్ఠించిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. కూర్మ పిరమిడ్ ను ఇంట్లో ఉత్తరదిక్కున ప్రతిష్ఠించిన వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో గాని, వ్యాపార స్ధలంలో గాని ఉత్తర దిక్కున లోపలకు వచ్చేటట్టు ఉంచాలి. వాస్తు దోషాలు పోవటానికి ఓం నమో భగవతే కూర్మ దేవాయ అనే మంత్రంతో భూమి లోపల ఉత్తర దిక్కున ప్రతిష్టించిన వాస్తు దోష నివారణ కలగటమే కాకుండా, నరదృష్టి నివారణ, వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి కలుగుతాయి.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...